ఇంక ఆ పాత కారు నడిపింది చాలు, ఇందా ఈ కొత్త కారు తీసుకో.. పాత కస్టమర్‌కి కొత్త కారు గిఫ్ట్ ఇచ్చిన వోల్వో!

సాధారణంగా మీరు ఓ కారుని ఎంత కాలం పాటు ఉపయోగిస్తారు? 5 ఏళ్లు, 10 ఏళ్లు మహా అయితే 15 ఏళ్లు. కార్లను నిరంతరం ఉపయోగిస్తుంటే 10 ఏళ్ల తర్వాత వాటిలో సమస్యలు రావడం ప్రారంభం అవుతాయి.

Recommended Video

భారతీయ మార్కెట్లో విడుదలైన Volvo XC40 Recharge | ధర & వివరాలు

లక్షల కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆ కారులో వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉంటుంది మరియు వాటి మెయింటినెస్స్ కూడా ఖరీదైనదిగా ఉంటుంది.

ఇంక ఆ పాత కారు నడిపింది చాలు, ఇందా ఈ కొత్త కారు తీసుకో.. పాత కస్టమర్‌కి కొత్త కారు గిఫ్ట్ ఇచ్చిన వోల్వో!

సాధారణంగా ఏ కారు అయినా 5 లక్షల కిలోమీటర్ల వరకూ ఎలాంటి మేజర్ సమస్య లేకుండా బాగానే నడుస్తుంది. అయితే, ఈ కథనంలో మనం చెప్పుకోబోయే కారు మాత్రం ఏకంగా 16 లక్షల కిలోమీటర్లకు పైగా ఎలాంటి సమస్య లేకుండా ప్రయాణించింది. దీంతో తమ బ్రాండ్ కారు యొక్క పనితీరును మరియు సదరు కారు ఓనర్ యొక్క విశ్వసనీయతను పరిగణలోకి తీసుకున్న స్వీడన్ లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో, సదరు పాత వోల్వో కారు యజమానికి ఓ సరికొత్త మరియు ఖరీదైన వోల్వో కారుని బహుమతిగా ఇచ్చింది.

ఇంక ఆ పాత కారు నడిపింది చాలు, ఇందా ఈ కొత్త కారు తీసుకో.. పాత కస్టమర్‌కి కొత్త కారు గిఫ్ట్ ఇచ్చిన వోల్వో!

స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo) ప్రపంచంలో కెల్లా అత్యంత సురక్షితమైన వాహనాలను తయారు చేస్తుందని మనందరికీ తెలుసు. అయితే, దీర్ఘకాలంలో ఇలాంటి కార్ల మెయింటినెన్స్ చాలా ఖరీదైనా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ, అది పూర్తిగా అవాస్తవమని, వోల్వో కార్లను ఎన్ని లక్షల కిలోమీటర్లు నడిపినా అవి ఎలాంటి అలుపుసొలుపు లేకుండా ప్రయాణిస్తాయని తన 1991 వోల్వో 740 జిఎల్ఈ సెడాన్ తో నిరూపించాడు జిమ్ ఓషీయా.

ఇంక ఆ పాత కారు నడిపింది చాలు, ఇందా ఈ కొత్త కారు తీసుకో.. పాత కస్టమర్‌కి కొత్త కారు గిఫ్ట్ ఇచ్చిన వోల్వో!

ఇందుకు సంబంధించి ఫాక్స్ 2 సెయింట్ లూయిస్ తమ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. జిమ్ ఓషీయా 1991లో Volvo 740 GLE కారుని కొనుగోలు చేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకూ అతను అదే కారును ఉపయోగిస్తున్నాడు. దాదాపు మూడు దశాబ్ధాలు గడిచినప్పటికీ, ఈ కారు ఇంకా మంచి రన్నింగ్ కండిషన్ లోనే ఉంది. తాను ఈ కారును కొనుగోలు చేసినప్పటి నుండి ఎన్నో ప్రయాణాలు చేశానని, ఒక్కసారి కూడా ఇది తనను ఇబ్బంది పెట్టలేదని ఆయన చెప్పాడు.

ఇంక ఆ పాత కారు నడిపింది చాలు, ఇందా ఈ కొత్త కారు తీసుకో.. పాత కస్టమర్‌కి కొత్త కారు గిఫ్ట్ ఇచ్చిన వోల్వో!

తండ్రి ఫోర్డ్ కారు కొనాలనుకున్నాడని, ఆ కారు కొన్నప్పుడు తనతో గొడవ పడాల్సి వచ్చిందని జిమ్ తన అనుభవాన్ని ఈ వీడియోలో పంచుకున్నాడు. వోల్వో కారుపై తనకు చాలా నమ్మకం ఉందని, అది మిలియన్ మైళ్లకు పైగా ప్రయాణిస్తుందని తన తండ్రికి చెప్పానని చెప్పాడు. వోల్వో 740 జిఎల్‌ఇ సామాన్యుల కోసం తయారు చేసిన కారు అని, దానిని మెయింటెయిన్ చేయడం కూడా చాలా సులభం అని జిమ్ చెప్పారు. కారులో లైట్లను మార్చడం వంటి చిన్న మరమ్మతులు ఎవరైనా చేయవచ్చని అతను ధృవీకరించాడు.

ఇంక ఆ పాత కారు నడిపింది చాలు, ఇందా ఈ కొత్త కారు తీసుకో.. పాత కస్టమర్‌కి కొత్త కారు గిఫ్ట్ ఇచ్చిన వోల్వో!

ఒక కారును 10 లక్షల మైళ్ల దూరం కారు నడపడం గొప్ప విజయం. ఈ కారును 5,00,000 మైళ్లు నడిపిన తర్వాత, సదరు కారు ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ రీప్లేస్ చేయబడ్డాయి. ఈ కాలంలో జిమ్‌కి ఎప్పుడూ ప్రమాదం జరగలేదు. కానీ జిమ్ భార్య మాత్రం రెండు సార్లు ప్రమాదానికి గురైంది. దాదాపు 31 ఏళ్ల వయస్సు ఉన్న ఈ కారు ఇప్పుడు క్రమక్రమంగా పాడవడం ప్రారంభించింది. కారు యొక్క కొన్ని బాడీ ప్యానెల్‌ల ద్వారా ఇది స్పష్టంగా తెలుస్తోంది. ఒకే బ్రాండ్ కారును 30 సంవత్సరాలు మరియు 16 లక్షల కిమీ పైగా నడపటం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన వోల్వో, జిఎమ్‌కు ఓ కొత్త 2022 వోల్వో ఎస్60 లగ్జరీ సెడాన్‌ను ఉచితంగా ఇచ్చింది.

ఇంక ఆ పాత కారు నడిపింది చాలు, ఇందా ఈ కొత్త కారు తీసుకో.. పాత కస్టమర్‌కి కొత్త కారు గిఫ్ట్ ఇచ్చిన వోల్వో!

జిమ్ తన వోల్వో 740 జిఎల్ఆ అత్యంత శక్తివంతమైన సెడాన్ అని ఎప్పుడూ భావించ లేదు, అయితే అంత వయస్సు గల ఈ కారు ఇప్పటికీ గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో పరులుగు తీయగలదని ఆయన చెప్పాడు. జిమ్ 1991లో వోల్వోను కొనుగోలు చేస్తున్నప్పుడు, మరొక వోల్వోలో మిలియన్ మైళ్లు ప్రయాణించిన ఓ వ్యక్తిని చూసినట్లు గుర్తుచేసుకున్నాడు. అదే అతనికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించి, తాను కూడా దానిని సాధించగలనని ఆలోచించేలా చేసిందని వీడియోలో చెప్పాడు.

ఇంక ఆ పాత కారు నడిపింది చాలు, ఇందా ఈ కొత్త కారు తీసుకో.. పాత కస్టమర్‌కి కొత్త కారు గిఫ్ట్ ఇచ్చిన వోల్వో!

దాదాపు 30 సంవత్సరాలకు పైగా ఈ పాత వోల్వో సెడాన్‌ను నడిపుతున్న, జిమ్‌కు తాను కారును కొనుగోలు చేసిన అదే వోల్వో డీలర్‌షిప్‌కి తిరిగి వెళ్లినప్పుడు, డీలర్‌షిప్ యాజమాన్యం అతడిని ఆశ్చర్యాన్ని గురిచేస్తూ, ఓ కొత్త 2022 మోడల్ వోల్వో ఎస్60 లగ్జరీ సెడాన్‌ను కానుకగా ఇవ్వడం ద్వారా జిమ్‌ను గౌరవించాలని నిర్ణయించుకుంది. జిమ్‌కు అందించే వోల్వో ఎస్60 రాబోయే రెండేళ్లపాటు అతనికి ఉచితంగా లభిస్తుంది. అన్నీ కలిసిన వోల్వో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కింద అతనికి కారు అందించడం జరిగింది.

ఇంక ఆ పాత కారు నడిపింది చాలు, ఇందా ఈ కొత్త కారు తీసుకో.. పాత కస్టమర్‌కి కొత్త కారు గిఫ్ట్ ఇచ్చిన వోల్వో!

ఈ ప్లాన్‌లో టైర్లు, చక్రాలు, మెయింటెనెన్స్ మరియు ఇన్సూరెన్స్ అన్నీ కలిసి ఉంటాయి మరియు వీటిని పూర్తిగా రెండేళ్ల పాటు వోల్వోనే భరిస్తుంది. అయితే, ఆ తర్వాత ఉంటాయి. వోల్వో కార్ల విశ్వసనీయతతో జిమ్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు తాను కొత్తగా పొందిన వోల్వో ఎస్60లో 1 మిలియన్ (10 లక్షల మైళ్లు లేదా 16 లక్షలకు పైగా కిలోమీటర్ల) దూరాన్ని కవర్ చేయాలని అనుకుంటున్నట్లు జిమ్ ఈ వీడియోలో చెప్పడాన్ని వినవచ్చు. ఏదేమైనప్పటికీ, ఒకే కారును ఇన్ని సంవత్సరాలు ఉపయోగించడం అంటే అది నిజంగా గొప్ప విషయమే అనాలి. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Monday, August 29, 2022, 13:51 [IST]
English summary
Volvo dealership gifts brand new car to its oldest customer who completed 1 million miles in his 1991 vovlo 740 gle
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+