నయన్ బర్త్‌డేకి విఘ్నేశ్ శివన్ స్వీట్ సర్‌ప్రైజ్.. ఖరీదైన లగ్జరీ కారు గిఫ్ట్, ధర ఎంతంటే.??
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) ఈ సారి తన పుట్టినరోజును చాలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. కాగా ఈ బర్త్‌డేకి తన భర్త విఘ్నేశ్ శివన్ ఓ మధురమైన మరిచిపోలేని గిఫ్ట్‌ను ఇచ్చినట్లు నయన్ వెల్లడించింది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి..
దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ నయనతార. అందం, అభినయంతో ఎన్నో సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల బాలీవుడ్‌లోకి కూడా అరంగేట్రం చేసి జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్‌ను అందుకుంది. దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో వివాహ జీవితంలోకి అడుగుపెట్టి.. ఇద్దరు కవలలతో ఫ్యామిలీ లైఫ్‌ను కూడా హ్యాపీగా లీడ్ చేస్తోంది.

ఈ క్రమంలో ఇటీల నవంబర్ 18 న నయనతార తన 39 వ బర్త్‌డే వేడుకలను జరుపుకొంది. అయితే ఈ పుట్టినరోజును ఆమెకు మరింత స్పెషల్‌గా, మరిచిపోలేని రోజుగా చేసేందుకు తన భర్త విక్కీ(విఘ్నేశ్ శివన్).. నయన్‌కు ఖరీదైన గిఫ్ట్‌ను బహుకరించాడు. లేట్‌గా గిఫ్ట్ ఇచ్చినా ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ గిఫ్ట్ ఏంటనేది సోషల్ మీడియాలో నయన్ రివీల్ చేయలేదు. జస్ట్ ఒక పిక్ పెట్టి క్లూస్‌ను మనకే వదిలేసింది. కాగా ఆ పోస్ట్ చూస్తున్న నెటిజన్లు ఆ గిఫ్ట్ ఏంటనేది కనిపెట్టలేకపోతున్నారు. ఫలానా గిఫ్ట్ అయి ఉంటుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ సింబల్ ఆధారంగా డీకోడ్ చేస్తే బహుమతికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏమై ఉంటుంది..

బహుమతి పేరు ఏమిటో నయన్ వెల్లడించకుండా కేవలం ఒక చిత్రాన్ని మాత్రమే షేర్ చేసింది. అయితే ఆ ఫొటోలను చూస్తుంటే.. అది ఖరీదైన కారు అని స్పష్టమవుతోంది. ఇది మెర్సిడెస్ మేబ్యాచ్ మోడల్ లగ్జరీ కారు అని తెలుస్తోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే.. ఇది మెర్సిడెస్ మేబ్యాచ్ S-క్లాస్ లిమోసిన్ కారు మోడల్‌గా ఉంటుందని అంచనా..
మార్కెట్లో Mercedes Maybach S-Class Limousine ధర రూ. 2.7 కోట్లుగా ఉంది. ఇది ఎంట్రీ లెవెల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే. ఆన్‌రోడ్ ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాగా ఈ లగ్జరీ కారు ప్రస్తుతం రెండు వేరియంట్లలో విక్రయానికి అందుబాటులో ఉంది. అవి Mercedes Maybach S580 4Matic, Mercedes Maybach S680 4Matic.

వీటిలో రెండవది ఖరీదైన కారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 3 కోట్ల 40 లక్షలుగా ఉంది. అయితే ఈ రెండిట్లో నయన్‌కు విఘ్నేశ్ ఏ వేరియంట్ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడనేది స్పష్టంగా తెలియదు. ఏది ఏమైనా ఈ కారు ఖరీదైనది మాత్రమే కాదు.. లగ్జరీ పరంగా కూడా అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, మసాజ్, వెంటిలేటెడ్, వాతావరణ మార్పులకు అనుగుణంగా కూలింగ్, వెచ్చదనాన్ని అందించే సీట్లు అమర్చబడి ఉంటాయి. ప్రీమియం క్వాలిటీ లెదర్‌తో సీట్లు అప్‌హోల్‌స్టర్ చేయబడ్డాయి. అంతే కాకుండా సీట్లన్నిటినీ ప్రీమియం కలర్స్‌తో రూపొందించారు. ఇంకా మెర్సిడెస్ మేబ్యాచ్ S- క్లాస్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైట్లు, మెర్సిడెస్ MBUX టెక్నాలజీతో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది.
ఇంకా ఈ లగ్జరీ కారులో కనెక్టివిటీ ఫీచర్, ఫుల్లీ డిజిటల్ క్వాలిటీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆధునిక ఫీచర్లతో ఆకర్షణీయంగా రూపొందించారు. వీటితో పాటు మరెన్నో ప్రత్యేకమైన, లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. నయన్ బర్త్‌డేను మరింత స్పెషల్‌గా, గుర్తుండిపోయేలా చేసేందుకే విఘ్నేస్ ఈ ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి.
కాగా భారత్‌లో చాలా మంది సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు ఈ లగ్జరీ కారును ఉపయోగిస్తున్నారు. అదానీ, అంబానీ, కియారా అద్వానీ వంటి చాలా మంది ప్రముఖులు మెర్సిడెస్ మేబ్యాచ్ S-క్లాస్‌ను కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో నయన్ కూడా చేరింది.


Click it and Unblock the Notifications








