రైల్వేలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థ గజరాజ్ సురక్ష.. ఏనుగుల ప్రాణాలను ఎలా కాపాడుతుందా..?

భారతీయ రై‌ల్వే చరిత్రలో ( Indian railways ) జరిగిన ప్రమాదాల్లో రైళ్లు ఢీకొని సుమారు 200 ఏనుగులు మరణించినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనల్లో రెండు వైపులు నష్టం జరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అటు ఏనుగులు మరణిస్తుండగా.. రైళ్లు కూడా దెబ్బతింటున్నాయి. మరియు ప్రయాణికులకు కూడా గాయాలవుతున్నాయి.

అకస్మాత్తుగా బ్రేకుల వేయడం కారణంగా.. : హైస్పీడ్‌ రైళ్లు ప్రయాణిస్తున్న సమయంలో ఏనుగులు వంటి భారీ జంతువులు పట్టాలు దాటుతున్నట్లు గుర్తించిన, వెంటనే రైళ్లను నిలిపేసేందుకు అవకాశం ఉండదు. అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల రైళ్లు పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది. దీంతో ప్రాణనష్టం తప్పడం లేదు.

gajraj suraksha technology

దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ : ఇలాంటి ఘటనలకు చెక్‌ పెట్టేందుకు భారతీయ రైల్వే దేశీయంగా అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. గజరాజ్‌ సురక్ష ( Gajraj suraksha ) పేరుతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత టెక్నాలజీని ప్రవేశపెట్టింది. సుమారు 99.5 కచ్చితత్వంతో పనిచేస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

స్టేషన్‌ మాస్టర్‌ను అప్రమత్తం చేస్తుంది : ఈ గజరాజ్‌ సురక్ష టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే.. పట్టాల సమీపంలో ఏనుగుల కదలికలను గుర్తిస్తుంది. వెంటనే సమీపంలోని స్టేషన్‌ మాస్టర్‌ను అలారం ద్వారా అప్రమత్తం చేస్తుంది. ఆ స్టేషన్‌ మాస్టర్‌ ఏనుగుల కదలికలను గుర్తించిన ప్రాంతం గుండా ప్రయాణిస్తున్న రైళ్ల లోకో పైలెట్‌లను అప్రమత్తం చేస్తారు.

99.5 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుంది : గజరాజ్‌ సురక్ష టెక్నాలజీ 99.5 శాతం ఏనుగుల ద్వారా ఏర్పడే ప్రమాదాలను నివారిస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ టెక్నాలజీలో సిగ్నల్‌ల బదిలీ కోసం ఆప్టికల్‌ కేబుల్‌లను ఏర్పాటు చేశారు. ఏనుగుల ప్రకంపనల ద్వారా సంకేతాలను గుర్తించి తదనుగుణంగా స్టేషన్‌ మాస్టర్‌ను అలారం ద్వారా అప్రమత్తం చేస్తుంది.

ఈ రాష్ట్రాల్లో తొలుత అమలు : ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత గజరాజ్‌ సురక్ష టెక్నాలజీ.. గరిష్ఠంగా 200 మీటర్ల దూరంలో ఏనుగులు ట్రాక్‌లను దాటడం లేదా దాటేందుకు ప్రయత్నించడాన్ని గుర్తిస్తుంది. ఈ గజరాజ్‌ సురక్ష టెక్నాలజీని తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్, ఒడిశా, అస్సాం, కేరళ, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో అమలు చేయనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.

తక్కువ వ్యయం మరియు సులభంగా ఇన్‌స్టాల్‌ చేయడం : గజరాజ్ సురక్ష టెక్నాలజీని తక్కువ ఖర్చులో సులభంగా ఏర్పాటుచేయవచ్చు. ఏనుగుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో వచ్చే 8 నెలల్లో ఈ టెక్నాలజీని ఇన్‌స్టాల్‌ చేయాలని భారతీయ రైల్వే భావిస్తోంది. 700 కిలోమీటర్లకు రూ.181 కోట్ల వ్యయం అవుతుందని తెలుస్తోంది.

ఏనుగుల మరణాల సంఖ్యను తగ్గిస్తుంది : ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత గజరాజ్‌ సురక్ష టెక్నాలజీ.. రైలు ప్రమాదాల కారణంగా సంభవించే ఏనుగుల మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఫలితంగా జీవ వైవిద్యాన్ని కాపాడుతుందని భారతీయ రైల్వే అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, November 30, 2023, 17:03 [IST]
English summary
What is gajraj suraksha how this safeguard elephants from train
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+