'బ్లాక్ బాక్స్' అంటే నల్లగా ఉంటుందా? అసలు విమానాలు, హెలికాప్టర్లలో వాటి ఉపయోగం ఏంటి?

విమానం లేదా హెలికాప్టర్ ప్రమాదాలు సంభవించినప్పుడు మనం తరచూ 'బ్లాక్ బాక్స్' (Black Box) అనే పదం వింటూ ఉంటాం. అధికారులు ఈ బ్లాక్ బాక్స్ కోసం ప్రమాదం జరిగిన స్థలాన్ని పూర్తిగా జెల్లడ పడుతారు. అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? విమాన రంగంలో ఎందుకు దీనికి అంత ప్రత్యేకత? అసలు ఇదెలా పనిచేస్తుంది? ప్రమాదం తర్వాత బ్లాక్ బాక్స్ దొరికితే అధికారులు ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ కథనం.

'బ్లాక్ బాక్స్' అంటే నల్లగా ఉంటుందా? అసలు విమానాలు, హెలికాప్టర్లలో వాటి ఉపయోగం ఏంటి?

సాధారణంగా గగనతలంలో ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లు వంటివి దరదృష్టవశాత్తు ప్రమాదానికి గురైతే, ఆ ప్రమాదానికి గల కారణాన్ని అంచనా వేయడం లేదా ఆ ప్రమాదం జరిగే చివరి క్షణాల్లో పైలట్ లేదా కాక్‌పిట్ లోని సభ్యులు మాట్లాడుకునే చివరి సంభాషను తెలుసుకోవడానికి ఈ బ్లాక్ బాక్స్ చాలా కీలమైన పరికరం. పేరుకు తగినట్లుగా బ్లాక్ బాక్స్ అనేది నలుపు రంగులో ఉండదు, ఇది ఇంటర్నేషనల్ ఆరెంజ్ అనే ప్రత్యేకమైన రంగులో ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే, ఇదొక ఫ్లైట్ డేటా రికార్డింగ్ పరికరం.

'బ్లాక్ బాక్స్' అంటే నల్లగా ఉంటుందా? అసలు విమానాలు, హెలికాప్టర్లలో వాటి ఉపయోగం ఏంటి?

తమిళనాడులోని కూనూర్ సమీపంలో ఎమ్ఐ-17 వి5 ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తో సహా మరో 12 మంది ఆర్మీ అధికారులు మరణించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటని తెలుసుకునేందుకు అధికారులు సదరు హెలికాప్టర్ యొక్క బ్లాక్ కోసం అన్వేషణ ప్రారంభించారు. తాజా సమాచారం ప్రకారం, అధికారులకు ఈ బ్లాక్ బాక్స్ దొరికినట్లు తెలుస్తోంది.

'బ్లాక్ బాక్స్' అంటే నల్లగా ఉంటుందా? అసలు విమానాలు, హెలికాప్టర్లలో వాటి ఉపయోగం ఏంటి?

ఈ బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తమై ఉన్న సమాచారం ద్వారా ప్రమాదానికి గల ప్రధాన కారణాన్ని ఐఏఎఫ్ సాంకేతిక బృందం తెలుసుకోనుంది. ఈ బ్లాక్ బాక్స్ ను ఫ్లైట్ డేటా రికార్డర్ గా కూడా పిలుస్తారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన స్థలానికి దాదాపు 30 అడుగుల దూరంలోనే ఈ బ్లాక్ బాక్స్ దొరికినట్లు సమాచారం. ఈ బ్లాక్ బాక్స్ లో హెలికాప్టర్ ఎగుతురున్న వేగం, ప్రమాద సమయంలో కాక్‌పిట్ లో జరిగిన సంభాషణలు, గాలి ఒత్తిడి వంటి సుమారు 88 ముఖ్యమైన విషయాలకు సంబంధించిన డేటాను ఇది రికార్డ్ చేస్తుంది.

'బ్లాక్ బాక్స్' అంటే నల్లగా ఉంటుందా? అసలు విమానాలు, హెలికాప్టర్లలో వాటి ఉపయోగం ఏంటి?

ప్రమాదంలో విమానం లేదా హెలికాప్టర్ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ ఈ బ్లాక్ బాక్స్ మాత్రం పాడవకుండా ఉండేలా దీనిని రూపొందిస్తారు. ఇది నీటిని మరియు అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుంటుంది. దాదాపు 1950 కాలం నుంచి విమాన ప్రమాదాలకు గల కారణాలను గుర్తించడంలో బ్లాక్ బాక్స్ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఆ సమయంలో వాణిజ్య విమానం అయిన కామెట్ తరచుగా ప్రమాదాలకు గురవుతూ ఉండేది. దీంతో, సదరు విమానంలోని భద్రతా లోపాలను గుర్తించేందుకు ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త డేవిడ్ వారెన్ ఈ బ్లాక్ బాక్స్ అనే ఆలోచనకు జీవం పోశారు.

'బ్లాక్ బాక్స్' అంటే నల్లగా ఉంటుందా? అసలు విమానాలు, హెలికాప్టర్లలో వాటి ఉపయోగం ఏంటి?

మొదట్లో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఆలోచనను ఆమోదించడానికి ఇష్టపడలేదు. ఇది పైలట్ల వ్యక్తిగత వ్యవహారాలపై ప్రభావం చూపుతుందని భావించారు. అయితే, 1960లో ట్రాన్స్-ఆస్ట్రేలియన్ విమానం కూలిపోయిన తర్వాత, అన్ని విమానాల్లో బ్లాక్ బాక్స్‌ ను అమర్చడం తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. ఈ తర్వాతి మూడేళ్లలో అమెరికా ప్రభుత్వం కూడా విమానాలలో బ్లాక్‌ బాక్స్‌ ను అమర్చడాన్ని తప్పనిసరి చేసింది.

'బ్లాక్ బాక్స్' అంటే నల్లగా ఉంటుందా? అసలు విమానాలు, హెలికాప్టర్లలో వాటి ఉపయోగం ఏంటి?

బ్లాక్ బాక్స్‌లో రెండు రకాల పరికరాలు ఉంటాయి. అందులో ఒకటి పైలట్ల సంభాషణలను రికార్డ్ చేసే సివిఆర్ (CVR), మరొకటి విమానం ఇంజన్ యొక్క ఆపరేషన్, వేగం, ఎత్తు మరియు నియంత్రణ పరికరాల గురించి వివిధ డేటాను రికార్డ్ చేసే ఎఫ్‌డిఆర్ (FDR). కొన్ని రకాల విమానాలలో ఈ రెండు పరికరాలను ఒకే కాన్ఫిగరేషన్‌లో కూడా ఉంచవచ్చు. విమానాల్లో ఉపయోగించే బ్లాక్ బాక్సు ల ధర కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. ఒక బ్లాక్ బాక్స్ ధర సుమారు రూ. 10 లక్షల వరకు ఉంటుందని అంచనా.

'బ్లాక్ బాక్స్' అంటే నల్లగా ఉంటుందా? అసలు విమానాలు, హెలికాప్టర్లలో వాటి ఉపయోగం ఏంటి?

బ్లాక్ బాక్స్ లు విమాన ప్రమాదాలకు ఖచ్చితమైన కారణాన్ని కనుగొనడంలో సహాయపడతాయి మరియు భవిష్యత్తులో అలాంటి సమస్యలను సరిచేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రారంభంలో, మాగ్నెటిక్ టేప్ సాయంతో పైలట్ల సంభాషణలు మరియు విమాన సమాచారాన్ని రికార్డ్ చేసేవారు. అయితే, సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందడంతో, ఇందులో మెమరీ చిప్స్ అనే చిన్న పాటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. ప్రమాద సమయాల్లో ఇవి అంత సులువుగా నాశనం కావు మరియు ఎంతటి వేడినైనా తట్టుకోగలవు.

'బ్లాక్ బాక్స్' అంటే నల్లగా ఉంటుందా? అసలు విమానాలు, హెలికాప్టర్లలో వాటి ఉపయోగం ఏంటి?

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బ్లాక్ బాక్స్‌ లోని పరికరాల్లో పైలట్ సంభాషణల్లో చివరి రెండు గంటలు మాత్రమే రికార్డ్ చేయబడతాయి. అదే సమయంలో, FDR పరికరం చివరి 25 గంటల విమానానికి సంబంధించిన డేటాను రికార్డ్ చేస్తుంది. విమానం యొక్క దిశ, వేగం, ఇంధన స్థాయి మరియు ఎత్తుతో సహా అనేక రకాల సమాచారం ఇందులో రికార్డ్ చేయబడుతుంది. రికార్డ్ 91కి సరిపోయే అధునాతన బ్లాక్ బాక్స్‌లు 2008 నుండి తప్పనిసరి చేయబడ్డాయి, ఇందులో దాదాపు 1,000 రకాల డేటా రికార్డ్ చేయబడుతుంది.

'బ్లాక్ బాక్స్' అంటే నల్లగా ఉంటుందా? అసలు విమానాలు, హెలికాప్టర్లలో వాటి ఉపయోగం ఏంటి?

ఒకవేళ విమానం సముద్రంలో కూలిపోయినట్లయితే, బ్లాక్ బాక్స్‌లోని ULB పరికరానికి సిగ్నల్ ఇవ్వడం ద్వారా శోధన బృందం దాని స్థానాన్ని గుర్తించగలదు. అయితే, ఈ పరికరంలోని బ్యాటరీ కేవలం 30 రోజులు మాత్రమే పనిచేస్తుంది. ఆలోగా బ్లాక్ బాక్స్ ని గుర్తించలేకపోతే ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవటం సాధ్యం కాకపోవచ్చు. విమానాలు ప్రమాదవశాత్తు కూలిపోయినప్పుడు దాదాపుగా అనేక సందర్భాల్లో ముందు భాగం ఎక్కువగా దెబ్బతింటుంది. అందుకే, ఈ బ్లాక్ బాక్స్ ఎక్కువగా విమానం యొక్క వెనుక భాగంలో అమర్చుతారు.

'బ్లాక్ బాక్స్' అంటే నల్లగా ఉంటుందా? అసలు విమానాలు, హెలికాప్టర్లలో వాటి ఉపయోగం ఏంటి?

బ్లాక్ బాక్సులు 5 నిమిషాల పాటు 1,100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను మరియు 5,000 పౌండ్ల నీటి ఒత్తిడిని తట్టుకునేలా రూపొందించబడ్డాయి. అంతేకాకుండా, ఇది సముద్ర మట్టానికి 20,000 అడుగుల లోతులో కూడా నీటి ఒత్తిడిని తట్టుకోగలదు. విమాన ప్రమాదాల్లో బ్లాక్ బాక్స్ అతి ముఖ్యమైనది అయితే, కొన్ని పెద్ద ప్రమాదాల్లో ఇది చాలా వరకూ లభించకపోవచ్చు. ఉదాహరణకు అమెరికాలో ట్విన్‌ టవర్‌ పై జరిగిన దాడుల సమయంలో కూడా రెండు విమానాల్లోని బ్లాక్‌ బాక్సులు లభ్యం కాలేదు.

'బ్లాక్ బాక్స్' అంటే నల్లగా ఉంటుందా? అసలు విమానాలు, హెలికాప్టర్లలో వాటి ఉపయోగం ఏంటి?

ఈ నేపథ్యంలో, సాంకేతికత శరవేగంగా పెరిగిపోవడంతో పైలట్ల సంభాషణలను శాటిలైట్ల సాయంతో రియల్ టైమ్ కంట్రోల్ రూమ్‌లలో రికార్డు చేసే ప్రయత్నం చేయాలన్న ఆలోచన పుట్టుకొచ్చింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వలన ఇది పూర్తిస్థాయిలో అమలులోకి రాలేకపోయింది.

Most Read Articles

English summary
What is black box in aircrafts and how it works
Story first published: Monday, December 13, 2021, 10:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X