మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్

ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు వివేక్ ఒబెరాయ్‌పై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఛలాన్ విధించారు ముంబై ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్, మాస్క్ ధరించకుండా మోటార్‌సైకిల్ రైడ్ చేసినందుకు గానూ ఈ ఫైన్ విధించినట్లు సమాచారం.

మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్

ఫిబ్రవరి 14వ తేదీన వివేక్ ఒబెరాయ్ మరియు అతని భార్య ఓ ఖరీదైన హార్లే డేవిడ్సన్ క్‌పై సరదాగా నైట్ రైడ్‌కి వెళ్లారు. ఆ సమయంలో వీరిద్దరూ హెల్మెట్ కానీ, మాస్క్ కానీ రెండూ ధరించలేదు. దీన్ని సీసీటీవీ కెమెరాల్లో గుర్తించిన ముంబై పోలీసులు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా బైక్‌ను గుర్తించి జరిమానా విధించారు.

మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్

ముంబైలో రైడర్‌తో పాటు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. అయితే, వీరిద్దరూ తమ జాలీ రైడ్‌ని వీడియో ద్వారా షూట్ చేయటం కోసం హెల్మెట్ ధరించకుండా మోటార్‌సైకిల్ నడిపారు. దీంతో సీసీటీవీ కెమెరాకి దొరికిపోయారు.

MOST READ:పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !

మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్

అయితే, వివేక్ ఒబెరాయ్ మాత్రం ఈ ఛలాన్‌కు నవ్వుతూ స్పందించారు. ముంబై పోలీసులు తమ డ్యూటీ చేశారనట్లుగా చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. ఆన్‌లైన్ ద్వారా చెల్లించిన ఈ-ఛలాన్ పేమెంట్ కాపీని ఆయన తన అభిమానులతో ఓ వీడియో రూపంలో పంచుకున్నారు.

మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్

ఇప్పుడు ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. ఒబెరాయ్ ఆ వీడియోలో "యే హమ్ హై, యే హుమారి బైక్స్ హై ఔర్ యే హుమారి పావ్రి కాట్ గయి హై (ఇది నేను, ఇవి నా బైకులు, మరియు నాకు చలాన్ జారీ చేయబడింది). " అంటూ నవ్వుతూ చెప్పడం చూడొచ్చు.

MOST READ:హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు

ఈ వీడియోలో వివేక్ ఒబెరాయ్ ముంబై పోలీసులను కూడా ట్యాగ్ చేశాడు. హ్యాష్‌ట్యాగ్‌ల సహాయంతో అతను సేఫ్టీ ఫస్ట్ నినాదాన్ని ప్రోత్సహించాడు మరియు తన అభిమానులను కూడా తప్పనిసరిగా హెల్మెట్ మరియు మాస్క్‌లను ధరించాలని కోరాడు.

మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్

వివేక్ ఒబెరాయ్ షేర్ చేసిన ఛలాన్ వీడియోలో తన రెండు మోటార్‌సైకిళ్లను చూపించాడు. ఇందులో ఒక బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్ మరియు మరొక బిఎమ్‌డబ్ల్యూ కె1600జిటిఎల్ మోడళ్లను చూడొచ్చు. వివేక్ ఒబెరాయ్ బైక్ కలెక్షన్‌ను చూస్తుంటే, అతని మోటార్‌సైకిల్స్ అంటే ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది.

MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

జుహు పోలీస్ స్టేషన్ నుండి ఒక పోలీసు అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం, మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ప్రజారోగ్య భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు నటుడు వివేక్ ఒబెరాయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని, కోవిడ్-19 వ్యాప్తి కోసం ముందస్తు జాగ్రత్త చర్యగా పౌరులందరూ ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి అని అన్నారు.

మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్

ఈ విషయంలో నిబంధనలు అతిక్రమించిన నటుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే, మహారాష్ట్రాలో కరోనా కలకలం తిరిగి మొదలైంది. దేశ ఆర్థిక రాజధానిలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు అధికం అవుతున్నాయి.

MOST READ:సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

Most Read Articles

English summary
Vivek Oberoi Fined For Helmetless Riding, Shares A New Video About His e-Challan. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X