వీడియో: సైడ్ మిర్రర్స్ చూడనందుకు భారీ మూల్యం..
రోడ్డుపై వాహనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కేవలం ముందున్న రోడ్డు వైపు, వాహనాల వైపు మాత్రమే చూడకుండా అప్పుడప్పుడూ, ప్రత్యేకించి అవసరమైనప్పుడు సైడ్ (రియర్ వ్యూ) మిర్రర్ల వైపు చూడటం కూడా ఎంతో అవసరం. లైను మారేటప్పుడు లేదా కుడి/ఎడమ వైపుకు మలుపు తిరిగేటప్పుడు, ఓవర్‌టేక్ చేసప్పుడు ఇలా చాలా సందర్భాల్లో రియర్ వ్యూ మిర్రర్లో చూసి సురక్షితమని నిర్థారించుకున్న తర్వాతనే ఆ ప్రయత్నాలు చేయాలి.
మరీ ముఖ్యంగా భారీ ట్రక్కులను నడిపే డ్రైవర్లు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే ఇదిగో ఈ వీడియోలో చూపిన డ్రైవర్ మాదిరిగా మీరు కూడా ఇక్కట్లు పడాల్సి వస్తుంది. ఇందులో ఓ ట్రక్ డ్రైవర్ సెమీ ట్రక్ సాయంతో ఓ భారీ ఐరన్ బీమ్‌ను తీసుకువెళ్తూ టర్నింగ్ సమయంలో సైడ్ మిర్రర్లపై శ్రద్ధ వహించని కారణంగా, సదరు ట్రక్ బోల్తా కొట్టింది. ఆ ట్రక్ వెనుకగా వస్తున్న ఈ కారు డ్యాష్‌బోర్డ్ కెమెరాకు ఈ వీడియో చిక్కింది.
మరి మీరు కూడా ఆ వీడియోని చూసేసి, ఇకనైనా సైడ్ మిర్రర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం మర్చిపోకండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/7dQYbCaxZPA?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








