బైకుపై బాబు చేసిన విన్యాసాలకు పోలీసులు ఇలా ట్రీట్‌మెంట్ ఇచ్చారు

ప్రపంచంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న మరియు జరిగే దేశాల జాబితాలో ఇండియా ఒకటి. మన దేశంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకుని కూర్చున్నాయి. ఇందులో భాగంగానే కఠినమైన నిబంధణలను కూడా అమలులోకి తీసుకు వచ్చాయి. అయితే ఇప్పటికి కూడా వాహన వినియోగదారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

బైకుపై బాబు చేసిన విన్యాసాలకు పోలీసులు ఇలా ట్రీట్‌మెంట్ ఇచ్చారు

ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇందులో ఒక బైకర్ తన బైకుపై కూర్చుని, రెండు కాళ్ళు ఒకేవైపు పెట్టుకుని, ఒకే చేతితో రైడింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఆ బైక్ రైడర్ హెల్మెట్ కూడా ధరించలేదు. ఈ వీడియోను దుర్గ్ పోలీసులు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.

బైకుపై బాబు చేసిన విన్యాసాలకు పోలీసులు ఇలా ట్రీట్‌మెంట్ ఇచ్చారు

ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే ఆ బైక్ మీద కూర్చున్న వ్యక్తి ఎదో వీడియోకి ఫోజులిస్తున్నట్లు, రోడ్డుపైన వెళ్తున్న వాహనాలను కూడా పెద్దగా పట్టించుకోకుండా.. దర్జాగా ముందుకు వెళ్తున్నాడు. అతని ముందు వైపు ఒక ఆటో వెళ్తోంది, అదే సమయంలో రోడ్డుకి పక్కన లారీలు కూడా పార్క్ చేయి ఉన్నాయి.

బైకుపై బాబు చేసిన విన్యాసాలకు పోలీసులు ఇలా ట్రీట్‌మెంట్ ఇచ్చారు

అంతే కాకుండా ఆ బైక్ రైడర్ భుజానికి బ్యాగ్ కూడా ఉంది, అదే సమయంలో బైక్ లో అమర్చుకున్న మొబైల్ చూస్తూ రైడ్ చేస్తున్నాడు. ఈ వీడియోని ఆ బైక్ రైడర్ వెనుక ఉన్న ఒక వ్యక్తి చిత్రీకరించారు. ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టిలో పడింది.

బైకుపై బాబు చేసిన విన్యాసాలకు పోలీసులు ఇలా ట్రీట్‌మెంట్ ఇచ్చారు

ఈ వీడియో చూసిన దుర్గ్ పోలీసులు ఆ బైక్ రైడర్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి, అతనికి రోడ్డుపైన అంత నిర్లక్యంగా వ్యవహరించినందుకు రూ. 4,200 జరిమానా విధించారు. అంతే కాకూండా మళ్ళీ ఆవిధంగా చేయను అంటూ అతడు చేసిన పనికి క్షమాపణలు కూడా చెప్పాడు. అదే సమయంలో అతడు క్షమాపణలు చెబుతూ చెవులను పట్టుకున్న చిత్రాలు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు.

బైకుపై బాబు చేసిన విన్యాసాలకు పోలీసులు ఇలా ట్రీట్‌మెంట్ ఇచ్చారు

ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాకూండా ఇంత తక్కువ సమయంలో పోలీసులు ఆ వ్యక్తిపైన చర్యలు తీసుకోవడం నిజంగానే అభినందనీయం అంటున్నారు. కొంతమంది అతని రైడింగ్ నైపుణ్యాలను ప్రశంసిస్తున్నారు.

బైకుపై బాబు చేసిన విన్యాసాలకు పోలీసులు ఇలా ట్రీట్‌మెంట్ ఇచ్చారు

నిజానికి భారతదేశంలో వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతిరోజూ వందలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో నిర్లక్ష్యపు రైడింగ్/డ్రైవింగ్ మరింత ప్రమాదం. ఇది కేవలం ఆ వ్యక్తికి మాత్రమే కాకుండా అతని చుట్టూ ఉన్న వారికి కూడా ప్రమాదాన్ని తీసుకువస్తుంది.

రోడ్డు ప్రామాదాలను తగ్గించడానికి ప్రభుత్వాలు నిబంధనలను మరింత కఠినం చేస్తోంది. హెల్మెట్ ధరించకపోతే భారీ జరిమానాలు విధిస్తోంది. మితిమీరిన వేగానికి కూడా కఠినమైన శిక్షలు విధిస్తోంది. అయినప్పటికీ చాలామంది తమ తీరుని మార్చుకోవడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదాలు రానున్న రోజులలో మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.

బైకుపై బాబు చేసిన విన్యాసాలకు పోలీసులు ఇలా ట్రీట్‌మెంట్ ఇచ్చారు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఛత్తీస్‌గఢ్ జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియావైలో చాలా వైరల్ అవుతోంది. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిపైన పోలీసులు చర్యలు తీసుకోవడం అభినందనీయం. పోలీసులు ఈ విధంగా వెంటనే చర్యలు తీసుకుంటే మిగిలినవారికి తప్పకుండా భయం కలుగుతుంది. అయినప్పటికీ వాహన వినియోగదారులు కనీస జ్ఞానంతో వ్యవహరించాలి, లేకుంటే అనుకోను ప్రమాదాలు జరుగుతాయి.

Most Read Articles

English summary
Viral video a man rides bike with both legs on one side police fined rs 4200 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X