టాప్ 10 ఉభయచర వాహనాలు.. ఆశ్చర్యపోకండి..

By Ravi

ఉభయచర జీవి అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది కప్ప. కప్ప నీటిలోను, నేలపై ఎంచక్కగా జీవించేయగలదు. కానీ, అదే నీటిపై మరియు నేలపై వెళ్లే ఉభయచర వాహనం అంటే మనకు సినిమాల్లో తప్ప, మరెక్కడా కనిపించదనే అభిప్రాయం ఉంటుంది.

వాస్తవానికి, ఒకప్పుడు సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ తరహా ఉభయచర వాహనాలు ఇప్పుడు నిజజీవితంలోను అందుబాటులోకి వచ్చాయి. ఈనాటి మన ఆఫ్-బీట్ శీర్షికలో టాప్ 10 ఉభయచర వాహనాలు (ఆంఫిబియస్ వెహికల్స్) గురించి తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఆంఫీకార్

ఆంఫీకార్

ఇదొక క్లాసిక్ ఆంఫిబియస్ కారు. జర్మనీలో ఈ కారు 1961లోనే పబ్లిక్ మార్కెట్లో విక్రయించేవారు. ఈ వాహనాన్ని క్వాండ్ట్ గ్రూప్ తయారు చేసింది. ఒరిజినల్ ఆంఫీకార్‌ను అమెరికాలో పంపిణీ, విక్రయాలు చేయాలనే ఉద్దేశ్యంతో అభివృద్ధి చేశారు. అయితే, అప్పటికే అందుబాటులో ఉన్న కార్లు, బోట్ల పెర్ఫార్మెన్స్‌కు ఇది సూట్ కాకపోవటంతో కేవలం 4000 ఆంఫీకార్లను మాత్రమే తయారు చేసి, ఆపై ఉత్పత్తిని నిలిపివేశారు.

గిబ్స్ క్వాడ్స్కీ

గిబ్స్ క్వాడ్స్కీ

నేలపై క్వాడ్‌బైక్ మాదిరిగా నీటిపై స్పీడ్ బోట్ మాదిరిగా మారిపోయే ఈ వాహనం పేరు గిబ్స్ క్వాడ్స్కీ. ఈ యాంఫిబియస్ ఫోర్-వీలర్‌ను అమెరికాకు చెందిన గిబ్స్ కంపెనీ తయారు చేసింది. కేవలం ఒక బటన్‌ను నొక్కితే చాలు.. ఐదు సెకన్లలోనే ఇది ఒక మోడ్ నుంచి ఇంకో మోడ్‌లోకి మారిపోతుంది. రోడ్డుపై, నీటిపై గంటకు 72 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకెళుతుంది. దీని బరువు 47 కిలోలు మాత్రమే.

రిన్‌స్పీడ్ స్ప్లాష్

రిన్‌స్పీడ్ స్ప్లాష్

స్విట్జర్లాండ్‌కి చెందిన స్పోర్ట్స్ కార్ ట్యూనింగ్ సంస్థ రిన్‌స్పీడ్ 2004లో అభివృద్ధి చేసిన ఆంఫిబియస్ కారు ఇది. హైడ్రోఫోయిల్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని తయారు చేసిన రిన్‌స్పీడ్ స్ప్లాష్ నీటిపై గరిష్టంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అదే రోడ్డుపై అయితే గంటకు గరిష్టంగా 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. సహజ వాయువును ఇంధనంగా చేసుకునే నడిచే ఈ కారులో టూ-సిలిండర్, టర్బో-చార్జ్డ్ 750సీసీ ఇంజన్ ఉంటుంది.

గిబ్స్ ఆక్వాడా

గిబ్స్ ఆక్వాడా

గిబ్స్ కంపెనీ తయారు చేసిన మరో అద్భుతమైన ఆంఫిబియస్ కారు గిబ్స్ ఆక్వాడా. ఇదొక స్పోర్ట్స్ ఆంఫిబియస్ మరియు ఓ హైస్పీడ్ వెజెల్. నీటిపై ఇది గంటకు 30 మైళ్ల వేగంతో పరుగులు తీస్తుంది. అదే రోడ్డుపై గంటకు 100 మైళ్ల వేగంతో దూసుకుపోతుంది. మార్చ్ 2003 ప్రాంతంలో గిబ్స్ ఆక్వాడా చరిత్రలో నిలిచిపోయింది. ఆ సమయంలో రిచర్డ్ బ్రాన్సన్ ఈ వాహనంలో కేవలం 1 గంటా 40 నిమిషాల 6 సెకండ్ల వ్యవధిలో ఇంగ్లీష్ ఛానెల్ మొత్తాన్ని చూట్టొచ్చి రికార్డు సృష్టించాడు.

వాటర్‌కార్ పాంథర్

వాటర్‌కార్ పాంథర్

కాలిఫోర్నియాకి చెందిన వాటర్‌కార్ కంపెనీ అందిస్తున్న పాంథర్ ఎస్‌యూవీ మాదిరిగా కనిపించే ఆంఫిబియస్ వాహనం. ఈ వాటర్‌కార్ పాంథర్ నీటిపై గంటకు 45 మైళ్ల వేగంతోను, నేలపై గంటకు 80 మైళ్ల వేగంతోను పరుగులు తీస్తుంది. జీప్ సిజే8 స్క్రాంబ్లర్ మోడల్ డిజైన్‌ను స్ఫూర్తి పొంది ఈ ఆంఫిబియస్ వాహనాన్ని డిజైన్ చేశారు.

హైడ్రా స్పైడర్

హైడ్రా స్పైడర్

ఇదొక ఓపెన్-టాప్ హైపెర్ఫార్మెన్స్, హైస్పీడ్ ఆంఫిబియస్ స్పోర్ట్స్ కారు. దీనిని తొలిసారిగా కూల్ ఆంఫిబియస్ మ్యానుఫాక్చరర్స్ ఇంటర్నేషల్ వద్ద ఆవిష్కరించారు. ఇది నీటిపై గంటకు గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతోను, నేలపై గరిష్టంగా గంటకు 201 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఇందులో షెవర్లే కార్వెట్ ఎల్ఎస్2 నుంచి గ్రహించిన 6.0 లీటర్, వి8 ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 400 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

సీరోడర్ లాంబోర్గినీ కౌంటాచ్

సీరోడర్ లాంబోర్గినీ కౌంటాచ్

సీరోడర్ ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి ఆంఫిబియస్ లాంబోర్గినీ కారు. ఈ లాంబోర్గినీ కౌంటాచ్ కారును మైక్ రైన్ మోడిఫై చేశారు. మోటార్‌సైకిళ్లు, జీపులు, ఐస్‌క్రీమ్ వ్యాన్‌లు, లండన్ టాక్సీ వంటి వాటిని కూడా ఇతను ఆంఫిబియస్ వాహనాలుగా మార్చాడు.

గిబ్స్ హండింగా

గిబ్స్ హండింగా

ఇదొక 5-సీటర్ ఆంఫిబియస్ వాహనం. రోడ్డుపై ఇది ఫుల్-టైమ్ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో పవర్‌ఫుల్ 350 బిహెచ్‌పి వి8 ఇంజన్ ఉంటుంది. ఇది నేలపై గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతోను, నీటిపై గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతోను పరుగులు తీస్తుంది.

సీ లయన్

సీ లయన్

పేరుకు తగినట్లుగా సీ లయన్ ఓ అత్యంత వేగవంతమైన ఆంఫిబియస్ వాహనం. ఇది నీటిపై గరిష్టంగా గంటకు 96 కిలోమీటర్ల వేగంతోను, నేలపై గరిష్టంగా గంటకు 201 కిలోమీటర్ల వేగంతోను పరుగులు తీస్తుంది. సిఎన్‌సి-మిల్ల్‌డ్ అండ్ టిఐజి-వెల్డెడ్ 5052 అల్యూమినియంను ఉపయోగించా సీ లయన్స్ బాడీని ఫిట్ చేశారు.

డాబెర్టిన్ హైడ్రోకార్

డాబెర్టిన్ హైడ్రోకార్

అల్యూమినియం బాడీతో తయారు చేసిన డాబెర్టిన్ హైడ్రోకార్ ఒక్క స్విచ్ నొక్కగానే క్షణాల్లో ల్యాండ్ మోడ్ నుంచి వాటర్ మోడ్‌కి మారిపోతుంది. నీటిపై రాగానే ఇధి ఫుల్-సైజ్ ప్రైవేట్ బోట్ మాదిరిగా మారిపోతుంది. అదే తిరిగి నేలపైకి రాగానే ఓ ప్రాపర్ స్పోర్ట్స్ కారుగా కనిపిస్తుంది. ఇందులో రీట్యూన్ చేసిన షెవర్లే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 762 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 25, 2015, 10:42 [IST]
English summary
Are you aware of any vehicles that are able to swim? Here is a list of amphibious vehicles that really exist.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+