ఏంటి మామ ఇది కోట్లు విలువ చేసే కారులో పిడకలా ? బ్రిటిష్ వాళ్ళను ఇలా కూడా అవమానిస్తారా?
భారతీయులకు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్లంటే ఎంతో కోపం ఉండేది. ఇప్పుడు ఆ కోపం వారి కార్లపై చూపిస్తున్నారా? ఈ వీడియో చూస్తే అవుననే అనిపిస్తోంది. సాధారణంగా కోట్లాది రూపాయల ఖరీదు చేసే ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీని ప్రముఖులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు వంటి సంపన్నులు తమ ప్రయాణాల కోసం ఉపయోగిస్తారు. కానీ, భారతదేశంలో డిఫెండర్ కారును ఆవు పేడ పిడకలు తీసుకెళ్లడానికి కూడా వాడుతున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఒకప్పుడు భారతీయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన బ్రిటీష్ వాళ్ల మీద ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు అనిపిస్తుంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ అనగానే మనకు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు వంటి సంపన్నులు మాత్రమే వాడుతుంటారు. కోట్లాది రూపాయల విలువ చేయడంతో సామాన్యులకు ఈ కారు కొనడం అంటే పెద్ద కలే.

భాటి 6004 అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో పేడ పిడకలు తీసుకెళ్తున్న వీడియో కనిపించింది. ఈ చిన్న క్లిప్‌లో తెల్లటి ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 లగ్జరీ ఎస్‌యూవీని చూడవచ్చు. కారు పక్కన భాటి 6004 అనే స్టిక్కర్ ఉంది, కాబట్టి ఇది అతడి కారు అని అర్థం చేసుకోవచ్చు. దేసీ లైఫ్ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
గ్రామీణ జీవనాన్ని చూపించడానికి కాబోలు, ఇన్‌స్టాగ్రామ్ యూజర్ డిఫెండర్ బూట్‌లో 8 పేడ పిడకలను పెట్టినట్లు చూపించాడు. ఆ వెంటనే, ఒక వృద్ధురాలు మరో రెండు పేడ పిడకలను కారులో పెడుతున్న దృశ్యం కూడా ఉంది. సాధారణంగా కోట్లాది రూపాయల ఖరీదు చేసే లగ్జరీ కార్లలో ఇలాంటి వస్తువులను తీసుకెళ్లడం చాలా అరుదుగా చూస్తుంటాం. ఒక కారులో ఏమి తీసుకెళ్లాలనేది కారు యజమాని ఇష్టం. అయితే, కార్లంటే బాగా పిచ్చి ఉన్నవారికి మాత్రం ఇలాంటి దృశ్యాలు అంతగా నచ్చకపోవచ్చు.

భారతదేశంలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, దాదాపు రూ.2 కోట్ల విలువైన తెల్లని మెర్సిడెస్ బెంజ్ G550 లగ్జరీ ఎస్‌యూవీలో సిమెంట్ బ్యాగులు లోడ్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఢిల్లీలోని రద్దీగా ఉండే రోడ్డు పక్కన పార్క్ చేసిన ఈ కారులో ఇద్దరు కూలీలు సిమెంట్ బ్యాగులను బూట్‌లోకి ఎక్కించారు. సుమారు 5-6 బస్తాల సిమెంట్‌ను కారులో లోడ్ చేసిన వీడియో అప్పట్లో సెన్సేషన్‌గా మారింది.
అలాగే, గతంలో ఒక రైతు ఖరీదైన లగ్జరీ కారులో ఎండుగడ్డిని తీసుకెళ్తున్న వీడియో కూడా వైరల్ అయింది. డిఫెండర్‌లో పేడ పిడకలు తీసుకెళ్లడం వైరల్ కావడానికా లేదా ఇది వారి జీవనంలో భాగమా అనేది కచ్చితంగా తెలియదు.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ భారతదేశంలో మూడు విభిన్న కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. డిఫెండర్ 90: ఇది 3 డోర్ల మోడల్. డిఫెండర్ 110: ఇది 5 డోర్ల మోడల్. డిఫెండర్ 130: ఇది అత్యంత పొడవైన మోడల్.
ఇందులో పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, అత్యంత శక్తివంతమైన V8తో సహా ఐదు ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర రూ.1.05 కోట్లతో ప్రారంభమవుతుంది. టాప్-స్పెక్ ఆక్ట్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.79 కోట్లు.


Click it and Unblock the Notifications








