కారు పైభాగంలో అమర్చే రూఫ్ క్యారియర్ల వలన కలిగే ప్రయోజనాలు మరియు నష్టాలు..

మనదేశంలో ఎక్కువగా చిన్న కార్లదే పైచేయిగా ఉంటుంది. అయితే, ఇలాంటి కార్లలో వినియోగదారులు తరచూ లగేజ్ స్పేస్ సమస్యను ఎదుర్కుంటుంటారు. తయారీదారులు కూడా ఈ సమస్యకు పరిష్కారంగా కారు పైభాగంలో రూఫ్ ర్యాక్స్ ను అందిస్తారు. వాస్తవానికి కేవలం షోకి మాత్రమే కాకుండా, అదనపు లగేజ్ ను తీసుకువెళ్లడానికి కూడా ఉపయోగపడుతాయి. మరి ఈ కథనంలో రూఫ్ ర్యాక్స్ లేదా పైభాగంలో అమర్చుకునే అదనపు లగేజ్ ర్యాక్స్ వలన కలిగే లభాలు మరియు నష్టాలు ఏంటో చూద్దాం రండి.

కారు పైభాగంలో అమర్చే రూఫ్ క్యారియర్ల వలన కలిగే ప్రయోజనాలు మరియు నష్టాలు..

కారు పైభాగంలో ఇరువైపులా ఉండే రూఫ్ ర్యాక్స్ ధృడమైన అల్యూమినియం మెటీరియల్ తో తయారు చేయబడి ఉంటాయి. వాటిపై అమర్చుకునేందుకు వివిధ రకాల యాక్ససరీలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు సైకిల్ ను తీసుకువెళ్లడానికి కారు వెనుక భాగంలో డోరుకి కానీ లేదా పైభాగంలో రూఫ్ ర్యాక్ కు అమర్చుకునేలా ఓ యాక్ససరీ లభిస్తుంది. దీనికి ఎంచక్క సైకిల్ ను మౌంట్ చేసి, మీ కారుతో పాటుగా తీసుకుపోవచ్చు.

కారు పైభాగంలో అమర్చే రూఫ్ క్యారియర్ల వలన కలిగే ప్రయోజనాలు మరియు నష్టాలు..

అలాగే, కారు పైభాగంలో లగేజ్ ర్యాక్ ను అమర్చడం ద్వారా దానిపై అదనపు లగేజ్ ను మీ వెంట తీసుకువెళ్లవచ్చు లేదా ఎవరికైనా క్యాంపింగ్ చేసే హాబీ ఉంటే, మీ క్యాంపింగ్ సామాగ్రి మొత్తాన్ని కారు పైభాగంలో ఉంచుకునేందుకు వీలుగా సూట్ కేస్ ఆకారంలో ఉండే రూఫ్ క్యారియర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి చాలా సురక్షితమైనవి మరియు మీ విలువైన వస్తువులు కూడా ఇందులో భద్రంగా ఉంటాయి.

కారు పైభాగంలో అమర్చే రూఫ్ క్యారియర్ల వలన కలిగే ప్రయోజనాలు మరియు నష్టాలు..

రూఫ్ రాక్‌లు లేదా రూఫ్ క్యారియర్లు మీ కారుకు ప్రత్యేకమైన రూపాన్ని అందిస్తాయి. కార్లు, ముఖ్యంగా ఎస్‌యూవీల పైకప్పులపై ఉండే రూఫ్ రాక్ లు వాటికి గంభీరమైన రూపాన్ని ఇస్తాయి. రూఫ్ రాక్‌లు లేదా క్యారియర్లు మనకు అనేక ప్రయోజనాలను అందించినప్పటికీ, వీటి వలన కలిగే నష్టాలు కూడా అధికంగానే ఉంటాయి. అవేంటంటే..

కారు పైభాగంలో అమర్చే రూఫ్ క్యారియర్ల వలన కలిగే ప్రయోజనాలు మరియు నష్టాలు..

విపరీతమైన శబ్దం

కారుపై కంపెనీ అందించే రూఫ్ రెయిల్స్ కాకుండా, వాటిపై అదనపు రూఫ్ క్యారియర్ ను అమర్చడం వలన కారు యొక్క ఏరోడైనమిక్ డిజైన్ ప్రభావితం అవుతుంది. ఈ రూఫ్ క్యారియర్లపై అదపు లగేజ్ ఉంచడం లేదా ఆ లగేజ్ ని టార్పాలిన్ పట్ట వంటి వాటితో చుట్టడం వలన, ప్రయాణంలో కారు వెలుపల పెద్ద శబ్ధం వినిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ శబ్ధం కారు లోపల కూడా వినిపిస్తూ ఉంటుంది. మంచి రోడ్డు పై కారు నడపడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ కఠినమైన రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు, కారులో ప్రయాణించే వారందరూ ఈ సమస్యను ఎదుర్కొంటారు.

కారు పైభాగంలో అమర్చే రూఫ్ క్యారియర్ల వలన కలిగే ప్రయోజనాలు మరియు నష్టాలు..

మైలేజ్ తగ్గుతుంది

కారులో అదనపు బరువు అంటే, అదనపు ఇంధన వినియోగం అని గుర్తించుకోవాలి. కారు పైభాగంలో ఉపయోగించే రూఫ్ క్యారియర్లు ఆ కారు యొక్క మైలేజీని కూడా ప్రభావితం చేస్తాయి. ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఈ రూఫ్ క్యారియర్లు కారు ఏరోడైనమిక్ డిజైన్ ను ప్రభావితం చేస్తాయి, కాబట్టి కారు సులువుగా ముందుకు వెళ్లడానికి కష్టపడాల్సి వస్తుంది.

కారు పైభాగంలో అమర్చే రూఫ్ క్యారియర్ల వలన కలిగే ప్రయోజనాలు మరియు నష్టాలు..

అలాగే, కారు ఫుల్ లోడ్ కి మించి ప్రయాణిస్తుంది కాబట్టి, ఆ బరువును లాగడానికి ఇంజన్ ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేస్తుంది. ఫలితంగా, మైలేజ్ తగ్గుతుంది. అంతేకాకుండా, కారు పైభాగంలో ఉపయోగించే రూఫ్ క్యారియర్లపై ఎక్కువ బరువును ఉంచడం వలన కారులో కొన్ని సాంకేతిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

కారు పైభాగంలో అమర్చే రూఫ్ క్యారియర్ల వలన కలిగే ప్రయోజనాలు మరియు నష్టాలు..

కారు వాలిపోయే ప్రమాదం

రూఫ్ క్యారియర్లు తేలికపాటి వస్తువులను తీసుకువెళ్లడానికి మాత్రమే ఉపయోగించాలని గుర్తుంచుకోండి. రూఫ్ క్యారియర్లు విక్రయించే కంపెనీలు వాటి నిర్ధిష్ట లోడ్ కెపాసిటినీ పేర్కొనబడి ఉంటాయి. అంతకు మించి లగేజ్ ని ఉపయోగించడం ప్రమాదం. అంతేకాకుండా, రూఫ్ క్యారియర్లపై ఉంచే లగేజ్ కూడా ఓ సమాన పద్ధతిలో ఉంచాలి. ఓవైపు ఎక్కువ బరువు, మరోవైపు తక్కువ బరువును ఉంచడం వలన కారు బ్యాలెన్స్ తప్పి, సైడ్ కి వాలిపోయే ప్రమాదం జరగవచ్చు. ప్రత్యేకించి గుంతలతో కూడిన రోడ్లపై ఇది మరింత ప్రమాదకరంగా ఉంటుంది.

కారు పైభాగంలో అమర్చే రూఫ్ క్యారియర్ల వలన కలిగే ప్రయోజనాలు మరియు నష్టాలు..

లో-హైట్ అండర్‌పాస్‌ల వద్ద జాగ్రత్త

నగరాలు, రోడ్డు నిర్మాణ పనులు జరిగే ప్రదేశాలు మరియు రైల్వే అండర్ బ్రిడ్జ్‌ల నిర్ధిష్ట ఎత్తుతో కూడిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అధికారులు కూడా అందుకు సంబంధించిన లో-హైట్ బారికేడ్లను ఏర్పాటు చేసి ఉంటారు. కారుపై లగేజ్ క్యారియర్లను ఉపయోగించే ఇలాంటి ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కారు ఖచ్చితంగా అలాంటి అండర్‌పాస్ ల గుండా వెళ్లగలదని నిర్ధారించుకుంటే తప్ప, ముందుకు వెళ్లే సాహసం చేయకూడదు.

Most Read Articles

English summary
What are the major pros and cons of roof carriers on car
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X