Just In
- 18 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
జనసేన-బీజేపీ అభ్యర్థులను మద్దతివ్వండి, ఇక వైసీపీ దాష్టీకానికి ముగింపే: పవన్ కళ్యాణ్
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త బిజినెస్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ, ఏంటో తెలుసా ?
భారతదేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు అమ్మకాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల తెలంగాణా రాష్ట్రం కొత్త విధానాన్ని అమలు చేసింది.

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఈ కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌కు చెందిన బ్యాటరీ వాహనాలను అద్దెకు ఇచ్చే కంపెనీలో ఆయన భాగస్వామి అయ్యారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ రౌడీ క్లబ్ తో సరికొత్త ఫ్యాషన్ బ్రాండ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే, కాగా ఇప్పుడు ఈ కొత్త వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు.

హైదరాబాద్‌కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో విజయ్ దేవరకొండ పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీని విజయ్ మద్దూరి, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్వహిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్‌లో ఈ కంపెనీ తమ బిజినెస్ ప్లాన్‌ను లాంచ్ చేసింది.
MOST READ:భారతదేశపు మొట్టమొదటి సీప్లేన్ సర్వీస్ ప్రారంభించిన నరేంద్ర మోడీ

వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు. వాహనదారులు ప్రయాణించే దూరానికి తగినంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్లు, బైక్‌లతో కాలుష్యం తగ్గడంతో పాటు సమయం, డబ్బూ ఆదా అవ్వనున్నాయి.

భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు డిమాండ్ బాగా పెరుగుతోంది. రోజురోజుకి వాహనాల వల్ల పెరుగుతున్న కాలుష్య ప్రమాణాలను తగ్గించడానికి దాదాపు అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేసి విక్రయిస్తున్నారు. ఈ వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నారు.
MOST READ:ఇష్టమైన కారు ఆకారంలో వాటర్ ట్యాంక్ నిర్మించిన కారు ప్రేమికుడు.. ఎక్కడో తెలుసా ?

ఈ కారణంగానే వాట్స్ అండ్ వోల్ట్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్టు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2020-30ని విడుదల చేశారు.

ఎక్కువ సంఖ్యలో వాహనాలు వినియోగించడం వల్ల రోజు రోజుకి ముడిచమురు నిల్వలు తగ్గిపోవడమే కాకుండా, పర్యావరణం కూడా ఎక్కువ కాలుష్యం అవుతోంది. ఈ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తులు చేయాలనీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది, అంతే కాకుండా వినియోగదారులు కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని సూచిస్తోంది.