నాతో డేటింగ్ చేస్తారా.. అయితే రండి మీ ధైర్యమెంతో చూస్తా..
మరికొద్ది రోజుల్లో ప్రేమికుల రోజు (వాలంటైన్స్ డే) రానున్న నేపథ్యంలో, అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని తమ సరికొత్త 2015 ఫోర్డ్ మస్టాంగ్ కారును ప్రమోట్ చేసుకునేందుకు ఓ సరికొత్త ప్రాంక్ (ఫన్నీ వీడియో)ను రూపొందించింది.
ఇందులో ఓ అందమైన యువతి కాఫీ షాపులో కూర్చొని, అక్కడికి వచ్చే యువకులతో డేట్‌కి వెళ్దామని అడుగుతుంది. అందుకు సరే అని ముందుకు వచ్చిన యువకులను తన ఫోర్డ్ మస్టాంగ్ కారులో అలా సరదాగా ఓ రైడ్‌కు తీసుకువెళ్తుంది.
మొదట్లో కారును నెమ్మదిగానే నడిపినప్పటికీ.. ఓ ప్రైవేట్ ట్రాక్‌పైకి రాగానే సదరు యువతి తన డ్రిఫ్టింగ్ స్కిల్స్‌తో ఫోర్డ్ మస్టాంగ్ కారును పరుగులు పెట్టిస్తుంది. కారులోని యువకులు అస్సలు ఇలా జరుగుతుందని ఊహించని, మితమీరిన వేగంతో ఆమె కారు నడుపుతుంటే, వారి హావభావాలు ఎదుటి వారికి నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. ఇదంతా డ్యాష్‌బోర్డుకు అమర్చిన సీక్రెట్ కెమెరాలు రికార్డ్ చేస్తాయి.
మరి ఆ స్పీడ్ డేటింగ్ ప్రాంక్‌ను మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="https://www.youtube.com/embed/3Nyr1Ao7iZA?rel=0&showinfo=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








