Viral Video ఖరీదైన కారులో రాంగ్ రూట్‌లో వచ్చిన యువతి.. ఆపినందుకు పోలీసుపైనే దాడి
రాంగ్ రూట్‌లో వచ్చినందుకు పోలీసులు ఆపడంతో ఓ యువతి(Hyderabad Lady Wrong Route Driving) నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేసిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఖరీదైన కారులో దర్జాగా వచ్చిన ఆ యువతి.. రాంగ్ రూట్‌లో రావడమే కాకుండా తనను ఆపినందుకు పోలీసులతో గొడవకు దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్‌లో ట్రాఫిక్(Hyderabad Traffic) రద్దీ గురించి అందరికీ తెలిసిందే. దేశంలోని ఇతర మహా నగరాల మాదిరిగానే హైదరాబాద్‌లో కూడా ట్రాఫిక్ నిత్యం పెరుగుతూనే ఉంది. ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ఫ్లై ఓవర్‌లు, అండర్‌పాస్‌లు, మెట్రో మార్గాలను నిర్మిస్తున్నప్పటికీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎదురవుతూనే ఉంది.

ఈ క్రమంలో పోలీసుల తనిఖీల్లో కొంతమంది వాహనదారుల చేష్టలు పోలీసులకు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. అయితే హైదరాబాద్ ఇంకా పలు ప్రాంతాల్లో వాహనదారులు రాంగ్ రూట్‌లో వెళ్లడం సాధారణం. కానీ ఇలాంటి చర్యలకు ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు పాల్పడుతుంటారు. యూ టర్న్ ఎక్కువ దూరం ఉన్నట్లయితే సమయం ఆదా చేసుకునేందుకు ఇలాంటివి చేస్తుంటారు.
కానీ ప్రధాన రోడ్లపై ఇలాంటి పనులకు పాల్పడరు. ఎందుకంటే ఆ రోడ్లపై ట్రాఫిక్ పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఓ యువతి మాత్రం అందుకు విరుద్ధం. ఖరీదైన జాగ్వార్(Jaguar SUV) కారులో వచ్చిన యువతి.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో రాంగ్ రూట్‌లో వచ్చింది. ఇలా రాకూడదని సున్నితంగా చెప్పినందుకు పోలీసులనే దుర్భాషలాడింది.

నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్(Hyderabad Young Woman Jaguar) నిర్వహించడం సాధారణమే.. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ తనిఖీలు చేపడుతుంటారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 24, శనివారం రాత్రి సమయంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఓ యువతి.. ఖరీదైన జాగ్వార్ కారులో రాంగ్ రూట్లో వస్తోంది.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా అక్కడే విధుల్లో ట్రాఫిక్ హోంగార్డు విఘ్నేష్.. లగ్జరీ కారులో వస్తున్న రాంగ్ రూట్‌లో వస్తున్న యువతిని అడ్డుకున్నారు. ఇది రాంగ్ రూట్ అని చెబుతూ సరైన దారిలో వెళ్లాలని యువతికి చెప్పారు. అయితే హోంగార్డు సున్నితంగా చెప్పినా యువతి కారును వెనక్కి తీసుకోలేదు. ఇంకా కారును ముందుకే పోనిచ్చేందుకు యత్నించింది.

దీంతో హోంగార్డు.. కారుకు అడ్డంగా నిలబడి రాంగ్‌రూట్లో వెళ్లడానికి వీల్లేదని చెప్పేశారు. ఈ పరిణామంతో ఆ యువతిలో కోపం తన్నుకొచ్చింది. నన్నే ఆపుతావా అంటూ అతడితో గొడవకు దిగింది. కారు దిగి హోంగార్డుపై దుర్భాషలాడుతూ నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేసింది. ఎవ్వరూ రాంగ్ రూట్లో వెళ్లట్లేదా.. నేను వెళ్తేనే తప్పు వచ్చిందా అంటూ లాజిక్కులు మాట్లాడుతూ హోంగార్డుతో వాగ్వాదం జరిపింది.
అంతే కాకుండా హోంగార్డుపై దాడికి యత్నిస్తూ అతను వేసుకున్న జాకెట్‌ను కూడా చింపేసింది. గొడవ పెద్దది అవుతుండటంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు ఈ తతంగాన్ని వీడియో తీస్తున్నారు. ఈ క్రమంలో వీడియో తీస్తున్న ఓ వ్యక్తి ఫోన్ తీసుకుని నేలకేసి కొట్టింది. దీంతో ఫోన్ పగిలిపోయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువతి ప్రవర్తనపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ క్రమంలో తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తనను దుర్భాషలాడినందుకు ఆ యువతిపై హోంగార్డు విఘ్నేష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోంగార్డు ఫిర్యాదుతో యువతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Click it and Unblock the Notifications








