ముసలోడే కానీ మామూలోడు కాదు.. 65 లక్షల కారుతో తాతయ్య గింగిరాలు.. స్టంట్స్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే
"ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్" అనే మాటలు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలకు సరిగ్గా సరిపోతాయి. తాజాగా ఒక ఇండియన్ తాత చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తన మనవడి ఫోర్డ్ మస్టాంగ్ కారులో స్టంట్లు చేసి యువకులను ఆశ్చర్యపరిచాడు ఈ తాతయ్య. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది, నెటిజన్లు తాతయ్య టాలెంటుకు అంతా ముగ్ధులవుతున్నారు.
వీడియో మొదట్లో మనవడు కారు తాళాలు తన తాతకు ఇస్తాడు. "మనవడు ఉన్నప్పుడు తాత సరదాగా ఉండకపోతే ఎలా? ఈ తాళాలు తీసుకోండి, ఆనందించండి" అని మనవడు చెప్పగానే, "నెమ్మదిగా, జాగ్రత్తగా డ్రైవ్ చేయి" అని హెచ్చరిస్తాడు. తాతయ్య ముఖంలో మాత్రం ఏదో తెలియని ఆనందం, ఉత్సాహంగా కీ అందుకుని స్టంట్ చేయడానికి సిద్ధమవుతాడు.

ఆ తర్వాత జరిగేదంతా సినిమా స్టైల్‌లో స్టంట్లే. తాతయ్య తన అద్భుతమైన డ్రైవింగ్ టాలెంట్ పూర్తిగా చూపిస్తాడు. అతను చేసే డ్రిఫ్ట్‌లు చూస్తే ఎవరికైనా కళ్లు తిరుగుతాయి. తాతయ్య స్టంట్లు బాగానే ఉన్నాయి కానీ, ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన సీటు బెల్ట్ పెట్టుకోలేదు. సరదా కోసం ఇదంతా చేసినప్పటికీ, సీటు బెల్ట్ ధరించడం కూడా అంతే ముఖ్యం అని గుర్తుంచుకోవాలి.
చివరికి స్టంట్ చేసి కారును సురక్షితంగా ఆపిన తర్వాత మనవడు ఆశ్చర్యంగా "తాతా నువ్వేం చేశావ్?" అని అడుగుతాడు. అప్పుడు తాతయ్య ఇచ్చిన సమాధానం మరింత అదిరింది. "మేము ట్రాక్టర్లు నడుపుతున్నప్పుడు ముందు చక్రం గాలిలో ఎత్తి ఎన్నో కిలోమీటర్లు నడిపేవాళ్లం" అని బదులిస్తాడు.

ఈ సమాధానంతో సోషల్ మీడియాలో చాలా మంది యువకులు తాతయ్యకు అభిమానులైపోయారు. "మా ముందు పిల్లలు మీరు... ట్రాక్టర్ నడిపింది మేం" అంటూ తాతయ్య చెప్పిన డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఫోర్డ్ మస్టాంగ్ ప్రత్యేకతలు: ఫోర్డ్ కంపెనీ జూలై 2016లో మస్టాంగ్ కారును భారతదేశంలో విడుదల చేసింది. దాని ఎక్స్-షోరూమ్ ధర అప్పట్లో దాదాపు 65 లక్షల రూపాయలు. మస్టాంగ్‌ను కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU)గా ఇండియాకు దిగుమతి చేసుకునేవారు. ప్రస్తుతం భారతదేశంలో మస్టాంగ్ కొనడం చాలా కష్టం. ఎందుకంటే ఫోర్డ్ సెప్టెంబర్ 2021లో భారతదేశం నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ మస్టాంగ్‌లు 75-80 లక్షల రూపాయల వరకు అమ్ముడుపోతున్నాయి. ఈ కారు నార్మల్, స్పోర్ట్ +, ట్రాక్, వెట్/స్నో అనే నాలుగు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఈ కారులో ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, రోల్-రేట్ సెన్సార్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)తో సహా అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే ఇది 5.0 లీటర్ V8 పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది.
ఇది 395 bhp పవర్, 515 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే మోడల్ కొంచెం ఎక్కువ పవర్‌ను కలిగి ఉంటుంది. అది 435 bhp. మొత్తంమీద ఈ కారు పెర్ఫార్మెన్స్ ప్రియులకు బాగా నచ్చుతుంది. తాతయ్య మాత్రం ఈ పవర్‌ఫుల్ కారును కూడా తన అనుభవంతో ఆటాడుకున్నాడు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








