ఆర్ట్ పీస్‌గా మారిన వోల్వో ఎక్స్‌సి60 కారు
పెయింటిగ్ కళాకారుడికి కాన్వాస్ ఇస్తే అందమైన అద్భుతాలను పరిచయం చేస్తాడు. అదే కారును ఇస్తే ఏం చేస్తాడు. ఏం చేస్తాడు ఎంచక్కా డ్రైవ్ చేస్తూ షికారు చేస్తాడు అంటారా? సాధారణంగా అందరూ అదే చేస్తారు. కానీ ఈ కళాకారులు మాత్రం కారును కాన్వాస్‌గా మార్చేసి అద్భుతమైన పెయింటిగ్‌లను మనకు పరిచయం చేస్తారు.
గడచిన మూడు సంవత్సరాలు వోల్వో కార్ స్విట్జర్లాడ్ 'వోల్వో ఆర్ట్ సెషన్' అనే ఆర్ట్ గ్యాలరీని నిర్వహిస్తుంది. ఇది యూరప్‌లోని రద్దీ ప్రాంతాలలో ఒకటైన స్విట్జర్లాండ్‌లోని జురిచ్‌లో ఉన్న సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఉంది. వోల్వో కారును తమ ఆర్ట్ వర్క్‌లో సెంటర్‌పీస్‌గా ఉంచి అద్భుతమైన పెయింటింగ్‌లను/ఆర్ట్ వర్క్‌ను తయారు చేయమని వోల్వో ఆర్టిస్టులను ఆహ్వానిస్తుంది. ఇలా వచ్చిన ఆర్టిస్టులు తమలోని సృజనాత్మకతకు పదునుపెట్టి ఇదిగో ఈ ఫొటోలలో కనిపిస్తున్నట్లు అద్భుతాలను సృష్టిస్తారు.
ఈ కార్యక్రమం ప్రారంభించిన మొదటి సంవత్సరంలో ఇందులో స్థానిక ఆర్టిస్టులు పాల్గొనగా, రెండవ సంవత్సరంలో చైనా నుంచి ఆర్టిస్టలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుండటంతో వోల్వో ఈసారిఏకంగా అంతర్జాతీయ బృందాలను ఆహ్వానించింది. ఈ ఏడాది థీమ్ 'డిజైన్డ్ అరౌండ్ యూ'. ఇందులో వోల్వో ఎక్స్‌సి60 కారును సెంటర్‌పీస్‌గా ఉపయోగించారు. మరి ఈ మాస్టర్‌పీస్ ఆర్ట్ అందాలను మనం కూడా తిలకిద్దాం రండి..!














Click it and Unblock the Notifications








