కారులో గేర్‌బాక్స్‌ చెడిపోతే రూ. 5.8 లక్షల బిల్లు.. ఖంగు తిన్న యజమాని.. కారణాలివేనా.??

కారు వాడుతున్నప్పుడు ఇంజిన్‌కు సంబంధించి చిన్న చిన్న సమస్యలు రావడం సాధారణం. తరచూ మెయింటెనెన్స్‌ లేకపోవడం.. లేదా అప్పుడప్పుడూ అనుకోకుండా ఇంజిన్‌ లేదా ఇతర పార్టుల్లో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే వాటికి కేవలం రూ. వేలల్లో మాత్రమే ఖర్చు అవుతుంటుంది. కానీ ఓ యజమాని మాత్రం రూ. లక్షల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ తన కార్ మోడళ్లలో అందించే సూపర్ గేర్‌బాక్స్ ఎంపికలలో DSG ఒకటి అని నిస్సందేహంగా చెప్పువచ్చు. ఎందుకంటే ఇది కంపెనీ చాలా కాలంగా అందిస్తున్న ఉత్తమ గేర్‌బాక్స్ ఎంపికగా నిలిచింది. అందుకే భారత మార్కెట్లోనూ వోక్స్‌వ్యాగన్ నుండి ఈ గేర్‌బాక్స్ ఆప్షన్ కస్టమర్లలో మంచి ఆదరణ పొందింది.

Volkswagen-Ameo

అయితే ఈ DSG గేర్‌బాక్స్‌ పట్ల ఇప్పుడు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు తాజాగా జరిగిన సంఘటనే ఉదాహరణ. వోక్స్‌వ్యాగన్‌ అమియో(Volkswagen Ameo) కారును వినియోగిస్తున్న ఓ వ్యక్తి తన కారులో DSG గేర్‌బాక్స్‌తో భారీ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు Team Bhp లో తన ఆవేదనను పంచుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తన వోక్స్‌వ్యాగన్‌ అమియో కారులో DSG గేర్‌బాక్స్‌(Gear Box)తో సదరు వ్యక్తి ఆర్థికంగా చాలా నష్టపోయాడట. ఆ గేర్‌బాక్స్‌లోని సమస్య పరిష్కారానికి తనకు దాదాపు రూ. 5.8 లక్షల బిల్లు వేశారట మెకానిక్‌ నిపుణులు.. అతను ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో.. ఇలాంటి సమస్యను ఎదుర్కొన్న ఇతర వాహన యజమానులు కూడా తమ ఆవేదనను పంచుకున్నారు.

Volkswagen-Ameo

ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. గేర్‌బాక్స్‌లో సమస్య వస్తే ఇంత భారీ రుసుము చెల్లించాలా అని షాక్‌ అవుతున్నారు. అసలు అమియో యజమాని మొదటగా ఈ సమస్యను ఎక్కడ గుర్తించారంటే.. గేర్‌బాక్స్‌లో ముందుగా శబ్దాన్ని గమనించినట్లు యజమాని పేర్కొన్నారు. ప్రత్యేకంగా 2వ మరియు 3వ గేర్‌ మధ్య అప్‌షిఫ్ట్ చేసేటప్పుడు, డౌన్‌షిఫ్ట్ చేసేటప్పుడు ఎక్కువ శబ్దం వస్తున్నట్లు గ్రహ్రించినట్లు తెలిపారు.

ఈ సందర్భంలో యజమాని వోక్స్‌వ్యాగన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి తన సమస్యను తెలియజేశాడు. వారి సలహా ప్రకారం కారును సర్వీస్ చేయించారు. అయితే రెండు రోజుల పాటు కారును అక్కడే ఉంచి మెకానిక్‌ నిపుణులు తనిఖీ చేశారు. అమీయో డీఎస్‌జీ గేర్‌బాక్స్‌లో పెద్ద సమస్య ఉన్నట్లు వారు గుర్తించారు. దీన్ని సరిచేయడానికి రూ. 5.8 లక్షల వరకు ఖర్చవుతుందని చావు కబురు చల్లగా చెప్పారు.

Volkswagen-Ameo

అయితే గేర్‌బాక్స్‌లో ఎక్కడ సమస్య ఉంది అనేది సర్వీస్‌ సెంటర్‌ వారు స్పష్టంగా తెలుపలేదు. వోక్స్‌వ్యాగన్ అమియోలో DSG DQ200 గేర్‌బాక్స్ ఉపయోగించారు. ఇది డ్రై క్లచ్ గేర్‌బాక్స్. అలాగే, ఈ కారు ఆరేళ్ల నాటి మోడల్‌గా యజమాని చెబుతున్నారు. కాగా ఈ దశలో కారు ఇంజిన్ పనిచేయడం ఆగిపోవడంతో.. కారులో గేర్ బాక్స్‌లో సింథటిక్ ఆయిల్ వాడటమే ఇందుకు ప్రధాన కారణంగా సర్వీసింగ్‌ నిపుణులు చెబుతున్నారు.

కాగా సింథటిక్ నూనెలో సల్ఫర్ ఉపయోగిస్తారు. ఈ ఆయిల్‌ చాలా వేడిగా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లను ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారా ఇంజిన్ వైఫల్యం చెందే అవకాశాలున్నాయి. గేర్‌బాక్స్ యొక్క క్లచ్ బాక్స్‌ను కత్తిరిస్తుండగా చిన్న షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీని ద్వారా గేర్ షిఫ్టింగ్‌లో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్య కారణంగా చాలా మంది వోక్స్‌వ్యాగన్ కారు వినియోగదారులు ఖనిజ ఆధారిత నూనెను ఉపయోగిస్తున్నారు.

ఈ అమియో కారు యజమాని కూడా ఇలా చేసి ఉంటే అతని గేర్‌బాక్స్‌కు ఇంత ఇబ్బంది వచ్చేది కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా చాలా మంది కారు ఇంజిన్‌ సురక్షితంగా ఉండటానికి ప్రీమియం ఆయిల్‌ని ఉపయోగిస్తుంటారు. కానీ కొన్ని వాహనాల్లో మాత్రం ఇది సమస్యగా మారుతుంది. వాహనదారులు ఆయిల్‌ను మార్చే ముందు మెకానిక్ లేదా కారు తయారీదారుల సలహాను పాటించడం ఉత్తమం.

Article Published On: Monday, November 20, 2023, 16:56 [IST]
English summary
Volkswagen ameo owner got rs 5 8 lakh bill for replacing dsg gearbox full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+