విమాన పైలట్లు టోపీ ధరిస్తారు ఎందుకు? అసలు ఈ టోపీ గురించి పైలట్లు ఏం చెబుతున్నారు..?

విమాన ప్రయాణం అనేది చాలా మందికి ఓ కొత్త అనుభం, అయితే తరచూ ప్రయాణించే వారికి మాత్రం ఇదొక సర్వసాధారణమైన విషయం. విమానాశ్రయాలు మరియు విమానాలలో మనం తరచూ కొన్ని అంశాలను పరిశీలిస్తుంటాం. వీటిలో కొన్నింటి గురించి మనకు పూర్తిగా తెలిసి ఉండొచ్చు మరికొన్నింటి గురించి అస్సలు తెలియకపోవచ్చు. అలాంటి విషయాలలో ఒకటి పైలట్లు ధరించే టోపి. చాలా మందికి అసలు పైలట్లు ఈ టోపీ ఎందుకు ధరిస్తారు? దానిని ధరించడం తప్పనిసరా? అది వారి యూనిఫామ్‌లో ఓ భాగమా? అనే పలు రకాల సందేహాలు ఉండవచ్చు. అలాంటి సందేహాలన్నింటినీ ఈ కథనంలో నివృత్తి చేసుకుందాం రండి.

విమాన పైలట్లు టోపీ ధరిస్తారు ఎందుకు? అసలు ఈ టోపీ గురించి పైలట్లు ఏం చెబుతున్నారు..?

సాధారణంగా, విమానంలో ప్రయాణించే వారికి పైలట్ ను చూసే అవకాశం చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటేస వీరు అందరికన్నా ముందుగా ఫ్లైట్ లోకి ప్రవేశిస్తారు. అయితే, కొంత మంది విమానం ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు పైలట్లను చూసే అవకాశం ఉంటుంది. అలా వారిని చూసినప్పుడు వారు ఓ ప్రత్యేకమైన యూనిఫామ్ లో కనిపిస్తారు. తెలుపు రంగు షర్ట్, నలుపు రంగు ప్యాంట్, నలుపు రంగు కోట్ మరియు తలపై నలుపు రంగు హ్యాట్ తో కనిపిస్తారు.

విమాన పైలట్లు టోపీ ధరిస్తారు ఎందుకు? అసలు ఈ టోపీ గురించి పైలట్లు ఏం చెబుతున్నారు..?

మహిళా పైలట్లకు కూడా ఇదే రకమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. దాదాపుగా ప్రతిదేశంలో కూడా ప్యాసింజర్ విమాన పైలట్లు ఇదే రకమైన డ్రెస్ కోడ్ ను ఫాలో అవుతుంటారు. వీరి దుస్తులపై అక్కడక్కడా గోల్డ్ కలర్ కూడా కనిపిస్తుంది. పైలట్ల యూనిఫామ్ లో తలపై ధరించే హ్యాట్ (టోపీ) చాలా ముఖ్యమైనది. అయితే, కొంతమంది పైలట్లు మాత్రమే తలపై టోపీ ధరిస్తారు. విమానయానంలో పైలట్ అనేది ఓ గొప్ప ఉద్యోగం, వందలాది మందిని సురక్షితంగా గమ్యాలకు చేర్చడం వీరి విధి.

విమాన పైలట్లు టోపీ ధరిస్తారు ఎందుకు? అసలు ఈ టోపీ గురించి పైలట్లు ఏం చెబుతున్నారు..?

పైలట్లకు అనేక విషయాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రత్యేకించి, ఎమర్జెన్సీ సమయంలో ఎలా చాచక్యంగా వ్యవహరించాలో వీరికి తెలియజేస్తారు. అలాంటి నైపుణ్యం గల పైలట్లను సాధారణ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది నుండి వేరు చేసి, వారికి ప్రత్యేక గుర్తింపు అందించేందుకు గాను వారి యూనిఫామ్ లో ఈ హ్యాట్ ను కూడా తప్పనిసరి చేయడం జరిగింది. పైలట్‌లను సులువుగా గుర్తించేందుకు ఈ టోపీలను ఉపయోగిస్తారు. ఈ టోపీలు పైలట్‌లను మిగిలిన సిబ్బంది నుండి వేరు చేస్తాయి.

విమాన పైలట్లు టోపీ ధరిస్తారు ఎందుకు? అసలు ఈ టోపీ గురించి పైలట్లు ఏం చెబుతున్నారు..?

అయితే, అన్ని ఎయిర్‌లైన్స్ పైలట్‌లు టోపీలు ధరించరు. కొన్ని విమానయాన సంస్థలు మాత్రమే తమ వద్ద పనిచేసే పైలట్‌లు టోపీ ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. మరికొన్ని కంపెనీలు పైలట్లకు టోపీ ధరించాలనే నిబంధన నుంచి మినహాయింపునిచ్చాయి. అంటే తమ పైలట్లు టోపీ పెట్టుకోకున్నా సదరు ఏవియేషన్ కంపెనీలు అంగీకరిస్తాయి.

విమాన పైలట్లు టోపీ ధరిస్తారు ఎందుకు? అసలు ఈ టోపీ గురించి పైలట్లు ఏం చెబుతున్నారు..?

టోపీ ధరించడం గురించి పైలట్లలో సాధారణంగా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది పైలట్లు ఎల్లప్పుడూ టోపీని ధరించడానికి ఇష్టపడరు. అయితే, మరికొందరు పైలట్లు టోపీని ధరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. టోపీలు ధరించడం గురించి ఈ ఇరు వర్గాల పైలట్లు చెప్పే కారణాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

విమాన పైలట్లు టోపీ ధరిస్తారు ఎందుకు? అసలు ఈ టోపీ గురించి పైలట్లు ఏం చెబుతున్నారు..?

టోపీలు ధరించడానికి ఇష్టపడని పైలట్‌లు ఏం చెబుతున్నారంటే, ''మేమంతా టోపీలకు వ్యతిరేకం. టోపీ పెట్టుకోవడం వల్ల జుట్టు ఊడిపోతుంది. దాని వల్ల తలపై బట్టతల వస్తుంది. అలాగని చేతిలో టోపీ పట్టుకుని నడవడం కూడా సిల్లీగా అనిపిస్తుంది. అందుకే మేము టోపీలకు వ్యతిరేకం" అని చెబుతున్నారు.

విమాన పైలట్లు టోపీ ధరిస్తారు ఎందుకు? అసలు ఈ టోపీ గురించి పైలట్లు ఏం చెబుతున్నారు..?

మరి టోపీలు పైలట్‌లకు ప్రత్యేక గుర్తింపు ఇస్తాయని కదా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. టోపీలు కొన్నిసార్లు అనవసర గందరగోళానికి కారణమవుతాయని, ఈ టోపీలు ధరించిన కారణంగా కొంతమంది ప్రయాణికులు తమని 'స్కైక్యాప్'గా భావిస్తారని, కాబట్టి వారు తమ సామాను తీసుకెళ్లమని ఆదేశిస్తారని టోపీలు ధరించని పైలట్లు చెబుతున్నారు. మరికొంత మంది ప్రయాణీకులైతే టాయిలెట్‌కు తమను వెళ్లే దారేదని అడుగుతున్నారని సదరు పైలట్లు అంటున్నారు.

విమాన పైలట్లు టోపీ ధరిస్తారు ఎందుకు? అసలు ఈ టోపీ గురించి పైలట్లు ఏం చెబుతున్నారు..?

స్కైక్యాప్ అంటే విమానాశ్రయాల్లో పోర్టర్లుగా పనిచేసే సిబ్బంది. లగేజీని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడం వీరి పని. అయితే, విమాన పైలట్లు కూడా క్యాప్ ధరిస్తుండటంతో ప్రయాణీకులు వారు కూడా 'స్కైక్యాప్' అని పొరపాటు పడుతున్నారు. ఈ గందరగోళం కారణంగా కొంతమంది పైలట్లు తమ యూనిఫాంలో భాగంగా టోపీని ధరించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

విమాన పైలట్లు టోపీ ధరిస్తారు ఎందుకు? అసలు ఈ టోపీ గురించి పైలట్లు ఏం చెబుతున్నారు..?

అయితే టోపీలను ఇష్టపడే పైలట్ల వాదన మాత్రం మరోలా ఉంది. ''టోపీలు యూనిఫాంను పూర్తి చేస్తాయి. అవి మాకు వృత్తిపరంగా చాలా సొగసైన రూపాన్ని అందిస్తాయి. అలాగే టోపీలు నాయకత్వాన్ని ప్రతిధ్వనిస్తాయి. కాబట్టి మేము ఎల్లప్పుడూ టోపీని ధరించడానికి ఇష్టపడతాము'' అనేది టోపీలను ధరించడానికి ఇష్టపడే పైలట్ల అభిప్రాయం.

విమాన పైలట్లు టోపీ ధరిస్తారు ఎందుకు? అసలు ఈ టోపీ గురించి పైలట్లు ఏం చెబుతున్నారు..?

ఎయిర్‌లైన్ పైలట్‌లు ధరించే క్యాప్‌ల వెనుక కూడా ఇలాంటి భిన్నమైన అభిప్రాయాలు ఉండటం ఆసక్తికరంగా ఉంది. ఈ భిన్నాభిప్రాయాల నేపథ్యంలో, ఏవియేషన్ కంపెనీలు కూడా పైలట్‌లు ధరించే టోపీలపై విభిన్న నిర్ణయాలను కలిగి ఉంటాయి. అయితే, కొన్ని కంపెనీలు మాత్రం తప్పనిసరిగా తమ పైలట్లు హ్యాట్ లను ధరించేలా చూస్తాయి. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాయి.

విమాన పైలట్లు టోపీ ధరిస్తారు ఎందుకు? అసలు ఈ టోపీ గురించి పైలట్లు ఏం చెబుతున్నారు..?

టోపీ ధరించడం అనేది పైలట్‌ల వ్యక్తిగత ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఈ విషయంలో ఒక్కో విమానయాన సంస్థ ఒక్కో విధమైన విధానాలను కలిగి ఉంటుంది. కాబట్టి దీనికి పైలట్ల ర్యాంక్ మరియు సీనియారిటీతో సంబంధం లేదు. అయితే, చాలా మంది పైలట్లు ధరించే హ్యాట్ ను బట్టి వారి ర్యాంక్ మరియు సీనియారిటీని జడ్జ్ చేసి, అపోహపడే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, June 13, 2022, 12:46 [IST]
English summary
What does airplane pilots say about their hats is it mandotary to wear a hat while flying the plane
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+