వీడియో: శక్తి మించి పవర్ జోడిస్తే, ఇలానే ఎగిరిపోతుంది..
తలకు మించిన భారం మోయకూడని చెబుతుంటారు పెద్దలు, అది వినకుండా మొండిగా ప్రవర్తిస్తే అందుకు తగిన ప్రతిఫలం పొందక తప్పదు. అదేవిధంగా, ఏదైనా కారుకు దాని శక్తికి మించి అదనపు పవర్‌ను జోడిస్తే, ఇదిగో ఈ వీడియోలో చూపినట్లుగానే గాలిలో ఎగిరిపోతుంది.
దాదాపు 3000 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసేలా మోడిఫై చేసిన ఇంజన్‌ను అమర్చిన ఓ ఫోర్డ్ మస్టాంగ్ కారు తలకు మించిన భారం మోయలేక గాలిలో ఫల్టీలు కొట్టుకుంటూపోయి రిపేరు చేయటానికి కూడా వీలు లేనంతగా నుజ్జునుజ్జయ్యింది.
ఇది కూడా చూడండి: అంబులెన్స్ వాహనాలకు దారి ఇవ్వని ఇండియన్స్
డ్రాగ్ రేసర్ డెన్నిస్ బైలీ ఓ 3000 హెచ్‌పి ట్విన్ టర్బోచార్జ్డ్ ఫోర్డ్ మస్టాంగ్ కారును డ్రైవ్ చేస్తుండగా, అధిక పవర్ కారణంగా అది సెంటర్ ఆఫ్ గ్రావిటీని కోల్పోయి విమానం గాలిలోకి టేకాఫ్ అయ్యి, పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టకుంటూ ట్రాక్ అవతల పడిపోయింది.
అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. కానీ ఫోర్డ్ మస్టారం కారు రూపురేఖలు మాత్రం మారిపోయాయి. మరి షాకింగ్ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/XK3jWvNIqK4?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








