విరాట్ కోహ్లీ ఖతర్నాక్ కార్లు చూశారా?.. కింగ్ గ్యారేజీలోని ఒక్కో కారు వీర లెవల్!
భారతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ స్థానం ప్రత్యేకం. తనదైన శైలిలో క్రికెట్ కింగ్‌గా అతి కొద్ది రోజుల్లోనూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే కింగ్ కోహ్లీకి ఉన్న క్రేజ్ మరే క్రికెటర్‌కి లేదు అంటే అతియోశక్తి కాదు. నేడు (November 05) కింగ్ విరాట్ కోహ్లీ 36వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ అంతర్జాతీయ ఫ్రొఫెషనల్ క్రికెట్ చివరి దశలో ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్‌కి గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుత ఫామ్ అలాగే వయసు రీత్యా ఇంకా రెండు లేదా మూడు సంవత్సరాల వరకు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం ఉంది. తన జీవితమంతా క్రికెట్‌కే అంకితం చేశాడు.
ఆఫ్‌ఫీల్డ్ లోనూ విరాట్ కోహ్లీ ప్రత్యేక లైఫ్‌స్టైల్‌ని కలిగి ఉన్నాడు. బ్రాండింగ్, ఇతర ప్రమోషన్స్‌లో కోహ్లీ నంబర్ 1గా ఉన్నాడు. ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విట్టర్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కోహ్లీ సొంతం కావడం విశేషం. కోహ్లీకి డ్యాన్స్, సంగీతం వినడం అంటే ఇష్టం. అలాగే లగ్జరీ కార్లలో లాంగ్ డ్రైవ్ వెళ్తూ ఉంటాడు. ప్రస్తుతం కింగ్ కోహ్లీ గ్యారేజీలో అధునాతన లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

లంబోర్ఘిని హురాకేన్ (Lamborghini Huracane): ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ వద్ద పలు లంబోర్ఘిని కార్లు ఉన్నాయి. ఇందులో హురాకేన్ కూడా వచ్చింది. తాజా అతని గ్యారేజీలో వచ్చి చేరిన కారు ఇదే కావడం విశేషం. ఈ అధునాతన లంబోర్ఘిని V10 ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీని ధర రూ.3.22 కోట్లుగా ఉంది.
పోర్షే 911 (Porsche 911): పోర్షే 911 పైన పేర్కొన్న లాంబోర్ఘిని కారును పోలి ఉంటుంది. ఇది హై పెర్ఫార్మెన్స్‌ని అందిస్తుంది. చాలా ఏళ్లుగా ఈ కారు విరాట్ కోహ్లీ వద్ద ఉంది. ప్రస్తుతం దీని ధర రూ.3.51 కోట్లుగా ఉంది.

బెంట్లీ కాంటినెంటల్ జీటీ (Bentley Continental GT): విరాట్ కోహ్లీ మార్కెట్‌లో ఏదైనా కారు విడుదలైతే కొనేందుకు ముందు వరుసలో ఉంటాడు. తన గ్యారేజీని ఎప్పటికప్పుడు కొత్త కొత్త లగ్జరీ కార్లతో అప్‌డేట్ చేస్తూ ఉంటాడు. ఈ బెంట్లీ కాంటినెంటల్ జీటీని 2018 లో అతను ఈ లగ్జరీ కారుని కొనుగోలు చేశాడు. దీని ధర సుమారు రూ.4 కోట్లుగా ఉంది.
బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ (Bentley Flying Spur): క్రికెటర్ విరాట్ కోహ్లీ గ్యారేజీలో ఉన్న మరో అధునాతన కారు బెంట్లీ ఫ్లయింగ్ స్పర్. ఈ సూపర్ లగ్జరీ బెంట్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.3.8 కోట్లుగా ఉంది. ఈ సూపర్ కారు 6-లీటర్ టర్బోఛార్జ్డ్ V12 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 626bhp పవర్, 900nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.

ఆడి R8 V10: విరాట్ కోహ్లీ 2015 నుంచే ఆడి ఇండియా మార్కెట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. ఈ R8 V10 ఒక లిమిటెడ్ ఎడిషన్ కారు కావడం విశేషం. ఈ ఆడి కారు కొద్దికాలం మాత్రమే కొనుగోలుకి అందుబాటులో ఉంది. కోహ్లీ కోసం కంపెనీ కస్టమైజ్ కూడా చేసింది. జనవరి 2015 లో వచ్చిన ఈ కారు ధర అప్పట్లో రూ .3 కోట్లుగా ఉంది.
ఆడి R8 LXM: విరాట్ కోహ్లీ వద్ద ఉన్న మరో ఆడి కారు ఇది. ఇది కూడా లిమిటెడ్ ఎడిషన్‌గా అందుబాటులోకి వచ్చింది. ఈ కారు ధర రూ.2.36 కోట్లుగా ఉంది. ఈ ఆడి కారు 5.2-లీటర్ వీ10 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఆడి కేవలం 3.2 సెకన్లలో 0 నుంచి 96 వేగాన్ని అందుకుంటుంది. ఇది గంటకు 321 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

రేంజ్ రోవర్ వోగ్: రేంజ్ రోవర్ కార్లకు భారతదేశంలో సొంత ఫ్యాన్ బేస్ ఎక్కువే అని చెప్పాలి. అలాంటి వారిలో విరాట్ కోహ్లీ ఒకడు. రేంజ్ రోవర్ వోగ్‌ని తను ఇష్టపడి కొనుగోలు చేశాడు. దీని ధర రూ.2.11 కోట్లుగా ఉంది. విరాట్ కోహ్లీ ఈ రేంజ్ రోవర్ కారులో చాలాసార్లు కనిపించాడు. కోహ్లీ తొలిసారి కొనుగోలు చేసిన కారు టాటా సఫారీ కావడం విశేషం.


Click it and Unblock the Notifications








