మీ కారు మైలేజ్ రావడం లేదా..? ఇలా చేయండి!!

కారు కొనడం అనేది ఈరోజుల్లో పెద్ద గొప్పేం కాదు. అయితే దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయడమే అసలైన పని. మీకు తెలియనిది ఏముంది.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో సగం ట్యాంక్ నింపుకోవాలంటే తలకు మించిన భారమవుతోంది. అయితే కొన్ని పద్దతులను పాటించడం ద్వారా కారు మైలేజీని మీరు పెంచుకోవచ్చు. అవేంటో చూద్దాం పదండి.

స్పీడ్ మెయింటెనెన్స్

ఇంధనం ఖర్చు అనేది ముఖ్యంగా స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. అవెరేజ్ స్పీడ్ లో వెళ్తే ఇంధనం తక్కువ ఖర్చు అవుతుంది. అలా కాకుండా హెవీ స్పీడులో వెళ్తే.. ఆ స్పీడ్ పెరిగే కొద్ది ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇలా ఈ టెక్నిక్స్ తెలుసుకుని నడిపితే మైలేజ్ పెంచుకోవడమే మాత్రమే కాదు.. కారు ఇంజన్ లైఫ్ ని కూడా కాపాడుకోవచ్చు.

టైర్లలో ఎయిర్‌ సరిగ్గా ఉందా..?

నాలుగు టైర్లలో కూడా గాలి అనేది పూర్తిగా ఉందో లేదో బయలుదేరే ముందే చెక్ చేసుకోవాలి. నిర్దేశిత మోతాదు కన్నా గాలి తక్కువ ఉన్నట్లయితే, కారు రన్నింగ్ లో ఉన్నప్పుడు మైలేజ్ భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది. టైర్లలో ఫుల్ గాలి ఉన్నట్లయితే కారు వేగంతో పాటు మైలేజ్ ను కూడా పొందవచ్చు.

గేర్స్ సరిగ్గా మారుస్తున్నారా..?

కారు రన్నింగ్ లో ఉన్నప్పుడు.. స్పీడ్ కు తగ్గట్టుగా గేర్స్ మార్చాల్సి ఉంటుంది. వాహనం తక్కువ స్పీడ్ ఉన్నప్పుడు ఎక్కువ గేర్ వేస్తే ఇంజన్ ఆ స్పీడ్ ను తట్టుకోలేక ఇంధనం ఖర్చు ఎక్కువ అవుతుంది. కొంతమంది అవసరం లేని చోట కూడా ఎక్కవ గేర్లతో కారును మూవ్ చేస్తారు. అలా చేయడం వల్ల ఇంజన్ పై ఎఫెక్ట్ పడుతుంది. దీంతో మీ కారు మైలేజ్ కూడా తగ్గుతుంది.

కారు మైలేజ్

ఇంజన్ మెయింటైనెన్స్ ముఖ్యం..

కారు ఇంజన్ సక్రమంగా లేకపోతే ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. ప్రధానంగా కారులో ఎయిర్ ఫిల్టర్ క్లీన్‌ గా ఉండేలా చూసుకోవాలి. అది క్లీన్ గా లేకపోతే.. ఎయిర్ ఫ్లోకు ఇబ్బంది అవుతుంది. ఆ కారణంగా ఆక్సీజన్ లెవెల్స్ తగ్గడంతో ఇంధనంపై అదనపు భారం పడుతుంది. తద్వారా ఎక్కువ ఇంధనం ఖర్చువుతుంది. మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో కారులో ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అంత ముఖ్యం.

ఇంజన్ ఆయిల్ ఎంపిక

వాహనం కొనుగోలు చేసినప్పుడు ఆ సంబంధిత ఇంజన్‌ కి ఏ గ్రేడ్ ఆయిల్ అయితే సరిగ్గా సూట్ అవుతుందో.. దానినే వినియోగించాల్సి ఉంటుంది. కొంత మంది ఈ నియమాన్ని పాటించక మైలేజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలా సూచించిన గ్రేడ్ ఆయిల్ ఉపయోగిస్తేనే... ఇంజన్ కూడా సరైన మైలేజ్ ఇస్తుంది. మనిషికి రక్తం ఎంత ముఖ్యమో ఇంజన్ కి ఆయిల్ అంత ప్రధానం.

క్లచ్ వాడే విధానంలోనూ

కారు నడిపేటప్పుడు మనం క్లచ్ ను ఎలా వాడుతున్నాం అనేది కూడా ముఖ్యమే. కొంతమంది
క్లచ్ పెడల్‌పై పాదాన్ని పెట్టి అలాగే నడుపుతుంటారు. అలా ఉంచొద్దు. క్లచ్ ఎంత అవసరమో అంతే ఉపయోగించాలి. ఇది మాత్రమే కాదు.. యాక్సిలరేటర్ కూడా ఒకేసారి సడెన్‌ గా ఉపయోగించడం చేయకూడదు. మరీ ముఖ్యంగా బ్రేక్ ల విషయంలో జాగ్రత్త పాటించాలి. ఒకేసారి సడెన్ గా బ్రేక్ వేయడం, మళ్లీ వెంటనే యాక్సిలరేట్ చేయడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇవే మైలేజ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.

కారు మైలేజ్ ఎందుకు తగ్గుతోందని కంగారు పడకుండా.. దానికి సంబంధించి ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలుసుకుని దానిని సరిచేసుకోండి. కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే మీరు మైలేజ్ మెరుగుపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కావున పైన తెలిపిన విధంగా కొన్ని కొన్ని స్మార్ట్ టిప్స్ ని పాటిస్తూ మీ కారు మైలేజ్ ని పెంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Saturday, February 25, 2023, 6:34 [IST]
English summary
Ways to save mileage in cars and uses for the engine
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+