QR కోడ్ స్కాన్ చేస్తే చాలు మీ కారు బ్యాటరీ హిస్టరీ మొత్తం తెలిసిపోతుంది.. త్వరలో కేంద్రం కొత్త రూల్స్
భారతదేశంలో బ్యాటరీలకు ఆధార్ కార్డు లాంటి ఒక వ్యవస్థను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విధానం ద్వారా బ్యాటరీ తయారైన సంవత్సరం, దాని వయస్సు, అది ఎలాంటి బ్యాటరీ, ఎలా తయారు చేశారు వంటి వివరాలను వినియోగదారులు ఎలాంటి సమస్యలు లేకుండా రియల్ సమాచారం తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వాహన తయారీ కంపెనీలు బ్యాటరీలను వాహనాల్లో అమరుస్తున్నప్పటికీ వాటి తయారీ క్వాలిటీకి సంబంధించిన సమాచారం వినియోగదారులకు అందడం లేదు. ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీనే అత్యంత ఖరీదైన భాగం కాబట్టి, ప్రజలు దాని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఈ సమస్యకు పరిష్కారం కేంద్ర ప్రభుత్వ థింక్ ట్యాంక్ అయిన నీతి ఆయోగ్ ఒక కొత్త పరిష్కారాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. దీని ప్రకారం, భారతదేశంలో తయారుచేసే బ్యాటరీలకు బ్యాటరీ పాస్‌పోర్ట్ అనే విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీని ప్రకారం భారతదేశంలో విక్రయించే 2kWh అంతకంటే ఎక్కువ కెపాసిటీ గల అన్ని బ్యాటరీలలో ఈ బ్యాటరీ పాస్‌పోర్ట్ ఉండాలి.
నిపుణులు దీనిని బ్యాటరీకి ఆధార్ అని పిలుస్తున్నారు. ఈ సమాచారాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది. దీని ప్రకారం.. ఈ బ్యాటరీ పాస్‌పోర్ట్‌లో ఒక బ్యాటరీ లైఫ్ టైం మొత్తం సమాచారం డిజిటల్‌గా నమోదు చేయబడుతుంది. బ్యాటరీ తయారుచేసిన ప్రదేశం, దాని పనితీరు, తయారీ విధానం, అది రీసైకిల్ చేయబడిందా లేదా వంటి అనేక వివరాలు ఇందులో ఉంటాయి.

ఈ బ్యాటరీలపై ఒక QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసిన వారికి ఈ వివరాలన్నీ అందుతాయి. దీనివల్ల కొనుగోలుదారులు బ్యాటరీ గురించి బాగా తెలుసుకుని, ఆ తర్వాత దాన్ని ఉపయోగించగలరు. ముఖ్యంగా బ్యాటరీ స్వాప్పింగ్‌లో ఉపయోగించే బ్యాటరీలకు ఈ టెక్నాలజీ చాలా సహాయకరంగా ఉంటుందని అంచనా.
ఇది 2027 ఫిబ్రవరి నుండి అమల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలా బ్యాటరీకి ఆధార్ కార్డు ఇచ్చే విధానం భారతదేశంలో మొదటిసారిగా రావడం లేదు. అంతకుముందు యూరప్‌లో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. భారతదేశంలో ఈ విధానం బ్యాటరీ సేఫ్టీ, క్వాలిటీ, ఎగుమతులను దృష్టిలో ఉంచుకొని తీసుకు వచ్చారు.

ఈవీ వాహనాల్లో బ్యాటరీ ధర దాదాపు 40 శాతం వరకు ఉంటుంది కాబట్టి, ప్రజలు బ్యాటరీ గురించి స్పష్టమైన అవగాహన, సమాచారాన్ని కలిగి ఉండడం చాలా అవసరం. ఈ బ్యాటరీ పాస్‌పోర్ట్ దీనిని నిర్ధారిస్తుంది. ఇది బ్యాటరీ భద్రతను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి కచ్చితంగా సహాయపడుతుందని ఆశించవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారతదేశంలో బ్యాటరీ టెక్నాలజీ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. వాహన తయారీ కంపెనీలన్నీ బ్యాటరీని ప్రధాన ముడిసరుకుగా చేసుకొని వాహనాలను తయారు చేస్తున్న తరుణంలో ఈ బ్యాటరీ పాస్‌పోర్ట్ టెక్నాలజీ ఖచ్చితంగా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఆశించవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








