నీ బుల్లెట్ బండినెత్తుకెళ్తా.. ఎత్తుకెళ్తా.. మీ బుల్లెట్ బండిని ఈ దొంగ చిటికెలో మాయం చేసేస్తాడు!

టెక్నాలజీ ఎంత పెరిగినా దొంగల ముందు మాత్రం అది దిగదుడుపే అనే మరోసారి నిరూపించుకుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న భారీ బుల్లెట్ మోటార్‌సైకిళ్లను ఈ "బుల్లెట్ దొంగ" చిటికెలో మాయం చేసేస్తున్నాడు. ఇతగాడి టేస్టే వేరు, సాదాసీదా బైకులను అస్సలు ముట్టుకోడు, ఈ దొంగ టార్గెట్ కేవలం బుల్లెట్ బైకులే.

నీ బుల్లెట్ బండినెత్తుకెళ్తా.. ఎత్తుకెళ్తా.. మీ బుల్లెట్ బండిని ఈ దొంగ చిటికెలో మాయం చేసేస్తాడు!

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ బుల్లెట్ మోటార్‌సైకిళ్ల సెక్యూరిటీ గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా సరే, ఈ దొంగ ముందు అవన్నీ చెల్లవు. ఈ దొంగను చూస్తుంటే దొంగలందు, బుల్లెట్ బైక్ దొంగలు వేరయా అనిపిస్తుంది. ఈ బుల్లెట్ దొంగలు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైకులను చోరీ చేయడంలో ఆరితేరిన వాళ్ళు.

నీ బుల్లెట్ బండినెత్తుకెళ్తా.. ఎత్తుకెళ్తా.. మీ బుల్లెట్ బండిని ఈ దొంగ చిటికెలో మాయం చేసేస్తాడు!

నిజానికి అన్ని బైకుల్లోకి బులెట్ బైక్ లాక్ సిస్టం పకడ్బందీగా ఉంటుందని కంపెనీ చెబుతుంది. ఒక రకంగా అది నిజమే అయినప్పటికీ, ఆ బైక్ పై ఈ దొంగల కళ్ళు పడితే మాత్రం, క్షణాల్లో అది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. బులెట్ బైక్ చేరీలు చేయడంలో ఘటికులైన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

నీ బుల్లెట్ బండినెత్తుకెళ్తా.. ఎత్తుకెళ్తా.. మీ బుల్లెట్ బండిని ఈ దొంగ చిటికెలో మాయం చేసేస్తాడు!

వివరాల్లోకి వెళితే, ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో జరిగింది. గ్వాలియర్‌లో పట్టుబడిన ఈ దొంగలను శ్యామ్ గుజ్జర్ , భజన గూడా లుగా గుర్తించాకు. వీరిద్దరూ మోరేనా జిల్లాకు చెందినవారు . వారిద్దరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే, దానికంటే ముందుగా అసలు ఈ బైక్‌లను ఎలా చోరీ చేస్తారో చూపాల్సిందిగా పోలీసులు ఆ దొంగలను కోరారు.

నీ బుల్లెట్ బండినెత్తుకెళ్తా.. ఎత్తుకెళ్తా.. మీ బుల్లెట్ బండిని ఈ దొంగ చిటికెలో మాయం చేసేస్తాడు!

వీరిద్దరిలో ఒక బుల్లెట్ దొంగ ఒకేఒక కిక్కుతో హ్యాండిల్ లాక్‌ను సైతం విరగొట్టేసి, నోటితో వైర్లను కొరికి సులువుగా సెల్ఫ్ స్టార్ట్ చేసి చూపిస్తాడు. ఈ దొంగల చేతివాటం చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టారు. దీంతో ఆ వీడియో కాస్తం నెట్టింట వైరల్ అయ్యింది.

మరి ఈ బుల్లెట్ దొంగలు కేవలం బుల్లెట్ బైక్ లనే ఎందుకు చోరీ చేస్తారని ప్రశ్నించగా, ఇవి దొంగ బండ్లు అయినా సరే, వాటికి చోర్ బజార్ లో మంచి రేటు వస్తుందని ఆ దొంగలు చెప్పారు. మీరు కూడా ఓసారి ఈ వీడియో చూడండి, ఇందులో ఈ దొంగ ఎంత సునాయాసంగా బుల్లెట్ బైక్ ను అన్‌లాక్ చేసి, స్టార్ట్ చేశాడో.

నీ బుల్లెట్ బండినెత్తుకెళ్తా.. ఎత్తుకెళ్తా.. మీ బుల్లెట్ బండిని ఈ దొంగ చిటికెలో మాయం చేసేస్తాడు!

ఈ వీడియోని బట్టి చూస్తుంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిళ్ల లాక్ సిస్టమ్ ఎంత బలహీనంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాతనైనా టూవీలర్ల తయారీ సంస్థలు తమ వాహనాలలో బలమైన సెక్యూరిటీ సిస్టమ్ అందించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా, ఇలాంటి ఖరీదైన మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు అదపు జాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ మార్కెట్ ఫోర్క్ లాక్ / వైర్ లాక్ కానీ కొనుగోలు చేయడం, అలాగే రిమోట్ అలారంను ఇన్‌స్టాల్ చేయించుకోవడం మంచిది.

నీ బుల్లెట్ బండినెత్తుకెళ్తా.. ఎత్తుకెళ్తా.. మీ బుల్లెట్ బండిని ఈ దొంగ చిటికెలో మాయం చేసేస్తాడు!

Royal Enfield Classic 350 మోటార్‌సైకిళ్లలో బ్రేక్ సమస్యలు, రీకాల్

ఇదిలా ఉంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే మోటార్‌సైకిళ్లలో ఒకటైన క్లాసిక్ 350 బైక్ లో బ్రేక్ లోపం కారణంగా కంపెనీ 26,300 యూనిట్లను రీకాల్ చేసింది. సమాచారం ప్రకారం కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 బైక్ లోబ్రేక్ లోపం కారణంగా వీటిని రీకాల్ చేశారు. ఇందులో సెప్టెంబర్ 1, 2021 నుండి డిసెంబర్ 5, 2021 మధ్య తయారు చేయబడిన క్లాసిక్ 350 మోటార్‌సైకిళ్లు ఉన్నాయి.

నీ బుల్లెట్ బండినెత్తుకెళ్తా.. ఎత్తుకెళ్తా.. మీ బుల్లెట్ బండిని ఈ దొంగ చిటికెలో మాయం చేసేస్తాడు!

క్లాసిక్ 350 మోటార్‌సైకిల్ లోని సింగిల్ ఛానల్ ABS మరియు రియర్ డ్రమ్ బ్రేక్‌లో ఉపయోగించే బైక్ యొక్క స్వింగ్ ఆర్మ్‌లోని రియాక్షన్ బ్రాకెట్‌లో ఒక భాగంలో లోపాన్ని తమ సాంకేతిక బృందం గుర్తించిన కారణంగా కంపెనీ ఈ రీకాల్ ను ప్రకటించింది. ఈ సమస్య కారణంగా, భవిష్యత్ లో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యగా వీటిని రీకాల్ చేశామని కంపెనీ తెలిపింది. ఈ రీకాల్ వర్తించే మోటార్‌సైకిళ్లను గుర్తించి కంపెనీ తమ కస్టమర్లను సంప్రదించడం కూడా ప్రారంభించింది.

వీడియో మూలం: Parmit Singh Official

More from DriveSpark

Article Published On: Thursday, March 17, 2022, 11:42 [IST]
English summary
Viral video thief steals royal enfield bullet motorcycle
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+