Virat Kohli First Car డీజీల్ కి బదులు పెట్రోల్ పట్టించా..తన ఫస్ట్ కారుపై కింగ్ కోహ్లీ ఆసక్తికర ఇంటర్వూ..!

విరాట్ కోహ్లీ పరిచయం అక్కర్లేని పేరు దేశంలో పేరొందిన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ స్థానం చాలా ప్రత్యేకమైనది. తనదైన స్టైల్ లో కెరీర్ ని ప్రారంభించిన విరాట్ అతి తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ గా ఎదిగారు. ప్రేక్షకులు ముద్దుగా కింగ్ కోహ్లీగా విరాట్ ను పిలుస్తారు. భారత క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికరమైన విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ టీమిండియా తో పాటు, ఆర్సీబిలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ కి అందించిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను విరాట్ పంచుకున్నారు. ప్రస్తుతం అతని గ్యారేజ్లో చాలా విలాసవంతమైన కారులో ఉన్నాయి. అయితే వీటన్నింటి కంటే తాను సొంత డబ్బుతో కొనుగోలు చేసిన కారు అంటే చాలా ఇష్టమని విరాట్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Virat Kohli First Car

టాటా సఫారీ..
పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైన టాటా సఫారీ కారును తన సొంత డబ్బుతో కొనుగోలు చేసినట్లు విరాట్ చెప్పారు. స్టార్ స్పోర్ట్స్ జతిన్ సప్రూతో విరాట్ కోహ్లీతో నిర్వహించిన ఇంటర్వ్యూ స్టార్ మీడియా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ సఫారి కారును కొనుగోలు చేయడానికి గల కారణాలను విరాట్ వివరించాడు.

కేవలం ఫీచర్ల కోసం మాత్రమే కాదు, ప్రజల్లో ఉన్న ఈ కారుకి ఉన్న గుర్తింపు ఆధారంగా దీనిని కొనుగోలు చేసినట్లు విరాట్ తెలిపాడు. ఈ కారుపై తన అన్న వికాస్ తో కలిసి వెళుతుండగా చోటు చేసుకున్న వింత అనుభవాన్ని విరాట్ వివరించాడు. ఆ సంఘటనను ఇప్పటికీ మర్చిపోలేనని కోహ్లీ గుర్తు చేశాడు.

డీజీల్ కి బదులు పెట్రోల్..
తన అన్నతో కలిసి బంక్ కి వెళ్ళగా.. డీజిల్ కి బదులుగా కారులో పెట్రోల్ నింపినట్లు విరాట్ చెప్పారు. కొద్ది దూరం వెళ్ళాక విషయాన్ని గమనించి కారు ట్యాంక్ ని మొత్తం ఖాళీ చేసినట్లు కోహ్లీ వెల్లడించాడు. తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన ఈ కారు ఇంకా ఎన్నో అనుభూతుల్ని కలిగి ఉందని విరాట్ తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు.

విరాట్ కోహ్లీకి స్పోర్ట్స్ కార్లంటే ఎనలేని ఇష్టం. అయితే తాజాగా తను కొనుగోలు చేసే కార్లలో ఎక్కువగా స్పేస్ ఉండేలా చూసుకుంటున్నట్లు విరాట్ చెప్పాడు. ఫీచర్ల పరంగా కాకుండా ఎక్కువగా బూట్ స్పేస్ కలిగి ఉండి కంఫర్ట్ గా ఉండే కార్లు అంటే ఇష్టమని వివరించాడు. కేవలం ఫ్యామిలీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు విరాట్ వెల్లడించాడు. అలాంటి కార్లు తన గ్యారేజీలో ఉండేట్లు చూసుకున్నాడు.

గ్యారేజీలో అత్యాధునిక కార్స్..
ప్రస్తుతం తన వద్ద నాలుగు ఆధునాతన కార్లు ఉన్నాయని విరాట్ వెల్లడించాడు. దీనితో పాటు, కోహ్లీ సిబ్బంది కోసం ఉపయోగించే ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. కోహ్లి స్వయంగా ఆడి కార్ కంపెనీకి అంబాసిడర్ కావడంతో ఆ కొన్ని ఖరీదైన కార్లు బహుమతిగా ఇచ్చింది. అలానే తాను సొంతంగా కొన్ని కారులను కొనుగోలు చేశాడు.

ప్రస్తుతం ముంబైలో ఉన్న విరాట్ ఢిల్లీలోని తన ఇంట్లో చాలా ఖరీదైన మరియు ఖరీదైన కార్లను కలిగి ఉన్నాడు. ఆడి R8 LMX విరాట్ కోహ్లీ కార్ల కలెక్షన్‌లో అత్యంత వేగవంతమైన కారు. ఈ సూపర్ కారు ధర రూ.2.97 కోట్లగా ఉంది. ఈ కారు 5.2 లీటర్ V10 ఇంజన్‌తో వస్తుంది. ఇది తనగ్యారేజ్లో అత్యంత శక్తివంతమైన కారుగా ఉంది.

ఈ కారులో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉన్నందున, ఈ కారు ఇంజన్ పవర్ కారులోని అన్ని చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది. ఈ కారులో ప్రయాణించే అనుభూతి వర్ణించలేనిది. ప్రపంచంలో ఈ కారు మోడల్ కార్లు కేవలం 99 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి విరాట్‌ గ్యారేజ్ లో ఉంది. ఇది దక్షిణాసియాలోని ఏకైక ఆడి R8 LMX మోడల్ గా పేరుగాంచింది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 12, 2023, 17:08 [IST]
English summary
Virat kohli about his first car tata safari reveals reason behind for brought
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+