Viral Video పబ్లిక్ రోడ్డుపై కార్ల రేసింగ్.. వంతెనను ఢీకొట్టి పూర్తిగా కాలిపోయిన వాహనం
పబ్లిక్ రోడ్లపై రేసింగ్ ఎప్పుడూ చాలా ప్రమాదకరం. ఈ మధ్య పబ్లిక్ రోడ్లపై రేసింగ్ ట్రెండ్ రోజురోజుకి పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత ఇందులో ఎక్కువగా భాగస్వామ్యం అవుతున్నారు. మరియు ప్రమాదాల బారిన పడుతున్నారు. రేసింగ్‌లో పాల్గొంటే ప్రధానంగా పోలీసులు అరెస్ట్ చేయడం లేదా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది.
తాజాగా పబ్లిక్ రోడ్లపై నిర్వహించిన రేసింగ్‌లో (Cars race) పాల్గొన్న ఓ వాహనం అదుపుతప్పింది. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో జరిగింది. పోలో GT. మిని కూపర్ వాహనాలు నడిరోడ్లపై పోటీపడ్డాయి. నియంత్రణ కోల్పోయిన పోలో జీటీ వాహనం అదుపుతప్పింది. వెంటనే మంటలు చెలరేగి, అగ్నికి ఆహుతైంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆసియానెట్ తన యూట్యూబ్‌లో షేర్ చేసింది. కొచ్చిలోని ఉన్నతస్థాయి వ్యక్తులు నివాసం ప్రాంతమైన పనంపిల్లినగర్‌లో చోటుచేసుకుంది. రహదారిపై ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో రేసింగ్ వీడియో రికార్డయింది. నలుపు రంగు మినీ కూపర్ వాహనం, మ్యాటీ గ్రే వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ కార్లు రేస్‌లో పాల్గొన్నాయి.
నివాస ప్రాంతంలోని రద్దీగా ఉన్న రోడ్లపై ఈ రేసింగ్ జరిగినట్లు వీడియోలో మనం గమనించవచ్చు. రోడ్డు చివరలో కారు మలుపు తిరిగే సమయంలో మిని కూపర్ వాహన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. కానీ వాక్స్‌వ్యాగన్ పోలో డ్రైవర్ మాత్రం విఫలం అయ్యాడు.

ఫలితంగా వాక్స్‌వ్యాగన్ పోలో వాహనం వంతెన రెయిలింగ్‌కు సమీపంగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో వెంటనే మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన డ్రైవర్, మరో ప్రయాణికులు తప్పించుకున్నారు. అది కొద్ది క్షణాల్లోనే పోలో వాహనం అంతా మంటలు వ్యాపించాయి. ఫలితంగా పూర్తిగా కాలిపోయింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకొనే సరికే కారు పూర్తిగా కాలిపోయింది. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. మిని కూపర్, వాక్స్‌వ్యాగన్ పోలో కారు డ్రైవర్లుకు ముందు ఎటువంటి పరిచయం లేదని, అప్పటికప్పుడే రేసింగ్‌కు పాల్పడ్డారని వెల్లడైంది. ఓ కారు డ్రైవర్ ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించగా.. మరో డ్రైవర్ అందుకు అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా రద్దీగా ఉన్న రోడ్లపై రేసింగ్‌కు పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు.

పోలీసులు ఈ ఘటనకు పాల్పడ్డ వాక్స్‌వ్యాగన్ పోలో మరియు మిని కూపర్ డ్రైవర్ల వివరాలను సేకరించారు. ఎర్నాకులం సౌత్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్ 279 (ర్యాష్ డ్రైవింగ్) మరియు MVD చట్టం 189 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఇటువంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. పబ్లిక్ రోడ్లపై రేసింగ్ కారణంగా భారీ ప్రమాదాలకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. రేసింగ్‌లో పాల్గొన్నవారు సహా ప్రజలు సైతం గాయపడే అవకాశం ఉంది. నిజంగా రేసింగ్ చేయాలనుకుంటే రేస్ ట్రాక్‌లు లేదా మూసి ఉన్న రోడ్లపై ప్రయత్నం చేయాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








