మీ కారు ముందు లేదా వెనుక వైపు GT అనే బ్యాడ్జ్ ఉందా..? అయితే, దాని అర్థం మరియు చరిత్ర ఏంటో తెలుసుకోండి..!!

ఒకప్పుడు హోదా మాత్రమే పరిగణించబడే కారు ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. మార్కెట్లో పెరిగిన తయారీదారులు మరియు వారు అందించే మోడళ్ల కారణంగా కార్ మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగింది. ఈ పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కార్ కంపెనీలు సరసమైన ధర నుండి ప్రీమియం ధర వరకూ వివిధ రకాల వాహనాలను అందుబాటులోకి తెచ్చాయి. ఆటోమొబైల్ విభాగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రస్తుతం భారతదేశం కూడా కీలకంగా ఉంది.

మీ కారు ముందు లేదా వెనుక వైపు GT అనే బ్యాడ్జ్ ఉందా..? అయితే, దాని అర్థం మరియు చరిత్ర ఏంటో తెలుసుకోండి..!!

సరే అదంతా అటుంచితే, కారుపై కనిపించే GT బ్యాడ్జ్‌ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఖరీదైన లగ్జరీ కార్లు మరియు స్పోర్ట్స్ కార్లపై మాత్రమే కనిపించే జిటి బ్యాడ్జ్ ఇప్పుడు, మిడ్-సైజ్ కార్లపై కూడా కనిపిస్తోంది. ఉదాహరణకు మనదేశంలో లభిస్తున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్ జిటి (Volksvagen Taigun GT) ని చెప్పుకోవచ్చు. బడ్జెట్ కార్ కంపెనీలు మినహా దాదాపు ప్రతి కార్ల తయారీదారు కూడా తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఒకటి లేదా అంతకన్నా GT బ్యాడ్జ్‌ కలిగిన కార్లను విక్రయిస్తుంటారు.

మీ కారు ముందు లేదా వెనుక వైపు GT అనే బ్యాడ్జ్ ఉందా..? అయితే, దాని అర్థం మరియు చరిత్ర ఏంటో తెలుసుకోండి..!!

మరి ఈ GT బ్యాడ్జ్‌ల వెనుక మర్మం ఏమిటి?

నిజానికి జిటి అనే పదానికి ఇప్పటికీ ఓ స్పష్టమైన నిర్వచనం లేదు. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ నేటి ప్రపంచంలో GT అక్షరాలా ఏదైనా కావచ్చు. ఈ పదానికి ఒకప్పుడు నిజమైన అర్థం ఉన్నప్పటికీ, దాని అర్థం 1980 కాలం నాటికి అదృశ్యం కావడం ప్రారంభమైంది. ఈ బ్యాడ్జ్ ను వాహనాలపై అధికంగా ఉపయోగించడం లేదా దానిని సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల మాత్రమే జరిగింది.

మీ కారు ముందు లేదా వెనుక వైపు GT అనే బ్యాడ్జ్ ఉందా..? అయితే, దాని అర్థం మరియు చరిత్ర ఏంటో తెలుసుకోండి..!!

కార్ల తయారీదారులు ఉత్పత్తి చేసే వాహనాలో సాధారణం కన్నా భిన్నంగా మరియు స్పోర్టీగా ఉండే కార్లను సూచించేందుకు ఈ జిటి బ్యాడ్జ్ ను ఉపయోగిస్తుంటారు. అయితే, ప్రస్తుత కాలంలో ఇది ప్రధానంగా నిర్దిష్ట ఆటోమేకర్‌పై ఆధారపడి ఉంటుంది. కొందరికి ఇది నేరుగా "స్పోర్ట్స్‌ కార్" అనే పదాన్ని సూచిస్తుంది, మరికొందరికి ఇది నిర్దిష్ట కార్ మోడల్ యొక్క సాధారణ తయారీ కంటే కొంచెం స్పోర్టివ్‌ గా ఉంటుందని సూచిస్తుంది.

మీ కారు ముందు లేదా వెనుక వైపు GT అనే బ్యాడ్జ్ ఉందా..? అయితే, దాని అర్థం మరియు చరిత్ర ఏంటో తెలుసుకోండి..!!

కొన్ని కార్ కంపెనీలు తయారు చేసిన అత్యంత వేగవంతమైన మరియు అత్యంత శక్తివంతమైన మోడళ్లపై కూడా ఈ జిటి బ్యాడ్జ్ కూడా కనిపిస్తుంది. ఇది సదరు కార్ మోడల్ యొక్క స్పోర్టీ వేరియంట్ నుండి పూర్తిగా స్ట్రీట్-లీగల్ రేస్ మెషీన్ వరకు ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు ఓ ఫెరారీ కారు మీద జిటి బ్యాడ్జ్ ఉందనుకుందాం, అలాగే మరో ఎంట్రీ లెవల్ కారు (ఉదాహరణకు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ జిటి)పై కూడా అలాంటి జిటి బ్యాడ్జింగే ఉందనుకుందాం. మరి ఇవి రెండూ ఒకటేనా? వీటి పనితీరు ఒకేలా ఉంటుందా? ఉండదు, ఎందుకంటే ఒకటి స్పోర్ట్స్ కార్ మరొకటి ప్యాసింజర్ కార్. వీటిలో ఉపయోగించే ఇంజన్స్, ఏరోడైనమిక్స్ భిన్నంగా ఉంటాయి.

మీ కారు ముందు లేదా వెనుక వైపు GT అనే బ్యాడ్జ్ ఉందా..? అయితే, దాని అర్థం మరియు చరిత్ర ఏంటో తెలుసుకోండి..!!

GT అంటే గ్రాన్ తురిస్మో లేదా గ్రాన్ టూరర్

మనం చూసే ఈ GT బ్యాడ్జ్ యొక్క అసలు అర్థం గ్రాండ్ తురిస్మో (Gran Turismo) లేదా గ్రాండ్ టూరర్ (Grand Tourer). దీనినే గ్రాన్ తురిస్మో లేదా గ్రాన్ టూరర్ అని కూడా పిలుస్తారు. గ్రాండ్ టూరర్ అనేది ఇటాలియన్ పదబంధం గ్రాన్ టూరిస్మో యొక్క ఆంగ్ల అనువాదంగా చెప్పుకోవచ్చు. ఇటాలియన్ భాషలో గ్రాన్ టురిస్మో అంటే "గ్రాండ్ టూర్" అని అర్థం. గ్రాండ్ టూర్ అనే ఈ పదం ఆటోమోటివ్ రంగానికి రాక మునుపు, యూరప్ చుట్టూ జరిగే సాంస్కృతిక పర్యటన కోసం దీనిని ఉపయోగించేవారు.

మీ కారు ముందు లేదా వెనుక వైపు GT అనే బ్యాడ్జ్ ఉందా..? అయితే, దాని అర్థం మరియు చరిత్ర ఏంటో తెలుసుకోండి..!!

ఇక దీనిని వాహనాలకు వర్తింపజేసిన తర్వాత, గ్రాండ్ టూరర్ అనేది సుదూర ప్రయాణాలకు సౌకర్యవంతంగా మరియు శక్తివంతంగా ఉండేందుకు ఉద్దేశించిన ఓ కార్ మోడల్ గా మారింది. సింపుల్ గా చెప్పాలంట్ జిటి (గ్రాండ్ టూరర్) బ్యాడ్జ్ ఇతర సాధారణ వాహనాలు మరియు పనితీరుతో కూడిన వాహనాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాలను సూచిస్తుంది. సాధారణంగా, ఈ బ్యాడ్జ్ కలిగిన వాహనాలు విలాసవంతమైన ఇంటీరియర్ మరియు రిఫైన్డ్ బాడీ డిజైన్‌తో సౌకర్యవంతమైన రైడ్‌ను అందిస్తూ, శక్తివంతమైన ఇంజన్ మరియు సమర్థవంతమైన పనితీరును కలిగి ఉంటాయి.

మీ కారు ముందు లేదా వెనుక వైపు GT అనే బ్యాడ్జ్ ఉందా..? అయితే, దాని అర్థం మరియు చరిత్ర ఏంటో తెలుసుకోండి..!!

GT ఎక్కడ పుట్టింది?

ఇదివరకు చెప్పుకున్నట్లుగానే జిటి అనేది ఓ ఇటాలియన్ పదం, కాబట్టి ఇది ఇటలీకే చెందుతుందని చాలా మంది చెబుతుంటారు. ఇక వాహనాలలో GT బ్యాడ్జ్ పేరును ఉపయోగించిన మొదటి ఆటోమొబైల్ బ్రాండ్ ఆల్ఫా రోమియో. ఇదొక ఇటాలియన్ కార్ కంపెనీ, ఈ సంస్థ తయారు చేసిన 6సి 1750 జిటి (6c 1750 GT) కారుపై తొలిసారిగా ఈ జిటి బ్యాడ్జ్ ను ఉపయోగించినట్లు చరిత్ర చెబుతోంది.

మీ కారు ముందు లేదా వెనుక వైపు GT అనే బ్యాడ్జ్ ఉందా..? అయితే, దాని అర్థం మరియు చరిత్ర ఏంటో తెలుసుకోండి..!!

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఆల్ఫా రోమియో 6సి 1750 జిటి కారును 1930 సంవత్సరంలో రెండు వేర్వేరు ఇంజన్ వేరియంట్‌లతో ఉత్పత్తి చేశారు. ఇందులో తక్కువ శక్తివంతమైన వేరియంట్ SOHC ఇంజన్‌ తో తయారు చేయబడింది మరియు దీనికి కేవలం టూరింగ్ అని మాత్రమే పేరు పెట్టారు. అయితే, ఇందులోని మరింత శక్తివంతమైన వేరియంట్ ను DOHC ఇంజన్‌ తో ప్రవేశపెట్టారు, ఈ వేరియంట్ కు జిటి పేరు పెట్టారు. ఈ ఆల్ఫా రోమియో 6సి జిటి ఆ కాలంలో పోడియం ముగింపులతో ప్రధాన రేసింగ్ ఈవెంట్‌లలో చాలా కీలకంగా నిలిచింది.

మీ కారు ముందు లేదా వెనుక వైపు GT అనే బ్యాడ్జ్ ఉందా..? అయితే, దాని అర్థం మరియు చరిత్ర ఏంటో తెలుసుకోండి..!!

ఇదండీ GT బ్యాడ్జ్ చరిత్ర. కార్ల తయారీదారులు తాము తయారు చేసే స్పోర్టీ వాహనాలకు కేవలం జిటి బ్యాడ్జ్ ను మాత్రమే కాకుండా తమ స్వంత పెర్ఫార్మెన్స్ బ్రాండ్లను కూడా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు మారుతి సుజుకి యొక్క ఆర్ఎస్, టాటా మోటార్స్ యొక్క జెటిపి, హ్యుందాయ్ యొక్క ఎన్-లైన్, కియా యొక్క జిటి-లైన్, టొయోటా యొక్క టిఆర్‌డి, బిఎమ్‌డబ్ల్యూ యొక్క ఎమ్‌స్పోర్ట్, మెర్సిడెస్ బెంజ్ యొక్క ఏఎమ్‌జి, ఆడి యొక్క ఆర్ఎస్ మరియు జాగ్వార్ యొక్క ఎస్‌విఓ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయా కంపెనీలు తయారు చేసే స్పోర్టీ మరియు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ కార్లను సూచిస్తాయి.

Most Read Articles

English summary
What does gt stands for in cars meaning and the history of gt badge on car
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X