మంచాన్ని కారుగా మార్చిన మాస్టర్ మైండ్.. ఆ యువకుడు చెప్పిన కారణం వింటే మీరు షాక్ అవుతారు!
సోషల్ మీడియా వినియోగం ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉందో అందరం చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడో ఓ మూల ఏ చిన్న ఘటన జరిగిన కూడా సెకన్లలో అంతటా తెలిసిపోతుంది. ముఖ్యంగా కోట్లాది జనాభా ఉన్న భారతదేశంలో ప్రతి రోజూ ఏదో కొత్తగా, ఆశ్చర్యంగా జరగడం చూస్తూనే ఉంటాం. కొత్త ఆలోచనలతో, కొత్త ఆవిష్కరణలతో ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేమస్ అవుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నుండి వెలువడుతున్న వినూత్న ఆలోచనలు ట్రెండింగ్‌లోకి రావడం వలన అందిరి లాగా కాకుండా ప్రత్యేకతను కలిగి ఉండాలనే వారు వెలుగులోకి వస్తున్నారు. ఇలాంటి ప్రత్యేకతను చాటుకుంటూ ఒక వ్యక్తి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాడు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడు ఒక అద్భుతమైన వాహనాన్ని రూపొందించాడు. ఇది తక్కువ ఖర్చుతో, వినూత్న ఆలోచనలతో తయారైన వాహనం. దీని డిజైన్ చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇది కేవలం ప్రయాణించడానికి వాహనం మాత్రమే కాదు, అతని సృజనాత్మకత ఆలోచనకు ప్రతిరూపంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ యువకుడి ఆవిష్కరణపై ఎంతోమంది సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన వాహనం గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని కింద తెలుసుకోవచ్చు.

ఆ యువకుడు తయారు చేసిన వాహనం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది ఒక 'కదిలే మంచం'. కేవలం పడుకోడానికి ఉపయోగించే మంచం కాదు, నిజంగా రోడ్డుపై ప్రయాణించే ఒక వినూత్న వాహనం. వీడియోను చూసినట్లయితే విచిత్రమైన వాహనాన్ని మంచం రూపంలో తయారు చేశాడు. ఒక దిండు, పరుపు, బెడ్‌షీట్‌తో ఉంది. మొదట చూసిన వారికి అది ఒక డ్రామా సెట్ వంటిదే అనిపిస్తుంది.
కానీ కాస్త జాగ్రత్తగా గమనిస్తే, ఆ మంచం మీద కూర్చున్న యువకుడు దానిని నడుపుతున్నట్లు తెలుస్తుంది. అది టైర్లు, స్టీరింగ్ వంటి వాటితో అమర్చబడి ఉందన్న విషయం అర్థమవుతుంది. ఈ వాహనం రోడ్డుపై వెళ్తుంటే ఒక మంచం కదులుతున్నట్టు ఉంది. ఆ యువకుడు ఎంతో కష్టపడి ఈ వాహనాన్ని రూపొందించాడు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల నవాబ్ ఈ వినూత్న ఆవిష్కరణ వెనుక ఉన్న వ్యక్తి.

అతను అక్కడే ఓ పాఠశాలలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నవాబ్ నెలకు రూ.9,000 జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అతనికి చాలా కాలంగా ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే కోరిక ఉండేది. దీంతో అతనిలో దాగి ఉన్న వినూత్నమైన ఆలోచన బయటికి వచ్చింది. ప్రత్యేకంగా ఫేమస్ అవ్వడానికి ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే బెడ్ కారు రూపొందించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఈ బెడ్ కారును తయారు చేయడానికి నవాబ్ దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు కృషి చేయాల్సి వస్తుంది. అతనికి వస్తున్న కొద్ది పాటి జీతంతో ఈ వాహనాన్ని రూపొందించడానికి డబ్బులు సరిపోకపోవడంతో తన భార్య నగలను కూడా అమ్మేసి ఆ డబ్బులను కూడా ఈ వాహనం తయారు చేయడానికి వాడాడు. చివరికి అతని కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. నవాబ్ కోరుకున్నట్లే, అతను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.

అయితే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇలాంటి వాహనాలతో రోడ్డుపై నడపడం సేఫ్టీ కాదు. ఇవి కేవలం సోషల్ మీడియాలో వైరల్ కావడానికి మాత్రమే ఉపయోగపడుతాయి. వీటి వలన రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర వాహనాలకు ఇబ్బంది కలుగుతుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది రోడ్డు ప్రమాదాల కారణంగా కోల్పోతున్నారు. అయితే ఈ వాహనం రూపొందించడానికి కష్టపడిన యువకుడి ప్రతిభను ఎవరైనా గుర్తించడం ద్వారా అతని జీవితం మెరుగుపడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








