Volvo XC90 SUVని సరికొత్త ఆఫ్‌ రోడర్‌గా మార్చేశారు... లాంజ్‌ తరహా ఇంటీరియర్‌ సహా..!

భారత్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో అనేక ప్రీమియం లగ్జరీ SUVలు అందుబాటులో ఉన్నాయి. ఆ జాబితాలో ఉన్న వోల్వో XC90 (Volvo XC90) అనేక లగ్జరీ ఫీచర్లు, డిజైన్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎస్‌యూవీల్లో ప్రీమియం, అత్యంత సురక్షితమైన SUVలో ఒకటిగా నిలిచింది. అయితే DC2 స్టూడియో ఈ లగ్జరీ కారులో కీలక మార్పులు చేసి ఆఫ్‌-రోడర్‌గా మార్చేసింది.

ఈ తరహా డిజైన్‌ మార్పులకు పేరుగాంచిన DC2 (DC Design) సంస్థ ఈ కారుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియో ఆధారంగా వోల్వో XC90 SUV కీలక మార్పులకు గురైంది. టైర్లు సహా అనేక కీలక మార్పులు చేశారు. ఫలితంగా సరికొత్త ఆఫ్‌రోడర్‌గా మారింది.

Volvo XC90 SUV modified as off roader

DC2 డిజైన్‌ రూపొందించిన ఆఫ్‌ రోడర్‌ కష్టమైన భూభాగాల్లోనూ సురక్షితంగా ప్రయాణం చేసేలా మార్పులు చేశారు.. మరియు మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని పొందే విధంగా మార్పులు చేశారు. ఈ కారు ముందువైపు బీహైవ్ డిజైన్‌ చేయబడిన గ్రిల్‌ను కలిగి ఉంది. ఇది వాహనానికి సరికొత్త రూపాన్ని ఇచ్చింది. ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌లు, డే టైం రన్నింగ్‌ లైట్లను ఆకర్షణీయ రీతిలో అమర్చారు.

దాంతో పాటు వోల్వో XC90 SUVలో మరో ఆకర్షణీయమైన మార్పు చోటుచేసుకుంది. నాలుగు డోర్లుగా ఉన్న SUVని.. మెర్సిడెస్‌ బెంజ్‌ SLS AMG, టెస్లా కార్ల తరహాలో డోర్లు పైకి తెరుచుకునేలా గుల్వింగ్ డోర్లను అమర్చారు. ఇది SUVకి మరింత ఆకర్షణను తీసుకొచ్చింది.

Volvo XC90 SUV modification video

దీంతోపాటు ఆఫ్‌రోడర్‌గా మార్చేందుకు వీలుగా ఆల్‌ టెర్రైన్‌ టైర్‌లతో కూడిన 21 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను అందించింది. దీంతోపాటు వెనుకవైపు ఫ్లేర్డ్‌ వీల్‌ ఆర్చ్‌, ఎగ్జాస్ట్‌ టిప్స్‌తో బీహైవ్‌ డిజైన్‌ చేసిన వెనుక బంపర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు LED టెయిల్‌ ల్యాంప్‌లు, కనెక్టెట్‌ LED బార్‌లు ఉన్నాయి.

ఈ కారు సీట్లు కూడా ప్రైవేట్‌ జెట్‌లో ఉన్న మాదిరిగా అత్యంత లగ్జరీగా ఉన్నాయి. వెనుక సీట్లో ఉన్న ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ ‌అనుభూతిని అందించేందుకు హ్యాండ్‌ రెస్ట్‌ ప్యాడ్‌, కప్‌ హోల్డర్‌లు ఉన్నాయి. దీంతోపాటు డ్యాష్‌బోర్డులో ఒరిజినల్‌ TFT ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌ మరియు స్టీరింగ్‌ వీల్‌నే ఉంచారు. ఈ డ్యాష్‌బోర్డు చూసినప్పుడు మాత్రమే వోల్వో XC90 గుర్తుకువస్తుంది. లాంజ్‌ తరహా వాతావరణం కోసం యాంబియంట్‌ లైటింగ్‌ను ఏర్పాటుచేశారు.

Volvo XC90 SUV

అయితే డిజైన్‌ సహా DC2 డిజైన్‌ టీం చేసిన మార్పులు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంటీరియర్‌ లగ్జరీ లాంజ్‌ను తలపిస్తోంది. అయితే ఈ వాహనం పబ్లిక్‌ రోడ్లపై ప్రయాణానికి సురక్షితమా లేదా అనేది తెలియలేదు. మరియు లగ్జరీ SUVని సరికొత్త ఆఫ్‌రోడర్‌గా మార్చేందుకు ఎంత వ్యయం అయిందనే వివలాలు వెల్లడించలేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 21, 2023, 9:18 [IST]
English summary
Volvo xc90 suv turned into an off roader video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+