భారీ విమాన ప్రమాదం... 379 ప్రయాణికులను నిమిషాల వ్యవధిలో రక్షించిన భద్రతా బలగాలు.. కానీ..!
కొత్త సంవత్సరంలో తొలి రెండురోజులు జపాన్ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేసింది. తొలిరోజు భారీ భూకంపం సంబవించగా.. రెండో రోజు జపాన్ రాజధాని టోక్యోలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విమానం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 379 ప్రయాణికులు మరియు ఎయిర్‌లైన్ సిబ్బంది ఉన్నారు. ఇంత భారీ ప్రమాదం జరిగినా.. మొత్తం ప్రయాణికులు సహా సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు.
మంగళవారం అర్ధరాత్రి సమయంలో జపాన్ రాజధాని టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్టులో JAL 516 విమానం ల్యాండ్ ( Tokyo flights crash ) అయింది. అయితే అదే రన్‌వే పైన ఉన్న జపాన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ కూడా బయలుదేరేందుకు సిద్ధమైంది. అయితే కోస్ట్‌గార్డు ఎయిక్‌క్రాఫ్ట్‌కు కొద్ది దూరంలో JAL 516 విమానం ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.

అయితే అనుహ్యంగా రెండు విమానాలు ఢీకొన్నాయి. దీంతో పౌరవిమానం సహా కోస్ట్‌గార్డ్ విమానంలోనూ మంటలు చెలరేగాయి. దీంతో ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మంటలు చెలరేగిన విమానంలోని ప్రయాణికులను రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. విమానం వెనుకవైపు డోర్ ద్వారా ఎయిర్‌బ్యాగ్‌ను అమర్చారు. దీంతో వారంతా తక్కువ సమయంలోనే సురక్షితంగా బయటపడ్డారు.
అయితే ఈ ప్రమాదంలో కోస్ట్‌గార్డ్ విమానం మంటల్లో కాలిపోగా.. అందులోని 5 సిబ్బంది మరణించారు. ఆ సమయంలో ఆ విమానంలో 8 మంది ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు సిబ్బంది మెరుపు వేగంతో స్పందించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌లైన్స్ సిబ్బందికి ఇచ్చిన ప్రత్యేక శిక్షణ, రిహార్సల్స్ ఇందుకు కారణంగా తెలుస్తోంది.

గతం నుంచి పాఠాలు : 1985 టోక్యోలో భారీ విమానం ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో సుమారు 520 మంది మరణించారు. దీంతో ఆ దేశ ఏవియేషన్ రంగంలో కీలక భద్రత మార్పులకు శ్రీకారం చుట్టారు. జపాన్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక భద్రతా చర్యలను ప్రారంభించింది. మరియు భద్రతా సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చింది. దీంతో తాజా విమానం ప్రమాదంలో ప్రయాణికులు సహా సిబ్బందిని సురక్షితంగా బయటపడ్డారు.
భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం : సరైన సమయంలో ఎయిర్‌పోర్టు సిబ్బంది స్పందించడంతో భారీ ప్రమాదం తప్పింది. లేకుంటే భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉండేది. గతం నుంచి పాఠాలు నేరుకున్న జపాన్ ఏవియేషన్ విభాగం.. సిబ్బందికి మెరుగైన శిక్షణ సహా ఎప్పటికప్పుడు రిహార్సల్స్ సహా అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా ప్రమాద తీవ్రతను నియంత్రించగలిగారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








