రా.వన్ సినిమా కోసం గౌరీ ఖాన్‌కు ఫోక్స్‌వ్యాగన్ భారీ గిఫ్ట్

Gauri Khan
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న భారీ బడ్జెట్ సూపర్ హీరో చిత్రం 'రా.వన్' నిర్మాత, షారుఖ్ సతీమణి అయిన 'గౌరీ ఖాన్'కు జాక్‌పాట్ లభించింది. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో అందిస్తున్న అత్యంత ఖరీదైన లగ్జరీ కారు 'ఫేటాన్‌'ను గౌరీ ఖాన్‌కు బహుమతిగా ఇవ్వనుంది. త్వరలో థియేటర్లలోకి రానున్న ఈ సినిమాలో ఒకటి కన్నా ఎక్కువగా ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ కార్లను ఉపయోగించినట్లు తెలుస్తుంది.

హ్యుందాయ్ కంపెనీకు బ్రాండ్ అంబాసిడర్ అయిన షారుఖ్ ఖాన్ తన రా.వన్ చిత్రంలో కొన్ని హ్యుందాయ్ కార్లను కూడా ఉపయోగించినట్లు సమాచారం. షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్‌కు ఫేటాన్ కారును బహుమతిగా ఇవ్వడం ద్వారా ఫోక్స్‌వ్యాగన్ మరింత పబ్లిసిటీను సంపాధించుకోవాలని భావిస్తుంది. భారత మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ ఫేటాన్ లగ్జరీ కారు ధర సుమారు రూ.80 లక్షలకు పైమాటే. గతంలో ఈ కారుపై కంపెనీ 25 లక్షల డిస్కౌంట్‌ను కూడా ప్రకటించింది.

బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, వాస్తవానికి రా.వన్ చిత్రంలో షారుఖ్ ఉపయోగించింది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారు అయిన బుగాటి వేరాన్. ఈ కారును నడిపేందుకు గానూ షారుఖ్ ఖాన్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారట. కాగా.. ఇదే చిత్రంలో షారుఖ్ ఓ సూపర్‌ను కూడా ఉపయోగించనున్న సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Tuesday, October 11, 2011, 17:45 [IST]
English summary
Volkswagen the German carmaker is set to gift its most expensive car sold in India, the Phaeton luxury sedan to Gauri Khan, the producer of soon to be released Bollywood film Ra.One and wife of Bollywood super star Shahrukh Khan. It is believed Ra.One will feature one or more Volkswagen cars in action.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+