VandeBharat వందేభారత్‌ రైల్‌ని లాగిన జనరల్ డీజిల్ ఇంజన్.. వీడియో వైరల్.. అధికారుల క్లారిటీ..!

భారతదేశంలో వందేభారత్ రైళ్ల హహా కొనసాగుతోంది. పూర్తి దేశీయ టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయిలో దీనిని ఇండియన్ రైల్వే రూపొందించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. అయితే తాజాగా ఈ రైల్‌కి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

ఇప్పటివరకు కేవలం కార్లు, బస్సులు, బైకులు, ఆటోలు, లారీలను ఈడ్చుకెళ్లే వీడియోలను చూశాం. కొన్ని సార్లు రైళ్లు కూడా మరో రైలును లాగుతాయి. కేవలం రైళ్లలో ఏదైనా సాంకేతిక లోపం వస్తే ఇలా వేరే రైల్ సహాయంతో దానిని తరలిస్తారు. అయితే వందే భారత్ రైలును ఓ పాత రైలు ఈడ్చుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

VandeBharat-Train-Latest

వందేభారత్ పూర్తి రైలు వెనకాలే ఉండగా.. డీజిల్ ఇంజన్ వందేభారత్ పూర్తి రైల్‌ని లాగుతుంది. ఇది కేంద్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్‌ తీరు అంటూ ఓ నెటిజన్ వీడియోను అప్‌లోడ్ చేశాడు. దీనిని అప్‌లోడ్‌ చేసిన కాసేపటికే వైరల్‌ అయ్యింది. వందేభారత్ రైళ్లలో ఉన్న లోపాలను ఈ వీడియో కింద జతచేస్తూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియో వైరల్ కావడంతో పలు కామెంట్లు వస్తుండటంతో సెంట్రల్ రైల్వే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ వీడియోలో మీరు చూస్తున్న విజువల్స్ వందేభారత్ రైల్ ట్రయల్ వీడియో అని వివరించింది. రైల్ ప్రారంభానికి ముందు ఇంజన్‌తో పాటు బోగీలు ట్రాక్‌పై పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. ఎంపిక చేసిన మార్గాన్ని నిర్ణయించడానికి క్షుణ్ణంగా పరిశీలించడానికి అలానే లోకో పైలట్ కు శిక్షణ ఇవ్వడానికి ఇలా చేస్తామని అధఇకారులు క్లారిటీ ఇచ్చారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ట్రైన్ 18 అని కూడా పిలువబడే ఆధునిక రైలు. ఇది కేంద్ర ప్రభుత్వ మేకిన్ ఇండియా చొరవ కింద చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 18 నెలల్లో రూపొందించి తయారు చేసి ప్రారంభించింది. ఉత్తర భారతంతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో విజయం సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పలు రూట్లలో వందేభారత్ రైల్ నడుస్తున్నాయి.

ఈ రైల్ లోని ఎగ్జిక్యూటివ్ కోచ్ లలో అదనంగా 180 డిగ్రీల రొటేటింగ్ సీట్లు ఉంటాయి. సాధారణ శతాబ్ది రైళ్లతో పోలిస్తే వందే భారత్ సీటింగ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ. సెమీ హైస్పీడ్ రైలులో 1,128 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. దీంతో ఈ రైల్‌కి తక్కువ సమయంలో ఎక్కువ హైప్ వచ్చింది అని చెప్పవచ్చు.

వందే భారత్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఎన్నో ఫీచర్లతో ఈ రైలును ప్రవేశపెట్టినప్పటికీ, నడపడానికి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. తమిళనాడులో రైలును ప్రవేశపెట్టినప్పుడు ఆవులు వచ్చి ఢీకొనడంతో రైలు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.

అలానే వైజాగ్‌లో తొలిసారి ప్రవేశించినప్పుడు దీనిపై దాడి చేయగా అద్దాలు పూర్తిగా ధ్వసం అయ్యాయి. అలానే కేరళలో ఇటీవలే కురిసిన వానకు బోగీలలోకి నీరు వచ్చి చేరింది. ఇలా చిన్న చిన్న కారణాలతో ప్రయాణికులు వందేభారత్ రైళ్లపై కామెంట్స్ చేస్తున్నారు. అధికారులు ఇలాంటి చిన్న చిన్న వాటిపై సరైన చర్యలు తీసుకోకుండా రైళ్లను నడిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, July 1, 2023, 13:26 [IST]
English summary
Viral video of general train engine pulling vande bharat express railway officals clarifies
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+