ఉపాధ్యాయుడికి ఘనంగా వీడ్కోలు.. బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి కృతజ్ఞత చాటుకున్న గ్రామస్థులు
విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడి పాత్ర చాలా కీలకమైనది. పాఠాలు బోధించడంలోనే కాదు.. వారు చెప్పే జీవిత పాఠాలు కూడా ప్రభావం చూపిస్తాయి. అలాంటి ఉత్తమ టీచర్లను విద్యార్థులు ఎప్పటికీ మర్చిపోరు. అందుకే సంతోష్ కచన్ అనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి మరిచిపోలేని గిఫ్ట్ అందించారు ఆయన శిష్యులు..
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా వాలూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల టీచర్ సంతోష్ కంచన్‌కు గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికిన సంఘటన చోటుచేసుకుంది. సంతోష్ 16 ఏళ్లుగా ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి.. ప్రస్తుతం వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. దీంతో సంతోష్ కంచన్‌కు గ్రామస్థులు ఘనంగా వీడ్కోలు పలకాలని భావించారు. బజాజ్ పల్సర్ బైక్‌ను ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.

కాగా వాలూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సంతోష్ ఉపాధ్యాయుడిగా వచ్చినప్పుడు కడు కునుబి వాసుల్లో ఎవరికీ వాహనాలు లేవు. ప్రధాన రహదారిని చేరుకోవాలంటే.. 8 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. దీంతో ఉపాధ్యాయుడు సంతోష్ కంచన్.. విద్యార్థులు, గ్రామస్తుల కోసం బైక్ కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు. ఆ ఊరి ప్రజలకు అనారోగ్య సమస్యలుంటే బైకే అంబులెన్స్‌గా మారేది.
ఈ బైక్‌ను తన పాఠశాల విద్యార్థుల కోసం కూడా ఉపయోగించేవారు. ఇప్పుడు ఉపాధ్యాయుడు సంతోష్‌ను మరో పట్టణంలోని పాఠశాలకు బదిలీ చేయడంతో.. వరుసగా 16 ఏళ్లు ఉపాధ్యాయుడిగా పనిచేసి తమ గ్రామానికి కూడా సేవలందించడంతో గ్రామస్తులంతా డబ్బులు పోగుచేసి బజాజ్ పల్సర్ బైక్(Bajaj Pulsar Gift To Teacher)ను ఆయన బహుమతిగా అందజేశారు.

ఉపాధ్యాయుడు సంతోష్ కంచన్‌కి బహుమతిగా ఇచ్చిన బైక్ వీడియోను చూస్తుంటే, అది బజాజ్ పల్సర్ 150(Bajaj Pulsar 150) లేదా బజాజ్ పల్సర్(Bajaj Pulsar 180) 180 బైక్‌గా తెలుస్తోంది. బజాజ్ పల్సర్ యూత్ ఫేవరెట్ బైక్‌గా మార్కెట్లో సత్తా చాటింది. అయితే కొత్త బైక్‌లు మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత పల్సర్ బైక్‌లకు డిమాండ్ తగ్గింది. అయితే ఇప్పటికీ బజాజ్ ప్రొడక్షన్ పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఇదే.
సమాజ అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ఎందుకంటే భవిష్యత్తుకు ఉత్తమ పౌరులను అందించడంలో వారు నేర్పిన పాఠాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. మార్గనిర్దేశం చేస్తూ ఎలాంటి స్వార్థం లేకుండా పిల్లల భవిష్యత్తుకు పాటుపడుతుంటారు. తల్లిదండ్రులకు రుణపడి ఉన్నట్లే.. ఉపాధ్యాయుల రుణం కూడా తీర్చుకోలేనిది.

విద్యార్థులు, గ్రామస్థుల దృష్టిలో అంతటి అరుదైన గుర్తింపును సాధించుకున్న గురువుకు వీళ్లు ఖరీదైన బహుమతి ఇవ్వడం ఆయన జీవితంలో మర్చిపోలేనిది. దాదాపు రూ. లక్షన్నర విలువ చేసే బజాజ్ పల్సర్ బైక్‌ను టీచర్ సంతోష్‌కు అందించడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ గ్రామస్థులను అభినందిస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








