విరాట్ కోహ్లీ గిఫ్ట్‌గా పొందిన 'హ్యుందాయ్ ఐ 20' ; పూర్తి వివరాలు

భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి దాదాపు అందరికి తెలిసిందే. ఇతడు అనేక లగ్జరీ కార్లు మరియు బైక్ లను కలిగి ఉన్నాడు. ఎందుకంటే కోహ్లీ కి కార్లు మరియు బైక్స్ అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే అతని గ్యారేజ్ లో అనేక విలాసవంతమైన వాహనాలను చూడవచ్చు.

విరాట్ కోహ్లీ గిఫ్ట్‌గా పొందిన 'హ్యుందాయ్ ఐ 20' ; పూర్తి వివరాలు

ఇక అసలు విషయానికి వస్తే, ఇటీవల టీ 20 ఇంటెర్నేషనల్ క్రికెట్ సిరీస్‌లో ఇండియా టీమ్ ఇంగ్లాండ్‌పై 3-2 తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నమెంట్‌లో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ 'పెర్ఫార్మర్ ఆఫ్ ది సిరీస్' గా ఎంపికైన కారణంగా, అతనికి కొత్త హ్యుందాయ్ ఐ 20 టర్బోను గిఫ్ట్ గా ఇచ్చారు.

విరాట్ కోహ్లీ గిఫ్ట్‌గా పొందిన 'హ్యుందాయ్ ఐ 20' ; పూర్తి వివరాలు

విరాట్ కోహ్లీకి గిఫ్ట్ గా పొందిన ఈ హ్యుందాయ్ ఐ 20 టర్బో ఫెయిరీ రెడ్ కలర్ ఫినిషింగ్ తో ఉంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ చివరి మ్యాచ్‌లో కేవలం 52 బంతుల్లో 80 పరుగులు చేయడం, భారత జట్టు విజయానికి కారణమైంది. ఇందులో ఇండియా టీమ్ మొత్తం 224 పరుగులు సాధించింది.

MOST READ:మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

విరాట్ కోహ్లీ గిఫ్ట్‌గా పొందిన 'హ్యుందాయ్ ఐ 20' ; పూర్తి వివరాలు

విరాట్ కోహ్లీకి ఇచ్చిన ఈ హ్యుందాయ్, కంపెనీ యొక్క టాప్-ఎండ్ వేరియంట్. ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న అత్యంత ఖరీదైన మరియు ఫీచర్ లోడ్ చేసిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో హ్యుందాయ్ ఐ 20 ఒకటి. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అనేక ఫీచర్స్ కూడా కలిగి ఉటుంది.

విరాట్ కోహ్లీ గిఫ్ట్‌గా పొందిన 'హ్యుందాయ్ ఐ 20' ; పూర్తి వివరాలు

హ్యుందాయ్ ఐ 20 యొక్క బేస్ వేరియంట్ ధర రూ. 6.79 లక్షలు(ఎక్స్-షోరూమ్) కాగా, దాని టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 11.32 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కంపెనీ యొక్క ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా మరియు ఆస్టా (ఓ) అనే నాలుగు వేరియంట్‌లలో అందించబడింది.

MOST READ:ఫిబ్రవరి 2021 కెటిఎమ్ బైక్స్ సేల్స్ రిపోర్ట్, ఇదే.. చూసారా..!

విరాట్ కోహ్లీ గిఫ్ట్‌గా పొందిన 'హ్యుందాయ్ ఐ 20' ; పూర్తి వివరాలు

భారత మార్కెట్లో, కొత్త హ్యుందాయ్ ఐ 20 మారుతి సుజుకి బాలెనో, టాటా అల్ట్రోస్, టయోటా గ్లాంజా, ఫోక్స్వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లో అతై తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది మోడల్ గా నిలిచింది. ఈ కారణంగా ఈ హ్యుందాయ్ ఐ 20 దాడ్పు 35,000 యూనిట్లు బుక్ చేయబడ్డాయి.

విరాట్ కోహ్లీ గిఫ్ట్‌గా పొందిన 'హ్యుందాయ్ ఐ 20' ; పూర్తి వివరాలు

కొత్త హ్యుందాయ్ ఐ 20 ను కొత్త డిజైన్ మరియు మంచి స్టైలింగ్‌తో విడుదలైంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో హాలోజన్ ప్రొజెక్టర్ లాంప్, పెద్ద క్యాస్కేడింగ్ గ్రిల్ మరియు వెనుక భాగంలో కనెక్ట్టెడ్ టెయిల్ లాంప్ వంటివి ఉన్నాయి. ఇది కొత్త ఫ్రంట్ బంపర్ మరియు ఫాగ్ లాంప్ వంటి వాటిని కలిగి ఉంది.

MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

విరాట్ కోహ్లీ గిఫ్ట్‌గా పొందిన 'హ్యుందాయ్ ఐ 20' ; పూర్తి వివరాలు

కొత్త హ్యుందాయ్ ఐ 20 లోపలి భాగంలో కంట్రోల్ బటన్లతో కూడిన కొత్త స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్రాండ్ యొక్క బ్లూ లింక్ కనెక్ట్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి.

విరాట్ కోహ్లీ గిఫ్ట్‌గా పొందిన 'హ్యుందాయ్ ఐ 20' ; పూర్తి వివరాలు

హ్యుందాయ్ ఐ 20 యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 120 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. దీనికి డిసిటి మరియు 6-స్పీడ్ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటాయి.

MOST READ:ఇండియన్ ఆర్మీలో చేరనున్న కళ్యాణి ఎమ్4 వాహనాలు, పూర్తి వివరాలు

విరాట్ కోహ్లీ గిఫ్ట్‌గా పొందిన 'హ్యుందాయ్ ఐ 20' ; పూర్తి వివరాలు

ఇందులో ఉన్న 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 88 బిహెచ్‌పి, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 83 బిహెచ్‌పిని అందిస్తుంది. ఇక చివరగా మూడవ ఇంజిన్ అయిన 1.5-లీటర్ డీజిల్ ఇంజన్, 100 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
Virat Kohli Gets Hyundai i20 Turbo As Performer Of The Series In Tournament Details. Read in Telugu.
Story first published: Monday, March 22, 2021, 16:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X