World EV Day ఎలక్ట్రిక్‌ వాహనాల రంగానికి ఉన్న ప్రతికూలతలేంటి.. ?

ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. భారత్‌ సహా ప్రపంచ దేశాలు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా ఇటీవల కొంత కాలంగా సెప్టెంబర్‌ 9న ప్రపంచ EV డేగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఈవీ సంస్థలు ఇవాళ ఎలక్ట్రిక్‌ వాహనాలపై అవగాహన కల్పిస్తున్నాయి.

ఎలక్ట్రిక్‌ వాహనాల రాకతో భారత ఆటోమొబైల్‌ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారత్‌లో అతిపెద్ద సమస్యగా ఉన్న పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు కూడా ఉపయోగపడుతుంది. సోసైటీ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్ మానుఫ్యాక్చరర్స్‌ నివేదిక ప్రకారం 2022-23 సంవత్సరంలో భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాల్లో సుమారు 154% వృద్ధిని నమోదు చేసింది. ఈ 2022-23 సంవత్సరంలో భారత్‌లో 12.43.258 ఎలక్ట్రిక్‌ వాహనాలు విక్రయించబడ్డాయి.

Electric vehicle sector in India

భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 2015లో FAME కార్యక్రమం కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై సబ్సిడిని ప్రకటించింది. అయితే FAME-2 కింద గతంలో ఇచ్చిన సబ్సిడిపై కోత విధించింది. ఈవీల కొనుగోలుపై గతంలో 40 శాతం ఉన్న సబ్సిడిని 15 శాతానికి తగ్గించింది.

భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం టాటా మోటార్స్‌, మహీంద్రా, హ్యుందాయ్‌ సంస్థలు అధికంగా ఈవీల తయారీ, విక్రయాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా దేశంలోనే చాలా సంస్థలు ఈవీలపై అధిక పెట్టుబడులు పెడుతున్నాయి. ఫలితంగా అందుబాటు ధరలో ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేస్తున్నాయి. అయితే భారత్‌ మార్కెట్‌లో ఈవీలకు అధిక ఆదరణ ఉన్నా.. మౌలిక సదుపాయాల కొరత కారణంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వెనక్కి తగ్గుతున్నారు.

Electric vehicle sector in India

అంటే ఛార్జింగ్‌ స్టేషన్ల కొరత, ఖరీదు సహా ఇతర కారణాలతో కొంది మంది ప్రజలు వెనక్కి తగ్గుతున్నారు. దీంతోపాటు ఈవీల పనితీరుపై అవగాహన లోపం వంటి సవాళ్లను ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల రంగం ఎదుర్కొంటోంది. సవాళ్లు ఉన్నా.. కీలక నిర్ణయాలు, సాంకేతిక అభివృద్ధి.. భవిష్యత్‌తో భారత్‌లో ఈవీల అభివృద్ధికి దోహదం చేసే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించేందుకు భారత్‌లో ప్రధానంగా ఛార్జింగ్‌ స్టేషన్లు కొరత, FAME-2 కింద ఎలక్ట్రిక్‌ వాహనాలపైకు ఇచ్చే సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం కోత విధించడం ప్రస్తుతం ప్రధాన అడ్డకింగా ఉంది. అయితే దేశంలో ఉన్న అవసరాలు, అవకాశాల కారణంగా.. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌గా అవతరించే అవకాశం ఉంది.

భారత్‌లో ఆగస్టు నెల నివేదిక ప్రకారం ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల విక్రయాలు గణనీయంగా వృద్ధి చెందాయి. ఈ విక్రయాల్లో ఓలా తొలి స్థానంలో నిలిచింది. టీవీఎస్‌ రెండో స్థానంలో ఉంది. సాధారణంగా భారత్‌లో పండుగల సమయంలో ద్విచక్రవాహనాల విక్రయాలు గణనీయంగా ఉంటాయి.

అయితే ఆగస్టు నెలలో మాత్రం సుమారుగా అన్ని సంస్థలు కూడా విక్రయాల్లో వృద్ధి సాధించాయి. FAME-2 సబ్సీడిలో కోత విధించిన తర్వాత జూన్‌, జులై నెలల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు విక్రయాలు భారీగా పడిపోయాయి. అయితే ఆగస్టులో మాత్రం సుమారు 60000 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, September 9, 2023, 10:57 [IST]
English summary
What are the key issues to be solved in electric vehicle sector in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+