ఖతర్నాక్‌ కోహ్లీ కార్లు.. సొంత డబ్బుతో తొలిసారి కొన్న కారు ఇదే!!

17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీ20 వరల్డ్ కప్‌ని రెండోసారి టీమిండియా కైవసం చేసుకుంది. జట్టులను సభ్యులంతా ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమ్ ఇండియాకు ఘనవిజయాన్ని అందించారు. ఒకానొక సమయంలో ఓటమి అంచు వరకు వెళ్లిన టీమిండియా అద్భుతమైన ఫర్ఫామెన్స్‌తో ప్రోటీస్ జట్టును మట్టి కరిపించింది. ముఖ్యంగా టీమ్ లోని సీనియర్ ఆటగాళ్లైనా కోహ్లీ, రోహిత్, బుమ్రా కీలక సమయాల్లో తమ అనుభవాన్ని ఉపయోగించి కప్‌ని దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. కీలక సమయాల్లో వికెట్లు తీసిన హార్దిక్ పాండ్య, మ్యాచ్‌లో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన సూర్య కుమార్ యాదవ్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు.

టీమ్ ఇండియాకు టీ20 ప్రపంచకప్ కిరీటాన్ని అందించిన తర్వాత కెప్టెన్‌ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఫైనల్‌లో 59 బంతుల్లో 76 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. కప్‌ అందించటంలో కీలక పాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదే తనకు చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ అని మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్‌లో ప్రకటించాడు.

Virat-Kohli-Cars-Collection-List-In-Telugu

మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు ప్రకటనతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంతకంటే గొప్ప విజయం ఉండదని కోహ్లీ తెలిపాడు. అందుకే ఇంటర్నేషనల్‌ టీ20 కెరీర్‌ని ముగించాలనుకుంటున్నానని వెల్లడించాడు. కోహ్లీకి అదే చివరి మ్యాచ్ అయినప్పటికీ T20 అంతర్జాతీయ కెరీర్‌ను గొప్ప విజయంతో ముగించడం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇవన్నీ పక్కన పెడితే క్రికెటర్లకు కార్లపై క్రేజ్ ఎక్కువనే చెప్పాలి.

అయితే విరాట్ తన సొంత డబ్బుతో తొలిసారిగా స్వదేశీ టాటా సఫారీని కొనుగోలు చేశాడు. తన సంపాదనతో కొనుగోలు చేసిన మొదటి కారు సఫారీ అని కోహ్లీ చాలా సందర్భాల్లో వెల్లడించాడు. ఈ సఫారీ కారును కొనుగోలు చేయడానికి కారణం ఫీచర్స్ మాత్రమే కాదు, రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మంచి అనుభూతి ఇస్తుందని విరాట్ కోహ్లీ చెప్పాడు. విరాట్ కోహ్లీకి స్పోర్ట్స్ కార్లంటే చాలా ఇష్టం.

Virat-Kohli-Tata-Safari

ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్‌ కావడంతో విరాట్‌ కోహ్లీ కారు కొనే సమయంలో కొద్దిగా ఆచితూచీ వ్యవహరిస్తున్నట్లు వెల్లడించాడు. అయితే ఇప్పుడు ఫ్యామిలీ కోసం కార్లను తీసుకుంటున్నట్లు తెలిపాడు. అందుకే స్పోర్ట్స్‌ కారుపై మోజు తగ్గించుకున్నట్లు ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో చెప్పాడు. ప్రస్తుతం ముంబైలో నివాసముంటున్న విరాట్ ఢిల్లీలోని తన ఇంట్లో చాలా ఖరీదైన మరియు ఖరీదైన కార్లను కలిగి ఉన్నాడు.

ఆడి R8 LMX: కోహ్లీ స్వయంగా ఆడి కార్ కంపెనీకి అంబాసిడర్‌గా ఉన్నాడు. అందువల్ల అతనికి కొన్ని ఖరీదైన కార్లు బహుమతిగా కంపెనీ ఇచ్చింది. దీంతో పాటు మరికొన్ని కార్లను కోహ్లీ కొనుగోలు చేశాడు. అందులో ఆడి R8 LMX విరాట్ కోహ్లీ కార్ల సేకరణలో అత్యంత లగ్జరీ సూపర్‌ కారుగా ఉంది. ఈ సూపర్‌కార్ 5.2 లీటర్ V10 ఇంజిన్‌తో పని చేస్తుంది.

Virat-Kohli-Audi-Cars

ఇతర ఆడి కార్లు: విరాట్ కోహ్లీకి చెందిన మరో ఆకర్షణీయమైన కారు ఆడి A8L W12. ఇది 6.3 లీటర్ W12 ఇంజిన్‌తో పని చేస్తుంది. మరో విలాసవంతమైన కారు ఆడి క్యూ7. ఇందులో 3.0 లీటర్ వీ6 డీజిల్ ఇంజిన్ కలదు. ఆడి ఎస్6 అనేది విరాట్ కోహ్లీకి చెందిన మరో ఆడి కంపెనీ కారుగా ఉంది. ఆడి కార్లు ఎక్కువగా కోహ్లీ గ్యారేజీలో ఉన్నాయి.

రేంజ్ రోవర్ వోగ్ (Range rover vogue): విరాట్ కోహ్లీకి చెందిన మరో లగ్జరీ కారు. ఈ SUV 4.4 లీటర్ SDV8 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. వీటితో పాటు కోహ్లీ గ్యారేజీలో బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, టయోటా ఫార్చ్యూనర్ మరియు రెనాల్ట్ డస్టర్ కార్లను కూడా కలిగి ఉన్నాడు. ప్రస్తుతం కార్లపై ఎక్కువ కోహ్లీ దృష్టి పెట్టడం లేదు. ప్రస్తుతం కుటుంబానికి, క్రికెట్‌కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాడు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 2, 2024, 10:57 [IST]
English summary
Virat kohli car collection tata safari to most expensive cars list in telugu
Read more on: #celebrity car #car #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+