80 కి.మీ వేగంతో చెట్టును ఢీకొట్టిన వోక్స్‌వ్యాగన్ టైగన్ కారు.. ఈ ఫీచర్లే కాపాడాయి..!
భారత్‌లో గతంతో పోల్చితే మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. రాష్ట్ర, జాతీయ రహదారులు సౌకర్యవంతంగా మారాయి. అయితే అదే కారణంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అతివేగం, నిర్లక్ష్యం సహా అనేక కారణాలతో రోజురోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతోంది.
తాజాగా వోక్స్‌వ్యాగన్ టైగన్ కారు భారీ ప్రమాదానికి గురైంది. సుమారు 70 నుంచి 80 కి.మీ వేగంతో చెట్టును ఢీకొట్టింది. అయితే ప్రమాదానికి సంబంధించిన సరైన కారణాలు తెలియలేదు. అయితే అధిక వేగం కారణంగా కారు నియంత్రణ కోల్పోయి, ప్రమాదానికి గురికావచ్చు. ఈ ప్రమాదం అనంతరం కారుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

భారీ ప్రమాదం కారణంగా వోక్స్‌వ్యాగన్ టైగున్ కారు ముందు భాగం భారీగా డ్యామేజీ అయింది. కారు ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నాయి. ఫలితంగా లోపలున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కారు ఇంజిన్, బానెట్ సహా ఇతర విభాగాలు భారీగా దెబ్బతిన్నట్లు వీడియోలో గమనించవచ్చు.
అయితే కారులోపల భాగం ఎటువంటి డ్యామేజీ కాలేదు. ఇది కారు బిల్డ్ క్వాలిటీకి నిదర్శనం. ఇంత భారీగా ప్రమాదం జరిగినా... క్యాబిన్ చెక్కుచెదరలేదు. సరైన సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ కావడం వల్ల లోపలున్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. అయితే కారు ప్రమాదానికి కారణం ఏంటి, ఎక్కడ జరిగింది. కారులోపల ఎంత మంది ప్రయాణికులు ఉన్నారన్న సమాచారం వెల్లడి కాలేదు.

వోక్స్‌వ్యాగన్ టైగన్ కారు భద్రతలో 5 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది. గ్లోబర్ NCAP తాజా ప్రోటోకాల్స్ ఆధారంగా టైగన్ కారును పరీక్షించారు. ప్రస్తుతం భారత్‌లో అత్యంత భద్రత కలిగిన కార్లలో వోక్స్‌వ్యాగన్ టైగన్ కారు ఒకటిగా ఉంది. కారు బిల్డ్ క్వాలిటీ కారణంగా తాజా ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
గ్లోబల్ NCAP ప్రకారం వోక్స్‌వ్యాగన్ టైగన్ కారు 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ కొత్త ప్రోటోకాల్స్ ఆధారంగా ఈ రేటింగ్‌ను సాధించింది. దీని ప్రకారం.. వాహనాలు 5- స్టార్ రేటింగ్‌ను సాధించేందుకు.. ఫ్రంట్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్‌ను పరీక్షిస్తారు. దాంతోపాటుగా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సైడ్ ఇంపాక్ట్, పోల్ ఇంపాక్ట్‌ను పరీక్షించాల్సి ఉంటుంది.

ఇటీవలే భారత్ సొంతంగా BNCAP రేటింగ్ వ్యవస్థను ప్రారంభించింది. ఆగస్టు 22న కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ వ్యవస్థను ప్రారంభించారు. దీంతో దేశీయంగా తయారైన కార్లను.. క్రాష్ టెస్ట్ సహా ఇతర పరీక్షల కోసం విదేశాలకు పంపాల్సిన అవసరం లేదు. దీంతో కార్ల తయారీ సంస్థలకు సమయం, డబ్బు ఆదా అవుతుంది. ఈ వ్యవస్థలు అన్ని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు స్వాగతించాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








