విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

By Anil

ఇంటర్నెట్, సోషల్ మీడియా ఎక్కడి చూసినా గత కొన్ని రోజులుగా విరాట్-అనుష్క శర్మల వివాహం గురించిన వార్తలు మార్మోగిపోయాయి. బాలీవుడ్ కథానాయికి అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటలీలో కొన్ని కోట్ల రుపాయలతో వివాహ వేడుక పూర్తి చేసుకున్న ఇద్దరూ విరూష్క జంటగా ఇండియాకు తిరిగొచ్చారు.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

ఢిల్లీ మరియు ముంబాయ్‌ నగరాలలో ఒకటి చెప్పున రెండు రిసెప్షన్లను పార్టీలు చేయనున్నారు. గత కాలం ప్రేమతో ఒక్కటైన ఈ సెలబ్రిటీ జంట పెళ్లి గురించి తెలియని వారంటూ ఉండరు. కాబట్టి ఇటు విరాట్ కోహ్లీ, అటు అనుష్క అభిమానుల కోసం వారి వద్ద ఉన్న కళ్లు చెదిరే ఖరీదైన లగ్జరీ కార్ల గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రత్యేక కథనం...

Recommended Video - Watch Now!
Pope Francis Gifted Lamborghini Huracan RWD - DriveSpark
విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

ఆడి కార్లకు దాసోహం

ప్రపంచ వ్యాప్తంగా బిఎమ్‌డబ్ల్యూ కార్లకు క్రికెట్ లెజెండ్ సచిన్ ఎంతటి బానిసో, అచ్చం అలాగే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఆడి కార్లంటే విపరీతమైన ఇష్టం. అయితే ఓ సారి టయోటా మోటార్స్‌కు కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. కోహ్లి ఎంచుకున్న సాధారణ మరియు ఆడి కార్ల గురించి వివరంగా తరువాత స్లైడర్ల ద్వారా తెలుసుకోగలరు.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

రెనో డస్టర్

విరాట్ తన 23 ఏట టీమ్ ఇండియా తరపున 2012 శ్రీలంక తో ఆడిన మ్యాచ్‌లో 74 పరుగులు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రెనో డస్టర్‌ను బహుమతిగా పొందాడు. మ్యాచ్ తరువాత కోహ్లి తన టీమ్‌‌ను కారులో ఎక్కించుకుని స్టేడియం మొత్తం రౌండ్లు వేశాడు.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

కస్టమైజ్ మోడల్

కోహ్లి వ్యక్తిగతంగా వాడుకునే సమయంలో ఈ డస్టర్ టాప్ ఎండ్ డీజల్ వేరియంట్ తన అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేయించుకున్నాడు. ప్రత్యేకించి 459 లీటర్ల ఇంధనాన్ని స్టోర్ చేసుకునేలా ఫ్యూయల్ ట్యాంకును మోడిఫై చేయించుకున్నాడు.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

టయోటా ఫార్చ్యూనర్

విరాట్ ఒక సారి టయోటా కిర్లోస్కర్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేశాడు. అప్పుడు టయోటా కోహ్లికి ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ వాహనాన్ని బహుకరించింది. 25 లక్షలు పైబడి విలువ గల ప్రీమియమ్ ఎస్‌యూవీల విపణిలోకి టయోటా ఫార్చ్యూనర్ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోంది.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

టయోటా ఫార్చ్యూనర్ ప్రత్యేకతలు

టుర్బో డీజల్ ఇంజన్ గల ఫార్చ్యూనర్‌లో 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలదు. ఇందులోని డి-4డి ఇంజన్ గరిష్టంగా 170బిహెచ్‌పి పవర్ మరియు 343 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

చాలా మంది సినీ మరియు స్పోర్ట్స్ సెలబ్రిటీల ఖాతాలో ఆడి క్యూ7 దాదాపు ఉంటుంది. ఆడి ఇండియా లైనప్‌లో క్యూ7 అత్యంత ముఖ్యమైన ఫ్లాగ్‌షిప్ మోడల్. అత్యుత్యమ ఇంటీరియర్ స్పేస్, మూడు వరుసల సీటింగ్ కెపాసిటి మరియు ఎన్నో లగ్జరీ, సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

ఆడి క్యూ7 ప్రత్యేకతలు

ఆడి క్యూ7 ఎస్‌యువిలో 4.2-లీటర్ కెపాసిటి గల టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 335 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్‌కు 8-స్పీడ్ ఆటోమోటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉంది. ఏడు మంది ప్రయాణించే వెసులుబాటు ఉన్న దీని ధర సుమారుగా రూ. 75 లక్షలుగా ఉంది.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

ఆడి ఎస్ 6 లగ్జరీ సెడాన్(S6)

ఆడి ఏ6 కన్నా కంటే అత్యుత్తమ పనితీరును కనబరిచే కారు ఆడి ఎస్6. అందుకోసమే కాబోలు అత్యంత వేగవంతమైన సెడాన్ కారుకు కోహ్లీ ఆకర్షితుడయ్యాడు. ఇందులో ఉన్న ఫీచర్లకు ఫిదా అయిపోయిన కోహ్లి దీనిని డ్రైవ్ చేయడానికి ఎంతో అనువుగా ఉంటుందని ఓ సందర్భంలో తెలిపాడు.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

ఆడి ఎస్ 6 ప్రత్యేకతలు

ఆడి సంస్థ తమ ఎస్6 సెడాన్ కారులో 4.0-లీటర్ కెపాసిటి గల వి-8 ఇంజన్‌ను అందించింది. ఈ టుర్బో పెట్రోల్ ఇంజన్ దాదాపుగా 420 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా కేవలం 1500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 550 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ విడుదల చేయు పవర్ మొత్తం 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా అన్ని చక్రాలకు అందుతుంది.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

ఆడి ఆర్‌8 వి10 స్పోర్ట్స్ కారు

ఆడి అత్యధికంగా అమ్మకాలు సాధిస్తున్న వాటిలో ఇది కూడా ఒకటి. ఆడి ఆర్8 కారు వి10 మరియు వి8 ఇంజన్‌లతో అందుబాటులో ఉంది. వీటిలో ఆడి ఆర్8 వి10 కారును విరాట్ కోహ్లీ ఎంచుకున్నాడు.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

ఆడి ఆర్8 వి10 ప్రత్యేకతలు

ఇందులో 5.2-లీటర్ కెపాసిటి గల వి10 ఇంజన్ కలదు. టుర్బో ఛార్జర్ గల ఇందులోని ఇంజన్ 517బిహెచ్‌పి పవర్ మరియు 530ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇందులోని ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇంజన్ విడుదల చేసే పవర్‌ను అన్ని చక్రాలకు సరఫరా చేస్తుంది. దీని విలువ సుమారుగా రూ. 2 కోట్లుగా ఉంది.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

ఆడి ఆర్8 ఎల్‌ఎమ్ఎక్స్(Audi R8 LMX)

విరాట్ గత 2015లో రెండు ఆడి కార్లను కొనుగోలు చేశాడు. అందులో ఆడి ఆర్‌8 ఎల్ఎమ్ఎక్స్ కారు ఒకటి. దీని గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లుగా ఉంది. లిమిటెడ్ ఎడిషన్‌గా ఆడి కేవలం 99 కార్లను మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది అందులో ఒకటి కోహ్లి సొంతం చేసుకున్నాడు.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

ఆడి ఆర్8 ఎల్‌ఎమ్ఎక్స్- ప్రత్యేకతలు

ఈ కారు వేగవంతమైనదే కాదు, అత్యంత శక్తివంతమైన హై బీమ్ లేజర్ లైటింగ్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ లైట్ సాధారణ లైట్ల కన్నా రెండు రెట్లు ఎఫెక్టివ్ కాంతిని ఇస్తాయి. దాదాపుగా అర కిలోమీటర్ వరకు స్పష్టంగా రోడ్డును చూడగలం. బహుశా ఇలాంటి ఫీచర్లకే కోహ్లీ ఫిదా అయ్యుంటాడు.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

ఆడి ఆర్8 ఎల్‌ఎమ్ఎక్స్ - ఇంజన్ మరియు స్పీడ్

ఇందులో 570 బిహెచ్‌పి పవర్ మరియు 540 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌‌ను ఉత్పత్తి చేయగల 5.2-లీటర్ కెపాసిటి గల వి10 ఇంజన్ కలదు. మాటల్లోనే కాదు రోడ్లు మీద కూడా ఇది ఇంతే పని తీరుతో గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఎంత అంటే, కోహ్లీ బాదే బంతుల వేగానికి రెట్టింపని చెప్పువచ్చు.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

ఆడి ఆర్8 ఎల్‌ఎమ్ఎక్స్ మరియు ధర

ఆడి ఆర్‌8 ఎల్ఎమ్ఎక్స్ సిరీస్ కారు కేవలం 3.4 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుటుంది. మరియు ఇది గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. ఇంత వేగం ఇండియన్ రోడ్ల మీద సాధ్యం కాకపోవచ్చు. ఆడి ఆర్8 ఎల్‌ఎమ్ఎక్స్ ధర రూ. 3 కోట్లుగా ఉంది.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

ఆడి ఏ8 లగ్జరీ కారు

ఆడి ఇండియా 2015లో విపణిలోకి ప్రవేశపెట్టింది. ఆడి విక్రయిస్తున్న సెడాన్ కార్లలో ఇదే అన్నింటి కన్నా ఖరీదైనది. ఈ ఆడి ఏ8 సెడాన్ కారులో ఇండియన్ రోడ్ల కోసం వీల్ బేస్ అధికంగా కల్పించింది. ఇండియన్ మార్కెట్లో దీనిని విడుదల చేసిన వెంటనే కొనుగోలు చేయడానికి వెళ్లిన మొదటి వ్యక్తి కోహ్లీ.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

ఆడి ఏ8 ప్రత్యేకతలు

ఆడి దీనిని 3.0-లీటర్ కెపాసిటి గల వి6 డీజల్ ఇంజన్, 4.2-లీటర్ కెపాసిటి గల వి8 డీజల్ ఇంజన్ మరియు 6.3-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ లలో అందుబాటులో ఉంచింది. అయితే కోహ్లి ఎంచుకున్న కారులో ఉన్న ఇంజన్ దాదాపుగా 494బిహెచ్‌పి పవర్ మరియు 625ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాదాపుగా 100 వరకు ఎక్ట్సీరియర్ రంగుల్లో అదేవిధంగా 23 కాంబినేషన్స్ గల ఇంటీరియర్ రంగుల్లో ఇది లభించును.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

అనుష్క శర్మ కార్ కలెక్షన్

మిస్ అనుష్క శర్మ.. క్షమిచండి! మిసెస్ అనుష్క విరాట్. కోహ్లీతో పోల్చుకుంటే అనుష్క వద్ద రెండు లగ్జరీ కార్లు మాత్రమే ఉన్నాయి. అయితే, ఆ రెండు కూడా చాలా విభిన్నం. మోడ్రన్ ట్రెండ్ ఫాలో అవుతూ, ఎప్పుడు ఫ్యాషన్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్‌గా బ్రతికే ఈ ముద్దగుమ్మ వద్ద ఎలాంటి కార్లున్నాయో చూద్దాం రండి...

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

రేంజ్ రోవర్ వోగ్ ఎస్‌యూవీ

రేంజ్ రోవర్ లైనప్‌లో అత్యంత విలాసవంతమైన వెహికల్ వోగ్ ఎస్‌‌యూవీ. అనుష్క శర్మకు రేంజ్ రోవర్ వోగ్ ఎంతో ఇష్టం. ఎక్కడికెళ్లినా దాదాపు ఇదే వెహికల్ ఎంచుకుంటుంది. దీని ధర సుమారుగా రూ. 2.08 కోట్లకు పైమాటే.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

రేంజ్ రోవర్ వోగ్ ఎస్‌యూవీ లగ్జరీ ఎస్‌యూవీలో 4.4 ఎస్‌డివి8 వోగ్ ఎస్ఇ 4,367సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 250బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా లైనప్‌లో 7-సిరీస్ లగ్జరీ సెడాన్ ఫ్లాగ్‌షిప్ మోడల్. బిఎమ్‌డబ్ల్యూకు అతి ముఖ్యమైన మోడల్‌గా నిలిచిన ఎంతో మంది సెలబ్రిటీల్లో ఫేవరెట్ కారుగా స్థానం సంపాదించుకుంది. అందులో ఒకరు అనుష్క శర్మ. దీని ధర సుమారుగా రూ. 1.11 కోట్లుగా ఉంది.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ సెడాన్‌లో సాంకేతికంగా 3.0-లీటర్ కెపాసిటి గల ఇన్-లైన్ ఆరు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. వోగ్ మ్యాగజైన్ నుండి బహుమానంగా పొందిన ఈ కారు గరిష్టంగా 262బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కార్ కలెక్షన్

విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ వద్ద ఈ కార్లు ఉన్నాయి. అయినా, ఇంకా విరాట్ కార్లు... అనుష్క కార్లు ఏమిటి... పెళ్లితో ఒక్కటయ్యారు కాబట్టి లక్షణంగా విరూష్క కార్ కలెక్షన్ అనుకుంటే సరిపోతుంది.

ఈ కథనం గురించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి... ఇలాంటి ఎన్నో స్టోరీస్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్‌తో టచ్‌లో ఉండండి.

English summary
Read In Telugu: Cars of Virat Kohli and Anushka Sharma – Virushka’s Car Collection
X

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more