కోహ్లీ & అనుష్క శర్మలను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. వీడియో
అటు క్రికెట్ లోనూ ఇటు సినిమా రంగంలోనూ బాగా పేమస్ అయిన 'విరాక్ కోహ్లీ' మరియు 'అనుష్క శర్మ' జంట గురించి దాదాపు పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే కోహ్లీ క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకోగా.. సినిమాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది అనుష్క శర్మ. అయితే వీరిద్దరూ ఒకేసారి కనిపిస్తే ఇక అభిమానవులకు పండుగే.
Recommended Video
ఇటీవల విరుష్క జంట పబ్లిక్ రోడ్డు మీద స్కూటర్ మీద వెల్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

విరాట్ కోహ్లీ & అనుష్క శర్మ ఇటీవల 'సుజుకి యాక్సెస్ 125' (Suzuki Access 125) స్కూటర్ రైడ్ చేస్తూ కనిపించారు. వీరు ప్రస్తుతం షూటింగ్ కోసం ముంబైలోని మడ్ ఐలాండ్‌లో ఉన్నారు. దీని కోసం వారు త్వరగా వెళ్ళడానికి స్కూటర్ పై వెళ్లినట్లు సమాచారం. ఇందులో కోహ్లి మరియు అనుష్క శర్మ ఇద్దరూ డార్క్ వైజర్‌లతో కూడిన హెల్మెట్‌లను ధరించారు.

నిజానికి సెలబ్రెటీలు సాధారణ ప్రజల మాదిరిగా తిరిగే అవకాశం లేదు. ఒక వేళా తిరిగారంటే ఫ్యాన్స్ చుట్టిముట్టేస్తారు. ఈ కారణంగానే వారు ఈ హెల్మెట్స్ ధరించారు. ఈ విధంగా చేయడం వల్ల అభిమానులు గుర్తించే అవకాశం తక్కువ. కావున వీరి హ్యాప్పీగా ముందుకు వెళ్లిపోవచ్చు. విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ స్కూటర్ రైడింగ్ చేస్తూ కనిపించడం బహుశా ఇదే మొదటిసారి.

సాధారణంగానే సెలబ్రెటీలు విలాసవంతమైన కార్లు మరియు బైకులను కలిగి ఉంటారు. అందులోనూ విరుష్క జంట బెంట్లీ బ్రాండ్ కార్ల దగ్గర నుంచి రేంజ్ రోవర్స్ కార్ల వరకు అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. ఎప్పుడూ వారు అలాంటి కార్లను డ్రైవ్ చేస్తూ కనిపించేవారు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా ఒక స్కూటర్ రైడింగ్ చేస్తూ కనిపించారు.

గతంలో విరాట్ కోహ్లీ టయోటా మరియు టీవీఎస్ మోటార్స్ వంటి ఆటోమొబైల్ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. అయితే అనుష్క శర్మ టీవీఎస్ స్కూటీ పెప్ స్కూటర్‌ను ప్రమోట్ చేసింది. విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ తమ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ సమయంలో మాత్రమే ద్విచక్ర వాహనాలపై మాత్రమే కనిపించారు. నిజ జీవితంగా స్కూటర్ పైన కనిపించడం ఇదే మొదటిసారి.

సుజుకి మోటార్సైకిల్ యొక్క యాక్సెస్ 125 అనేది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆటోమేటిక్ స్కూటర్లలో ఒకటి. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండి, అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువమంది కొనుగోలుదారు ఈ స్కూటర్ కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ 125 సిసి, ఫ్యూయెల్ ఇంజెక్ట్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ పొందుతుంది. ఇది 8.7 పిఎస్ పవర్ మరియు 10 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ స్కూటర్ ధర భారతీయ మార్కెట్లో రూ. 77,600 (ఎక్స్-షోరూమ్-ఢిల్లీ).

భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కావున అలంటి సమయంలో కార్లు మరియు ఇతర వాహనాలకంటే ఈ స్కూటర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కారణంగానే స్కూటర్ వినియోగం ఎక్కువవుతోంది, అమ్మకాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్ స్కూటర్లకంటే కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ కారణంగా కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తున్న రానున్న మరో 5 సంవత్సరాల్లో తప్పకుండా ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ వాహనాలే వినియోగంలో ఉంటాయి, అనటంలో ఎటువంటి సందేహం లేదు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
విరాక్ కోహ్లీ మరియు అనుష్క శర్మ కార్ గ్యారేజ్ లో ఎక్కువ సంఖ్యలో లగ్జరీ కార్లు ఉన్నాయి, ఇందులో ఆడి క్యూ7, ఆడి ఎస్ 6, ఆడి ఆర్8 వి10 స్పోర్ట్స్, ఆడి ఆర్8 ఎల్‌ఎమ్ఎక్స్, ఆడి ఏ8, రేంజ్ రోవర్ వోగ్ మరియు బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ వంటి కార్లు ఉన్నాయి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతోపాటు కొత్త కార్లు మరియు బైకుల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








