కార్లలో ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?

కార్లలో ఒకప్పుడు స్టీరియో సిస్టమ్ ఉండటమే పెద్ద విషయంగా పరిగణించేవారు. ఆ తర్వాత వచ్చిన బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీ, ఇన్ఫోటైన్‌మెంట్ రంగంలో సరికొత్త ట్రెండ్స్‌ను సృష్టించింది. ఇప్పుడు లేటెస్ట్‌గా దాదాపు అన్ని కార్లలో కార్ కనెక్టింగ్ టెక్నాలజీ బాగా పాపులారిటీని దక్కించుకుంది.

కార్లలో ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న దాదాపు అన్ని కార్లలో ఈ తరహా కనెక్టివిటీ ఫీచర్లు లభిస్తున్నాయి. ఈ కనెక్టివిటీ ఫీచర్లలో వివిధ ఆటోమొబైల్ కంపెనీలు ఆఫర్ చేసే తమ స్వంత కనెక్టింగ్ టెక్నాలజీలతో పాటుగా మార్కెట్లో బాగా పాపులర్ అయిన ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే వంటి ఇతర కనెక్టింగ్ టెక్నాలజీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

కార్లలో ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?

ఈ కథనంలో ఆండ్రాయిడ్ ఆటో కనెక్టింగ్ ఫీచర్ మరియు అదెలా పనిచేస్తుందనే విషయాలను తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ 2020 ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన కార్ కనెక్టింగ్ టెక్నాలజీ ఫీచర్. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ కనెక్టింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది.

MOST READ:ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరూ చూడండి

కార్లలో ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?

ఆండ్రాయిడ్ ఆటో అంటే ఏమిటి?

ఆండ్రాయిడ్ ఆటో అనేది కారులోని ఎంటర్‌టైన్‌మెంట్ (వినోదం) మరియు నావిగేషన్ హెడ్ యూనిట్ కోసం డిజైన్ చేయబడిన డ్రైవింగ్ కంపానియన్ యాప్. గూగుల్ సంస్థ ఈ యాప్‌ను డెవలప్ చేసింది. ఆండ్రాయిడ్ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్)తో నడిచే అన్ని రకాల స్మార్ట్‌ఫోన్లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

కార్లలో ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?

ఈ యాప్ ప్రధాన లక్షణం డ్రైవర్‌కు అవసరమైన వివిధ రకాల సమాచారాన్ని తెలియజేయటం మరియు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేతులు ఉపయోగించకుండా (హ్యాండ్స్ ఫ్రీగా) కొన్ని ఫంక్షన్లను కంట్రోల్ చేయటం. వాయిస్ కమాండ్స్ ద్వారా కాల్స్ చేయటం, కాల్ ఆన్సర్, కాల్ డిస్‌కనెక్ట్, మ్యూజిక్, మెసేజెస్ మొదలైన వాటిని ఈ యాప్ సాయంతో కంట్రోల్ చేయవచ్చు.

MOST READ:మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

కార్లలో ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?

అంతేకాకుండా, ఈ యాప్ సాయంతో కారులోని ఆడియో సిస్టమ్‌ను కూడా కంట్రోల్ చేయవచ్చు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ సెన్సార్ ఇన్‌పుట్ మరియు అవుట్‌పుట్, ఇంధన స్థాయి, వీల్ స్పీడ్, హై క్వాలిటీ కార్ జిపిఎస్ యాంటెన్నా, డైరెక్షనల్ స్పీకర్ మొదలైన ఫీచర్లను వాహన డేటాకు ఆదేశించే అవకాశం ఉంది.

కార్లలో ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?

ఆండ్రాయిడ్ ఆటో ఎలా పనిచేస్తుంది?

కారు డ్యాష్‌బోర్డ్‌లో అమర్చిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో డిఫాల్ట్‌గా ఆఫర్ చేసే ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ ఉంటుంది. యూజర్లు తమ స్మార్ట్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకున్న ఆండ్రాయిడ్ ఆటో యాప్‌ను బ్లూటూత్ కనెక్టివిటీ లేదా డేటా కేబుల్ (చార్జింగ్ కేబుల్) సాయంతో కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు.

MOST READ:విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

కార్లలో ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?

ఒక్కమాటలో చెప్పాలంటో ఆండ్రాయిడ్ ఆటో మీ ఫోన్‌ను ఓ కాస్టింగ్ డివైజ్‌గా మారుస్తుంది. అయితే, ఫోన్‌స్క్రీన్ మొత్తాన్ని ఇది కారులోని స్క్రీన్‌పై డిస్‌ప్లే చేయదు. కాల్స్, మెసేజెస్, మ్యూజిక్ వంటి కొన్ని అంశాలను మాత్రమే ఇది కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌పై ప్రదర్శిస్తుంది.

కార్లలో ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?

కొన్ని కార్లలో అయితే, ఫోన్ మిర్రరింగ్ ఆప్షన్ లేదా హెచ్‌డిఎమ్ఐ పోర్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఫోన్ స్క్రీన్ మొత్తాన్ని కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌పై యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది.

MOST READ:ట్రాఫిక్ ఫైన్ అడిగితే మంగళ సూత్రం ఇచ్చిన మహిళ.. ఇది ఎక్కడో కాదు, మన బెంగళూరులోనే

కార్లలో ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?

ఆండ్రాయిడ్ ఆటో యూజర్లు యుఎస్‌బి కేబుల్ సాయంతో మీ స్మార్ట్ ఫోన్‌ను మీ కారు సిస్టమ్ హెడ్‌కు కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత, మీరు డాష్ బోర్డ్ స్క్రీన్‌పై కనిపించే ఆండ్రాయిడ్ ఆటో చిహ్నంపై క్లిక్ చేసి అందులోని ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ అనువర్తనం టచ్ ప్యానెల్ మరియు కీ (బటన్) ఆధారిత హెడ్ యూనిట్ సిస్టమ్ రెండింటిని సపోర్ట్ చేస్తుంది.

కార్లలో ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?

ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లు మరియు ప్రయోజనాలు ఏమిటి?

ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ మీ స్మార్ట్ ఫోన్‌ను మీ కారు యొక్క ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కలుపుతుంది. దీని సాయంతో మీరు గూగుల్ మ్యాప్స్, గూగుల్ ప్లే మ్యూజిక్, స్పాటిఫై మొదలైన ఆండ్రాయిడ్ ఆటో సపోర్టెడ్ యాప్స్‌ను ఉపయోగించవచ్చు.

కార్లలో ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?

అంతేకాకుండా, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇన్ఫోటైన్‌మెంట్ స్కీన్ నుండే నేరుగా కాల్స్ మరియు మెసేజెస్‌లను కూడా కంట్రోల్ చేయవచ్చు. హై-ఎండ్ కార్లలో ఆఫర్ చేసే మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌పై అమర్చిన కంట్రోల్స్ సాయంతో కూడా వివిధ రకాల ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు. ఇందులోని గూగుల్ అసిస్టెంట్ సాయంతో వాయిస్ ద్వారా కమాండ్స్ కూడా చేయవచ్చు.

Most Read Articles

English summary
What Is Android Auto And How It Work: All You Need To Know About Car Connecting Technology. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X