నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్‌ని చితకబాదిన యువతి; పబ్లిక్ మొత్తం షాక్

మనం నిత్యజీవితంలో సోషల్ మీడియా పేస్ బుక్, ట్విట్టర్ మరియు యూట్యూబ్ వంటి వాటిలో ఎన్నో ఆసక్తికరమైన వీడియోలో చూస్తూనే ఉంటాము. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉంటాము. అయితే ఇలాంటి ఒక ఆసక్తికరమైన మరో వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్‌ని చితకబాదిన యువతి; పబ్లిక్ మొత్తం షాక్

నివేదికల ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాజధాని నగరం లక్నోలో ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలో ఒక యువతి నడిరోడ్డులో ఒక క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేసిన దృశ్యాలను మనం చూడవచ్చు. అంతటితో ఆగకుండా ఆ యువతి ఆ డ్రైవర్ యొక్క సెల్ ఫోన్‌ను కూడా నేలకేసి కొట్టింది.

నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్‌ని చితకబాదిన యువతి; పబ్లిక్ మొత్తం షాక్

ఈ వీడియో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా మారటం వల్ల #ArrestLunowGirl అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్‌గా మారింది. ఇక్కడ ఉన్న యువతి క్యాబ్ డ్రైవర్‌ని రోడ్డు మధ్యలో కొట్టడం అక్కడున్న వాహనదారులందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఈ వైరల్ వీడియోలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్‌ కూడా ఉన్నాడు.

నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్‌ని చితకబాదిన యువతి; పబ్లిక్ మొత్తం షాక్

ఈ యువతి చేస్తున్న విపరీత చర్యను రోడ్డుపై అంతమంది వ్యక్తులు ఉన్నప్పటికీ ఎవరూ ఆపడటానికి ప్రయత్నించలేదు. అక్కడ ఉన్నది ఒక యువతి కావున చాలామంది ఏమి చేయలేకపోయారని మనం అర్థమవుతుంది. ఇంత సంఘటన జరిగినప్పుడు కనీసం ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా అక్కడ లేకపోవడం చాలా విచిత్రం.

నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్‌ని చితకబాదిన యువతి; పబ్లిక్ మొత్తం షాక్

రోడ్డుపై ఆ యువతి క్యాబ్ డ్రైవర్ ని ఇష్టమొచ్చినట్లు ఎగిరి, ఎగిరి కొడుతూనే ఉంది. అయితే ఈ సంఘటన జరిగే సమయంలో ఆ యువతిని నిలువరించడానికి అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అయితే అతనిపై కూడా ఆ యువతి దాడిచేయడానికి ప్రయత్నించింది.

నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్‌ని చితకబాదిన యువతి; పబ్లిక్ మొత్తం షాక్

అయితే ఆ యువకుడు ఏ మాత్రం ఊరుకోక తిరిగి ఆమెపై దాడి చేసాడు. మొత్తానికి ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఆ యువతి ఎందుకు అంతగా ఆ క్యాబ్ డ్రైవర్ ని కొడుతుంది అనేదానికి కచ్చితమైన కారణం తెలియదు కానీ, ఇక్కడ జరిగిన సంఘటన మొత్తం సిసి కెమెరాల్లో రికార్డ్ చేయబడింది.

అయితే మీరు ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తే, వాహనాలు వేగంగా వస్తున్నప్పుడు జీబ్రా క్రాసింగ్ వద్ద నడుస్తున్న యువతిని గమనించవచ్చు. ఆ సమయంలో అటుగా వస్తున్న బస్సు నుంచి ఈమె తప్పించుకుంది. అయితే తర్వాత క్యాబ్ వచ్చింది. క్యాబ్ ఆమెను ఢీ కొట్టిందా లేదా అనేదాని గురించి కూడా ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే ఆమె కొంత గాయపడినట్లు తెలిసింది.

దీనికి కారణమైన ఆ క్యాబ్ డ్రైవర్ ని ఆ యువతి బలవంతంగా బయటకు లాగి కొడుతూ చెలరేగిపోయింది. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే అతనిపై ఏ కేసులు నమోదు చేయబడ్డాయి అనేది తెలియదు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో, నెటిజన్లు క్యాబ్ డ్రైవర్‌కు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు.

నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్‌ని చితకబాదిన యువతి; పబ్లిక్ మొత్తం షాక్

నెటిజన్లు #ArrestLunowGirl అనే హ్యాష్‌ట్యాగ్ కింద క్యాప్ డ్రైవర్‌కు మద్దతు ఇస్తున్నారు. ఈ కారణంగా హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్‌గా మారింది. నడిరోడ్డులో జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. చాలా మంది నెటిజన్లు ఈ విషాద సంఘటనలు పాల్పడిన ఆ యువతిపై మండిపడుతున్నారు. నడిరోడ్డులో యువకున్ని ఇష్టమొచ్చినట్లు కొట్టడం అనేది చాల దారుణమైన సంఘటన.

Most Read Articles

English summary
Woman Thrashes Cab Driver In The Middle Of The Road. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X