విజయ్ సేతుపతి వాడే కార్లు చూస్తే షాక్ అవుతారు...
సౌత్ ఇండియాలో ప్రముఖ తమిళ నటుడు, విజయ్ సేతుపతి పేరు తెలియని వారు ఉండరు. తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటన అంటే తనకు ఎంత ఇష్టమో కార్లు అంటే అతనికి అంతే ఎనలేని ప్రేమ. తన గ్యారేజ్ లో చాలా కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

ఒక్కో సినిమాలో నటించడానికి దాదాపు రూ.3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటాడని నానుడి. ప్రస్తతం అతని గ్యారేజీలో కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక కార్లను కొనుగోలు చేశాడు. హ్యాచ్ బ్యాక్ ల నుంచి విలాసవంతమైన సెడాన్ లు, SUV లు ప్రస్తుతం అతని గ్యారేజ్ లో ఉన్నాయి. గ్రాండ్ తో మొదలు పెట్టి మెర్సిడెస్ బెంజ్ G-వ్యాగన్ వరకు వివిధ కార్లను కొనుగోలు చేశాడు.

గ్రాండ్ ఐ10 నుంచి మొదలు..
గ్రాండ్ ఐ10 విజయ్ సేతుపతి కొనుగోలు చేసిన మొదటి కారు. ఎరుపు రంగు కల్గిన ఈ కారును అత్యంత ఇష్టంగా కొనుగోలు చేశాడు. హ్యుందాయ్ గ్రాండ్ i10 ఎంట్రీ-లెవల్ హ్యాచ్ బ్యాక్ కారుగా గుర్తింపు పొందింది. ఈ కారులో అన్ని ఆధునిక పరికరాలు ఉన్నాయి. కెరీర్ ప్రారంభించిన తొలి నాళల్లో తన సంపాదనకు అనుగుణంగా ఈ కారును తీసుకున్నాడు. దీని ధర రూ. 5 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్య ఉంది.

మెర్సిడెస్ బెంజ్ 230డి..
తన అభిరుచికి అనుగుణంగా పాత మెర్సిడెస్ బెంజ్ 230డి సెడాన్ ను కొనుగోలు చేశాడు. ఆ కారును సంస్థ నిలిపి వేస్తున్నప్పటికి దానిపై ఉన్న మక్కువతో కారును తీసుకున్నాడు. తను ఏరి కోరి కొనుక్కున్న కారులో ప్రత్యేక స్థానం దీనికి ఉంది. అందుకే ఈ కారు అంటే ఇప్పటికీ అతనికి స్పెషలే.

మెర్సిడెస్ బెంజ్ G-వ్యాగన్..
ఇతని గ్యారేజ్ లోని మరో కారు మెర్సిడెస్ బెంజ్ G-వ్యాగన్. ఎమరాల్డ్ గ్రీన్ రంగులో ఈ కారు ఉంటుంది. ఈ SUV ఫ్రంట్ గ్రిల్ మధ్య సేతుపతి మొదటి అక్షరం 'V' ఉన్న లోగోను ప్రత్యేకంగా డిజైన్ చేసింది. 282 bhp వద్ద 600 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 3.0-లీటర్ ఇన్ లైన్-6 డీజిల్ ఇంజన్ ద్వారా ఈ కారు శక్తిని పొందుతుంది. ఇది గంటకు 200 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.

BMW 7 సిరీస్..
విజయ్ సేతుపతితో ఉన్న మరో కారు BMW 7 సిరీస్. ఇది రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇక్కడ బేస్-స్పెక్ 740 Li వేరియంట్ 450 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాప్-స్పెక్ 750 Li వేరియంట్ 650 Nm ఉత్పత్తి చేస్తుంది. 262 bhp వద్ద 620 Nm టార్క్ ను ఉత్పత్తి చేసే డీజిల్ వేరియంట్ కూడా ఉంది. BMW 7 సిరీస్ ధరలు రూ.1.42 కోట్ల నుండి మొదలై రూ. 1.76 కోట్ల వరకు ఉన్నాయి. (ఎక్స్-షోరూమ్).

మిని కూపర్..
విజయ్ సేతుపతి వాడే మరొక చిన్న కారు మినీ కూపర్. ప్రీమియం కార్లలో ఇది కూడా ఉంటుంది. అప్పుడప్పుడు చైన్నై రోడ్లపై తన కుటుంబంతో ప్రయాణిస్తూ ఇదే కారులో ఈ సూపర్ హీరో కనిపించారు. ఈ రెండు-డోర్ల మినీ కూపర్ హ్యాచ్ బ్యాక్ 121 bhp వద్ద 160 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధరలు రూ. 40 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

టయోటా ఫార్చ్యునర్..
ఈ హీరో వాడే మరో కార్లలో టయోటా ఫార్చ్యూనర్ ఒకటి. దీని నుంచి షూటింగ్ లకు వెళ్లేందుకు ఉపయోగిస్తాడు. ఏడు-సీట్ల SUV 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్, 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ ఈ కారు అందుబాటులో ఉంది. దీని ధర రూ. 31.79 లక్షల నుంచి రూ. 44.63 లక్షల వరకు ఉంటుంది. Apple CarPlay, Android Auto రెండింటినీ సపోర్ట్ చేసే 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఈ కారు సొంతం. ఒక కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్ లెస్ ఛార్జర్ ఇలా మరెన్నో ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

ఇన్నోవా క్రిస్టా..
ఇక ఆఖర్లో విజయ్ సేతుపతి వాడే కారు టయోటా ఇన్నోవా క్రిస్టా. దీనిపైనే చాలాసార్లు విమానాశ్రయం నుంచి ఇంటికి, ఇంటి నుంచి బయట ప్రాంతాల్లో కనిపించాడు. ఇన్నోవా క్రిస్టా ధరలు రూ.20 లక్షల నుంచి రూ. 24 లక్షల మధ్య ఉంది. మార్కెట్ లో లభించే అత్యంత విశ్వసనీయమైన కార్లలో ఇది ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద విజయ్ నటిస్తున్న సినిమాలు వరుస హిట్లతో దూసుకుపోతున్నాయి. అతను వాడే కార్లు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.


Click it and Unblock the Notifications








