రూ.11 లక్షలు ఖరీదు చేసే కారుకి రూ.22 లక్షల రిపేర్ బిల్ ఇచ్చి షాకిచ్చారు..

కొన్ని కొన్నిసార్లు వెహికల్ సర్వీస్ సెంటర్లు వాహన మరమ్మత్తు కోసం ఇచ్చే కొటేషన్‌ను చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సంఘటన గురించే. బెంగుళూరులోని ఓ సర్వీస్ సెంటర్ రూ.11 లక్షల విలువైన కారుకి రూ.22 లక్షల రిపేర్ అంచనా వేసింది. దీంతో సదరు కారు ఓనర్ తన కారుని పాత సామాన్ల వాడికైనా అమ్ముకుంటాను కానీ, అంత ఖర్చు చేసి రిపేరు చేయించలేనని చేతులు ఎత్తేశాడు.

రూ.11 లక్షలు ఖరీదు చేసే కారుకి రూ.22 లక్షల రిపేర్ బిల్ ఇచ్చి షాకిచ్చారు..

వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులో ఇటీవల భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైన సంగతి మనందరికీ తెలిసినదే. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వరదలు రావడంతో, ఈ వరదల్లో అనేక కార్లు కూడా మునిగిపోవడాన్ని మనం చూశాం. ఇలా వరదలో మునిగిపోయిన తన ఫోక్స్‌వ్యాగన్ పోలో కారుని సర్వీస్ చేయించడం కోసం అనిరుద్ గణేష్ అనే వ్యక్తి తన పోలో కారుని ఫోక్స్‌వ్యాగన్ సర్వీస్ సెంటరుకు తీసుకువెళ్లాడు.

రూ.11 లక్షలు ఖరీదు చేసే కారుకి రూ.22 లక్షల రిపేర్ బిల్ ఇచ్చి షాకిచ్చారు..

వరద నీటిలో దెబ్బతిన్న పోలో కారును పూర్తిగా చెక్ చేసిన సదరు ఫోక్స్‌వ్యాగన్ సర్వీస్ సెంటర్ కస్టమర్‌రు రూ.22 లక్షల రిపేర్ ఎస్టిమేషన్‌ను పంపించింది. రూ.11 లక్షలు కూడా ఖరీదు చేయని తన కారుని రిపేరు చేయడం కోసం ఏకంగా దాని ధరలో రెండింతలు ఎక్కువగా అడగడంతో అనిరుద్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సదరు ఫోక్స్‌వ్యాగన్ సర్వీస్ సెంటర్ పంపిన మేసేజ్ మరియు ఎస్టిమేషన్ బిల్‌ను కూడా తన పోస్టులో చేర్చాడు. దీంతో ఇది క్షణాల్లో వైరల్ గా మారింది.

రూ.11 లక్షలు ఖరీదు చేసే కారుకి రూ.22 లక్షల రిపేర్ బిల్ ఇచ్చి షాకిచ్చారు..

అనిరుధ్ గణేష్ చాలా కాలంగా ఫోక్స్‌వ్యాగన్ పోలో కారును నడుపుతున్నాడు. ఊహించని వరద కారణంగా అతని కారు పాడయ్యింది. దీంతో అతను తన కారును రిపేరుకు సంబంధించి అంచనా వేయించేందుకు పోలో హ్యాచ్‌బ్యాక్‌ను వైట్‌ఫీల్డ్ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. సదరు సర్వీస్ సెంటర్ ఇచ్చిన రిపేర్ ఎస్టిమేషన్ చూసి అవాక్కయ్యాడు. తన కారుని సర్వీస్ సెంటరుకు తరలించడానికి కూడా ఎవ్వరూ సాయం చేయలేదని, రాత్రి సమయంలో తన కారుని తానే నెట్టుకుంటూ వెళ్లాల్సి వచ్చిందని వాపోయాడు.

రూ.11 లక్షలు ఖరీదు చేసే కారుకి రూ.22 లక్షల రిపేర్ బిల్ ఇచ్చి షాకిచ్చారు..

అనిరుధ్ తని కారుని రిపేరు కోసం ఫోక్స్‌వ్యాగన్ ఆపిల్ ఆటో సర్వీస్ సెంటరుకు పంపించిన 20 రోజుల తర్వాత సదరు సర్వీస్ సెంటర్ అతనికి రిపేర్ ఎస్టిమేషన్ పంపించింది. అంటే, ఆ కారు రిపేరుకు అయ్యే ఖర్చుని అంచనా వేయడానికి సదరు సర్వీస్ సెంటరుకు ఏకంగా 20 రోజుల సమయం పట్టిందన్నమాట. పోనీ, రిపేరుకి అయ్యే ఖర్చు ఏమైనా తక్కువా అంటే, ఏకంగా రూ.22 లక్షలు అవుతుందని అంచనా వేశారు.

రూ.11 లక్షలు ఖరీదు చేసే కారుకి రూ.22 లక్షల రిపేర్ బిల్ ఇచ్చి షాకిచ్చారు..

మంచి విషయం ఏంటంటే, అనిరుధ్ తన కారుకి థర్డ్ పార్టీ భీమాతో పాటుగా సెల్ఫ్ డ్యామేజ్ బీమాని కూడా కలిగి ఉన్నాడు. ఈ సమగ్ర బీమా ప్యాకేజ్ కారణంగా, బీమా కంపెనీ అనిరుధ్ ఫోక్స్‌వ్యాగన్ పోలో కారుని మొత్తం నష్టం (టోటల్ లాస్) గా పరిగణించి, సదరు బీమా కవరేజ్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అనిరుధ్ ఏకో బీమా సంస్థ నుండి కాంపర్హెన్సివ్ బీమాను కొనుగోలు చేశారు. అయితే, చెడు విషయం ఏంటంటే, అనిరుధ్ భీమా కంపెనీతో మాట్లాడిన తర్వాత తన కారు డాక్యుమెంట్ల కోసం సర్వీస్ సెంటర్‌కు వెళ్లగా వారు అతని వద్ద నుండి రూ.44,840 బిల్లును వసూలు చేశారు.

రూ.11 లక్షలు ఖరీదు చేసే కారుకి రూ.22 లక్షల రిపేర్ బిల్ ఇచ్చి షాకిచ్చారు..

కారు షోరూమ్‌లో ఎక్కువ కాలం ఉండడంతో ఈ మొత్తాన్ని చెల్లించాలని సదరు సర్వీస్ సెంటర్ కస్టమర్‌ను డిమాండ్ చేసింది. అయితే, అసలు మరమ్మత్తే చేయని తన కారు కోసం అంత డబ్బు ఎందుకు చెల్లించాలని అనిరుధ్ ఫోక్స్‌వ్యాగన్ కస్టమర్ కేర్‌ను సంప్రదించారు. అయితే, వారు 48 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీని తర్వాత కొన్ని రోజులకు ఫోక్స్‌వ్యాగన్ కస్టమర్ కేర్ నుండి అనిరుధ్‌కి ఓ కాల్ వచ్చింది. అంచనాకు మించి వసూలు చేయబోమని, మొత్తం నష్టపోయిన కస్టమర్లకు సుమారు రూ. 5,000 గరిష్ట పరిమితి ఉంటుందని సదరు కాల్‌లో అతనికి వివరించారు.

రూ.11 లక్షలు ఖరీదు చేసే కారుకి రూ.22 లక్షల రిపేర్ బిల్ ఇచ్చి షాకిచ్చారు..

కార్ సర్వీస్ సెంటర్లు బీమా కంపెనీకి రిపేరు అంచనా మొత్తానికి సంబంధించిన ఓ పత్రాన్ని అందించాల్సి ఉంటుంది. ఇది బీమా క్లెయిమ్ యొక్క తదుపరి ప్రాసెసింగ్ కోసం అవసరమైన చట్టపరమైన పత్రం. టోటల్ లాస్ అయిన సందర్భాల్లో సర్వీస్ సెంటర్లు కస్టమర్ల నుండి ఎలాంటి మొత్తాన్ని వసూలు చేయకుండానే ఈ అంచనా పత్రాలను బీమా కంపెనీలకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయంలో కస్టమర్లను బ్లాక్ మెయిల్ చేసే కంపెనీ సర్వీస్ సెంటర్లు కూడా చాలానే ఉన్నాయి. అనిరుధ్ విషయంలో కూడా అదే జరిగింది. అయితే, అనిరుధ్ తనదైన శైలిలో ఫైట్ చేయడంతో దెబ్బకు అందరూ దిగొచ్చారు.

రూ.11 లక్షలు ఖరీదు చేసే కారుకి రూ.22 లక్షల రిపేర్ బిల్ ఇచ్చి షాకిచ్చారు..

పోలో హ్యాచ్‌బ్యాక్ విషయానికి వస్తే, జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ నుండి భారత మార్కెట్లో విడుదలైన అత్యంత సరసమైన మోడళ్లలో ఒకటి. అంతేకాదు, భారతదేశంలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌‌లను స్టాండర్డ్‌ పీచర్‌గా అందించిన అతికొద్ది మోడళ్లలో ఫోక్స్‌వ్యాగన్ పోలో కూడా ఒకటి. ఈ కారు కోసం 2014 లో నిర్వహించిన గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఇది 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూ పొందింది. అయితే, కంపెనీ ఇటీవలే ఈ కారును డిస్‌కంటిన్యూ చేసింది. ఫోక్స్‌వ్యాగన్ పోలో ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
Volkswagen service center estimates rs 22 lakhs for flood damaged polo repair
Story first published: Monday, September 26, 2022, 18:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X