హైదరాబాదీల మది దోచుకున్న అలనాటి మేటి కార్లు
పురాతన కార్ల (వింటేజ్ కార్ల)ను చూడటం అంటే ఎవరికైనా ఆసక్తిగానే ఉంటుంది. ఒకప్పటి పురాతన కార్లు ఇప్పటికీ పనిచేస్తూ, రోడ్లపై వయ్యారంగా పరుగులు తీస్తుంటే, చూసేవారికి కన్నుల పండుగా ఉంటుంది. ఇలాంటి అరుదైన అవకాశమే ఆదివారం నాడు హైదరాబాదీలకు దక్కింది. జాగిర్దార్ కాలేజ్ మరియు ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్‌లు ఓ వింటేజ్ కార్ డ్రైవ్ అండ్ షోకేస్‌ను ఆదివారం నిర్వహించారు.
ది హెరిటేజ్ కార్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తమ 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ వింటేజ్ కార్ డ్రైవ్ అండ్ షోకేస్‌ను నిర్వహించింది. ఇందులో 40కి పైగా పురాతన కార్లను ప్రదర్శించారు. ఇవన్నీ ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మోడళ్లే. ఈ కార్ ర్యాలీని నగర పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్ లాంఛనంగా ప్రారంభించారు. కాగా.. ఈ పురాతన కార్ ర్యాలీని సందర్శించేందుకు వచ్చిన కారు ప్రేమికులు సదరు కార్లతో ఫోటోలు దిగేందుకు అమితాసక్తిని కనబరిచారు.
మరి ఆ విశేషాలేంటో, అందులో పాల్గొన్న కొన్ని కార్ల వివరాలేంటో తెలుసుకుందాం రండి..!

ఫోర్డ్ టూరర్
కారు యజమాని పేరు: సయ్యద్ మహ్మద్ సాదుద్దీన్
కారు పేరు: ఫోర్డ్ టూరర్
రిజిస్ట్రేషన్ నెంబర్: ఎపి 10 ఎస్ 1936
మోడల్ నెంబర్: వి8

షెవర్లే హీట్‌మాస్టర్
కారు యజమాని పేరు: ఇందర్ క్రిష్ణమ
కారు పేరు: షెవర్లే హీట్‌మాస్టర్
రిజిస్ట్రేషన్ నెంబర్: ఎపి 10 హెచ్ 44
మోడల్ నెంబర్: 1947 వుడీ

పోంటియాక్
కారు యజమాని పేరు: మనావర్ ఖాన్
కారు పేరు: పోంటియాక్
రిజిస్ట్రేషన్ నెంబర్: ఎపి 12 ఈ 4625
మోడల్ నెంబర్: స్ట్రీమ్‌లైన్ 1947

ట్రైయంప్
కారు యజమాని పేరు: శాంతను రెడ్డి
కారు పేరు: ట్రైయంప్
రిజిస్ట్రేషన్ నెంబర్: ఎపిఎక్స్ 346
మోడల్ నెంబర్: 1949 రోడ్‌స్టర్

స్టాండర్డ్ హెరాల్డ్
కారు యజమాని పేరు: అరవింద్ రెడ్డి
కారు పేరు: స్టాండర్డ్ హెరాల్డ్
రిజిస్ట్రేషన్ నెంబర్: ధరంపూర్ 6
మోడల్ నెంబర్: 1966

ఆస్టిన్
కారు యజమాని పేరు: షా అలమ్ రసూల్ ఖాన్
కారు పేరు: ఆస్టిన్
రిజిస్ట్రేషన్ నెంబర్: ఏపివై 8382
మోడల్ నెంబర్: ఛాంప్ 1952

విల్లీస్ జీప్
కారు యజమాని పేరు:
కారు పేరు: విల్లీస్ జీప్
రిజిస్ట్రేషన్ నెంబర్: డిఎల్‌వి 3731
మోడల్ నెంబర్: 1951 సివిలియన్ జీప్ సిజె3

డాడ్జ్
కారు యజమాని పేరు: కెప్టెన్ కె.ఎఫ్. పెస్టోన్జీ
కారు పేరు: డాడ్జ్
రిజిస్ట్రేషన్ నెంబర్: కినా కోటి ఏ
మోడల్ నెంబర్: 1951

బుయిక్
కారు యజమాని పేరు: కెప్టెన్ కె.ఎఫ్. పెస్టోన్జీ
కారు పేరు: బుయిక్
రిజిస్ట్రేషన్ నెంబర్: ఎన్4 డాంటా
మోడల్ నెంబర్: 1939

ఫోక్స్‌వ్యాగన్
కారు యజమాని పేరు: బి గౌతమ్ రెడ్డి
కారు పేరు: ఫోక్స్‌వ్యాగన్
రిజిస్ట్రేషన్ నెంబర్: ఏడిఎక్స్ 0601
మోడల్ నెంబర్: టైప్ 2

డాడ్జ్
కారు యజమాని పేరు: మసీదుద్దీన్ ఫరూకీ
కారు పేరు: డాడ్జ్ సెడాన్ సూపర్ డీలక్స్
రిజిస్ట్రేషన్ నెంబర్:
మోడల్ నెంబర్: 1945 అమెరికన్

కారు యజమాని పేరు: కెవల్ కాంత్ గిర్
కారు పేరు: ఆస్టిన్
రిజిస్ట్రేషన్ నెంబర్: ఎపిఎక్స్ 1225
మోడల్ నెంబర్:

ఫోర్డ్ కన్వర్టిబల్
కారు యజమాని పేరు: ఎమ్ గౌరీ రెడ్డి
కారు పేరు: ఫోర్డ్ కన్వర్టిబల్
రిజిస్ట్రేషన్ నెంబర్: ఎపిఎఫ్ 20
మోడల్ నెంబర్: 1928 మోడల్

ఫోర్డ్ జీప్
కారు యజమాని పేరు: ఎమ్ గౌరీ రెడ్డి
కారు పేరు: ఫోర్డ్ జీప్
రిజిస్ట్రేషన్ నెంబర్: ఎపిఎఫ్ 1107
మోడల్ నెంబర్: 1944 జిపిడబ్ల్యూ

ఆస్టిన్
కారు యజమాని పేరు: గణష్యామ్ గుప్తా
కారు పేరు: ఆస్టిన్
రిజిస్ట్రేషన్ నెంబర్:
మోడల్ నెంబర్: 10 కన్వర్టిబల్

ఫోర్డ్
కారు యజమాని పేరు: గణష్యామ్ గుప్తా
కారు పేరు: ఫోర్డ్
రిజిస్ట్రేషన్ నెంబర్:
మోడల్ నెంబర్: మోడల్ ఏ

విల్లీస్ జీప్
కారు యజమాని పేరు: మహమ్మదా ఖాసీం
కారు పేరు: విల్లీస్ జీప్
రిజిస్ట్రేషన్ నెంబర్: ఏబిడి 9089
మోడల్ నెంబర్: 1953 మోడల్


Click it and Unblock the Notifications








