Air India :ఎయిర్ ఇండియా విమానంలో వాటర్ లీక్.. ఆందోళనలో ప్రయాణికులు, వైరల్ అవుతున్న వీడియో
ఎయిర్ ఇండియాకు చెందిన ఒక విమానంలో పైభాగం నుంచి నీరు కారుతున్న సంఘటన చోటుచేసుకుంది(Water leakage in Air India flight). దీంతో సమీపంలోని సీట్లలో కూర్చున్న ప్రయాణికులు కాసేపు ఆందోళనకు గురై ఇబ్బందులు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
బస్సులు, రైళ్లలో పై నుంచి వర్షపు నీరు కారడం చూస్తుంటాం. కానీ విమానంలో ఇలాంటి సమస్యలు మీరు ఎప్పుడూ విని ఉండరు. అయితే ఇటీవల ఎయిర్ ఇండియా(Air India Flight) విమానం క్యాబిన్‌లో నీరు ధారగా కారిన సంఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలోని ఓ ప్రయాణికుడు వీడియో తీసి జాయిస్ X(ట్విట్టర్) పేజీలో షేర్ చేశారు.

ఎయిర్ ఇండియా విమానంలోని ఓవర్‌హెడ్ బిన్‌ల నుంచి నీరు లీకైనట్లుగా వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ నెల 29 న ఢిల్లీ నుంచి లండన్ వెళ్లిన విమానంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. నీరు కారడంతో విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వాటర్ లీక్ అవుతుండగా.. దానిని ఆపేందుకు ఫ్లైట్ సిబ్బంది చాలా సేపు ప్రయత్నించారు. కాగా వాటర్ లీకేజీకి కారణం ఏమిటన్నది తెలియరాలేదు.
45 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో కొందరు గాఢ నిద్రలో ఉండగా.. మరికొందరు ఈ వాటర్ లీకేజీతో ఇబ్బంది పడ్డారు. ఎందుకు వాటర్ ఇలా కారుతుందో వారికి అర్థం కాలేదు. విమానంలో విండోస్ తెరిచి ఉండటంతో బయట నుంచి వస్తున్న కాంతి ద్వారా ఈ సంఘటన పగటి పూట జరిగినట్లుగా తెలుస్తోంది.

X లో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకూ 5000 మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దీనిని పోస్ట్ చేసిన యూజర్.. 'ఎయిర్ ఇండియా.. మాతో ప్రయాణించండి.. ఇది ప్రయాణం కాదు.. మునిగిపోతున్న అనుభూతి' అనే వ్యంగ్యమైన శీర్షికను రాశారు. దీంతో క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ అయిపోయింది.
విమానాల్లో సాంకేతిక సమస్యల వల్ల ఇలాంటివి సాధారణమేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు విమానాల నిర్వహణలో లోపాల కారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని, విమాన సంస్థల నిర్లక్ష్యంపై ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా పోస్టులపై ఎయిర్ ఇండియా ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

అయితే నీరు కారుతున్నా ప్రయాణికులపై చుక్క నీరు కూడా పడకపోవడంతో కొంత నిశ్శబ్దంగానే ఉన్నారు. కాగా విమానాల్లో ఎప్పటికప్పుడు ఇలాంటి చిన్న, చిన్న సమస్యలు రావడం సర్వసాధారణం. దీనిని సిబ్బంది ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తుండటం వల్ల ప్రయాణికులకు ఎక్కువగా ఇబ్బంది కలగడం లేదనే చెప్పవచ్చు. కాగా ఇటీవలి కాలంలో విమానాల్లో ఎక్కువగా ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారనేది వాస్తవం.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








