అప్పుడు ఖరీదైన బెంట్లీ.. ఇప్పుడు బెంజ్: ధర ఎంతైనా తగ్గేదేలే

భారతదేశంలో గత కొన్ని రోజులుగా కేవలం సరసమైన కార్లకు మాత్రమే కాకుండా.. ఖరీదైన లగ్జరీ కార్లకు కూడా డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ జాబితాలో రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి వాటితో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటివి ఉన్నాయి. బెంజ్ కార్లలో కూడా తయన్త ఖరీదైన మెర్సిడెస్ మేబ్యాచ్ సెడాన్లను కొందరు ధనవంతులు ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల ఈ ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ కారును 'విఎస్ రెడ్డి' కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

భారతదేశంలోని అతిపెద్ద మెడికల్ న్యూట్రిషన్ తయారీ కంపెనీలలో ఒకటైన బ్రిటిష్ బయోలాజికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ విఎస్ రెడ్డి ఇటీవల రూ. 3.44 కోట్ల ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఎస్680 లగ్జరీ కారును సొంతం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సుందరం మోటార్స్ బెంగళూరు తమ యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

V S Reddy Mercedes Benz Maybach 680

బెంగుళూరులో మెర్సిడెస్ బెంజ్ అధీకృత డీలర్‌షిప్ అయిన సుందరం మోటార్స్.. వీఎస్ రెడ్డికి కారును డెలివరీ చేసింది. వీడియోలో గమనించినట్లయితే.. వీఎస్ రెడ్డి మొదట డీలర్‌షిప్ వద్దకు చేరుకుంటారు. యాజమాన్యం ఆయనకు ఫ్లవర్ బొకే ఇచ్చి స్వాగతం పలుకుతారు. ఆ తరువాత లోపలికి తీసుకెళ్లి.. కారును ఆవిష్కరిస్తారు. కారు కీ (తాళం) వీఎస్ రెడ్డికి అందిస్తారు. ఆ తరువాత పూజాది కార్యక్రమాలు జరుగుతాయి.

పూజలు నిర్వహించిన తరువాత కేక్ కట్ చేయడం కూడా చూడవచ్చు. ఆ తరువాత వీఎస్ రెడ్డి కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వీఎస్ రెడ్డి కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ ఎస్680 సెడాన్ ప్రస్తుత తరం ఎస్ క్లాస్ ఆధారంగా రూపొందించబడి ఉన్నట్లు తెలిస్తుంది. అయితే ఎస్-క్లాస్‌తో పోలిస్తే.. ఎస్680 వీల్‌బేస్‌ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వీల్‌బేస్‌ పెరగటం వల్ల క్యాబిన్ కూడా పెరుగుతుంది.

V S Reddy Mercedes Benz Maybach 680

అద్భుతమైన డిజైన్ కలిగిన మెర్సిడెస్ బెంజ్ ఎస్680 కారు యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు, వెనుక సీటులో ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు, అన్ని సీట్లకు రిక్లైనర్ ఫంక్షన్, కూల్డ్ మరియు హీటెడ్ సీట్లతో పాటు మసాజర్ ఫంక్షన్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

ఇంజిన్ విషయానికి వస్తే.. మెర్సిడెస్ బెంజ్ ఎస్680 సెడాన్ 6.0 లీటర్ టర్బోఛార్జ్డ్ వీ12 ఇంజిన్ పొందుతుంది. ఇది 610 పీఎస్ పవర్ మరియు 900 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి.. పవర్ నాలుగు చక్రాలకు డెలివరీ చేస్తుంది. తద్వారా ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది.

వీఎస్ రెడ్డి గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ ఎస్680 మాత్రమే కాకుండా బెంట్లీ ముల్సాన్ ఈడబ్ల్యుబీ సెంటెనరీ ఎడిషన్‌ కూడా ఉంది. దీని ధర రూ.14 కోట్లు కంటే ఎక్కువని సమాచారం. ప్రస్తుతం ఈ ఖరీదైన కారును కంపెనీ నిలిపివేసింది. నిజానికి ఈ కారును బ్రిటిష్ వాహన తయారీ సంస్థ తన 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తయారు చేసింది. దీనికి 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసి.. వందమందికి మాత్రమే విక్రయించారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, June 28, 2024, 16:44 [IST]
English summary
Vs reddy buys expensive mercedes benz maybach 680 worth rs 3 5 crore
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+