Accident ఆగి ఉన్న టాటా టియాగోను ఢీకొట్టిన ఫోక్స్‌వ్యాగన్ టైగన్.. తర్వాత ఏం జరిగిందో తెలుసా..?
ఆగి ఉన్న టాటా టియాగోను ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో టైగన్ బోల్తా పడింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొంతకాలం కాలం క్రితం జరిగిన ఈ ప్రమాదం తాజాగా వార్తల్లో నిలిచింది. ప్రమాదానికి గల కారణం, రెండు వాహనాలు దెబ్బతిన్న తీరు ఈ కథనంలో తెలియజేయబోతున్నాం..
యాక్సిడెంట్ జరిగిన వీడియో ప్రకారం వోక్స్‌వ్యాగన్ టైగన్ రోడ్డు పక్కన ఆగి ఉన్న టాటా టియాగోను బలంగా ఢీకొట్టింది. దీంతో టైగన్ కారు బోల్తా పడింది. ప్రమాద సమంయలో టాటా టియాగో ఎలా ఉందో అలానే ఉండిపోగా టైగన్ పల్టీ కొట్టి తిరిగి బోర్లా పడిన విజువల్స్ ని వీడియోలో గమనించవచ్చు.

అత్యంత వేగంతో దూసుకువచ్చిన వోక్స్‌వ్యాగన్ టైగన్ టాటా టియాగో కారును ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టాటా టియాగో వెనుక కుడివైపు టైగన్‌కు ముందు ఎడమ వైపున ఢీకొని మిడ్-సైజ్ SUV బోల్తా పడింది. ఈ ఘటనలో ఎలాంటి ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటకు పడ్డారు.
అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా టాప్-హెవీ సెటప్ కలిగి ఉన్న ప్రామాణిక హ్యాచ్‌బ్యాక్‌లు లేదా సెడాన్‌లతో పోలిస్తే SUVలు బోల్తా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక వేగంతో SUVలను నడుపుతున్నప్పుడు, మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వాహనాల వల్ల రోడ్డు ఉపరితలం నుంచి గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉన్న SUVలలో ప్రమాదం పొంచి ఉంటుంది.
ఈ రెండు కార్లు అత్యధిక రేటింగ్ పొందిన కార్ల సెగ్మెంట్లలో సురక్షితమైన కార్లుగా ఉన్నాయి. గ్లోబల్ NCAP టెస్టింగ్‌లో వోక్స్‌వ్యాగన్ టైగన్ ఖచ్చితమైన ఫైవ్-స్టార్ రేటింగ్‌ను పొందగా, టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ ఫోర్-స్టార్ రేటింగ్‌ను సాధించింది. గ్లోబల్ NCAP భద్రతా రేటింగ్‌ల ప్రకారం, టియాగో దాని సెగ్మెంట్‌లో అత్యంత సురక్షితమైన కారు, దాని ఫుట్‌వెల్, నిర్మాణానికి అస్థిరమైన రేటింగ్‌లు ఉన్నప్పటికీ ఫోర్ స్టార్ ను అందుకుంది.
సేఫ్టీ రేటింగ్స్ పరంగా చూసుకుంటే భారతదేశంలో టాటా మోటార్స్ అత్యుత్తమ లైనప్‌లలో ఒకటిగా ఉంది. ఈ సంస్థకు చెందిన టాటా టియాగో, టిగోర్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌లను కలిగి ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్, టాటా నెక్సాన్ పూర్తి ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి. ఇక హారియర్, సఫారీ వంటి ఇతర టాటా వాహనాలను భద్రతా రేటింగ్ ఏజెన్సీలు ఇంకా పూర్తి స్థాయిలో పరీక్షించాల్సి ఉంది.
గ్లోబల్ NCAP కొత్త మార్గదర్శకాల ప్రకారం టైగన్, కుషాక్ లు అత్యంత సురక్షితమైన కార్లుగా టాప్ రేటింగ్ ను పొందాయి. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ ప్రోటోకాల్‌ల ప్రకారం ఫ్రంట్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్‌ను టెస్ట్ చేస్తాయి. అదనంగా, వాహనాలు పూర్తి ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించడానికి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), పాదచారుల రక్షణ మరియు సైడ్ ఇంపాక్ట్ పోల్ రక్షణను తప్పనిసరిగా నిర్వహిస్తుంది.
రెండు కార్లు పెద్దల భద్రత రక్షణ స్కోర్ 34కి 29.64, పిల్లల భద్రత స్కోరు 49కి 42ను సాధించాయి. స్టాండర్డ్ ఫీచర్‌లుగా ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ESC ఉండటం రెండు కార్లు అత్యధిక రేటింగ్‌లను సాధించడంలో సహాయపడింది. రెండు వాహనాలు డ్రైవర్, ప్రయాణీకుల హెడ్, నెక్ రక్షణకు అందించాయని గ్లోబల్ NCAP నివేదించింది. డ్రైవర్, ప్రయాణీకుల ఛాతీ రక్షణ అధికంగా ఉంది.


Click it and Unblock the Notifications








