171 టన్నుల భారీ విమానాన్ని లాగిన నిస్సాన్ ఎస్‌యూవీ
చిన్న కారుతో భారీ విమానాన్ని లాగటం సాధ్యమవుతుందా..? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతుంది. చెప్పడమే కాదు, చేసి చూపించింది కూడాను. జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్ మోటార్ కార్పోరేషన్ గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తున్న 'నిస్సాన్ పాట్రోల్' (Nissan Patrol) ఎస్‌యూవీతో 170.9 టన్నులు బరువు కలిగిన విమానాన్ని లాగి ఓ సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ రికార్డు గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డులలో కూడా స్థానం సంపాధించుకుంది. 'ఏ ఉత్పత్తి వాహనం ద్వారానైనా లాగబడిన బరువైన వస్తువు' ("Heaviest Object Pulled By Any Production Vehicle") అనే విభాగం క్రింద గిన్నిస్ బుక్ ఈ రికార్డును నమోదు చేసింది.

షార్జా అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం చూపరులను ఔరా అనిపించేలా టేసింది. నిస్సాన్ పాట్రోల్ ఎస్‌యూవీ 17.09 టన్నుల బరువు కలిగిన ఇల్యూషిన్ 2-76 (Ilyushin Il-76) అనే రవాణా విమానాన్ని (కార్గో ప్లేన్)ను 50 మీటర్ల దూరం లాగి ఈ రికార్డును సృష్టించింది. ఈ ఫీట్ కోసం ఉపయోగించింది రెగ్యులర్ ప్రొడక్షన్ వెర్షన్ పాట్రోల్ ఎస్‌యూవీయేనని ఇందులో ఏలాంటి మార్పులు చేర్పులను చేయలేదని నిస్సాన్ స్పష్టం చేసింది.
గ్లోబల్ మార్కెట్లో లభ్యమవుతున్న నిస్సాన్ పాట్రోల్ ఎస్‌యూవీలో పవర్‌ఫుల్ 5.6 లీటర్, వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది. నిస్సాన్ పాట్రోల్ శక్తి సామర్థ్యాలను తెలియజేసేందుకు ఈ ఫీట్ చేసామని, దీని క్యాప్షన్‌కు తగినట్లుగానే (హీరో ఆఫ్ ఆల్ టెర్రైన్) ఇది హీరోగా రికార్డును సృష్టించిందని కంపెనీ పేర్కొంది. మరి ఈ గిన్నిస్ బుక్ రికార్డ్ ఫీట్‌ను మనం కూడా క్రింది వీడియోలో వీక్షిద్దాం రండి..!
<center><iframe width="600" height="450" src="//www.youtube.com/embed/cJXlMKGRtZo?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








