Global NCAP క్రాష్ టెస్ట్ అంటే ఏమిటి? క్రాష్ అయిన కార్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

భారతదేశంలో కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు సేఫ్టీ విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆటోమొబైల్ కంపెనీలు కూడా సురక్షితమైన కార్లను తయారు చేయడంపై దృష్టి పెట్టాయి. ఇటీవలి కాలంలో మనం కార్ల సేఫ్టీ విషయంలో గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) క్రాష్ టెస్టుల గురించి మరియు అందులో కార్లు పొందే సేఫ్టీ రేటింగ్‌ల గురించి ఎక్కువగా వింటున్నాం.

Global NCAP క్రాష్ టెస్ట్ అంటే ఏమిటి? క్రాష్ అయిన కార్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

కార్ల తయారీ సంస్థలు కూడా తమ కార్లు ఈ క్రాష్ టెస్టులో 5-స్టార్ లేదా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకున్నట్లు ప్రచారం కూడా చేస్తున్నాయి. అసలు కార్లను ఎందుకు క్రాష్ టెస్ట్ చేస్తారు, వీటికి సేఫ్టీ రేటింగ్ ఎలా ఇస్తారు, క్రాష్ టెస్టులో ఉపయోగించే కార్ల యొక్క ఖర్చును ఎవరు భరిస్తారు. ఈ స్టూడియో క్రాష్ టెస్ట్ ఫలితాలు రియల్ వరల్డ్ క్రాష్ లతో సమానంగా ఉంటాయా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ కథనం.

Global NCAP క్రాష్ టెస్ట్ అంటే ఏమిటి? క్రాష్ అయిన కార్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

ఒకప్పుడు భారతదేశంలో కస్టమర్లు చవక ధర కలిగిన కార్లకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే వారు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా కస్టమర్లలో కారు భద్రత గురించి విస్తృతమైన అవగాహన వచ్చింది. కారు సేఫ్టీ విషయంలో కస్టమర్లలో అవగాహన కల్పించడంలో గ్లోబల్ ఎన్‌క్యాప్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించిందనే చెప్పాలి.

Global NCAP క్రాష్ టెస్ట్ అంటే ఏమిటి? క్రాష్ అయిన కార్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

గ్లోబల్ ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ పరీక్షలు మరియు తదుపరి సేఫ్టీ రేటింగ్‌లు ఈ అవగాహన కల్పనకు దోహదం చేశాయి. క్రాష్ పరీక్షలు మరియు వీడియో ఆధారాల సాయంతో ప్రజలు సదరు కారు యొక్క భద్రతా పారామితుల పరిమాణాల గురించి బాగా అర్థం చేసుకోగలిగారు.

Global NCAP క్రాష్ టెస్ట్ అంటే ఏమిటి? క్రాష్ అయిన కార్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

గ్లోబల్ ఎన్‌క్యాప్ ఎలా పని చేస్తుంది?

మీ సమాచారం కోసం, గ్లోబల్ ఎన్‌క్యాప్ అనేక ఒక ప్రైవేట్ మరియు స్వతంత్ర సంస్థ. ఇది ప్రైవేట్ కంపెనీ కాబట్టి, కార్ల సేఫ్టీ రేటింగ్ విషయంలో ఈ సంస్థ ఎంత మేర పారదర్శకంగా ఉంటుంది, అసలు ఇది వెల్లడించే ఫలితాలు నిజమైనవేనా వంటి అనేక ప్రశ్నలు చాలా మంది మదిలో తలెత్తవచ్చు. ఈ విషయంలో ప్రజల్లో మరింత పారదర్శకతను తీసుకురావడానికి, గ్లోబల్ ఎన్‌క్యాప్ స్వచ్ఛంద పరీక్ష ప్రక్రియలో పరీక్ష కోసం కార్లను సేకరించే పూర్తి ప్రక్రియను వెల్లడించింది.

Global NCAP క్రాష్ టెస్ట్ అంటే ఏమిటి? క్రాష్ అయిన కార్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

ఇందులో భాగంగా, తయారీదారు నుండి అభ్యర్థనను స్వీకరించిన తర్వాత గ్లోబల్ ఎన్‌క్యాప్ యొక్క పరీక్ష ప్రక్రియ (క్రాష్ టెస్ట్ ప్రాసెస్) ప్రారంభమవుతుంది. ఇది పూర్తిగా స్వచ్ఛంద ప్రక్రియ, దీనిలో ఒక కారు తయారీదారు పరీక్ష కోసం ఒక నిర్దిష్ట మోడల్‌నిఅడుగుతాడు. అయితే, ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సంస్థ సదరు తయారీదారు ఏదైనా కారును ఎంచుకోవచ్చు.

Global NCAP క్రాష్ టెస్ట్ అంటే ఏమిటి? క్రాష్ అయిన కార్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

కార్ల తయారీదారు నుండి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండటానికి, గ్లోబల్ ఎన్‌క్యాప్ ద్వారా ఈ కారు ఎంపిక జరుగుతుంది. ఒకవేళ ఆ కారు ఇప్పటికే అమ్మకానికి అందుబాటులో ఉన్నట్లయితే, గ్లోబల్ ఎన్‌క్యాప్ సంస్థ అజ్ఞాతంగా ఏదైనా డీలర్‌షిప్ నుండి యాదృచ్ఛికంగా క్రాష్ టెస్ట్ కోసం కాల్ చేయవచ్చు. అదే, ఇంకా మార్కెట్లో విడుదల కాని కారు అయితే, ఇది యాదృచ్ఛికంగా ప్లాంట్ నుండి నేరుగా ఎంపిక చేయబడుతుంది.

Global NCAP క్రాష్ టెస్ట్ అంటే ఏమిటి? క్రాష్ అయిన కార్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

సింపుల్‌గా చెప్పాలంటే, క్రాష్ టెస్ట్ కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ సేకరించే కార్లను పూర్తిగా యాదృచ్ఛికంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ విషయంలో కారు తయారీదారు ప్రమేయం ఉండదు. ఒకవేళ కారు తయారీదారే నేరుగా, క్రాష్ టెస్ట్ కోసం కారును పంపించాల్సి వస్తే, సదరు తయారీదారు ఈ క్రాష్ టెస్ట్ ప్రత్యేకంగా మరియు ధృడంగా తయారు చేసిన కారును పంపించే చాన్స్ ఉంటుంది. కాబట్టి, గ్లోబల్ ఎన్‌క్యాప్ ఈ విషయంలో పూర్తిగా కారును యాదృచ్ఛికంగా ఎంపి చేస్తుంది.

Global NCAP క్రాష్ టెస్ట్ అంటే ఏమిటి? క్రాష్ అయిన కార్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

ప్లాంట్ లో ఉత్పత్తి చేయబడిన నిర్దిష్ట శ్రేణి కార్లను నివారించే విధంగా ఈ ఎంపిక జరుగుతుంది. క్రాష్ పరీక్షల సమయంలో పారదర్శకత కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ ద్వారా కారు తయారీదారు ప్రతినిధిని కూడా ఈ టెస్ట్ కోసం పిలవడం జరుగుతుంది. క్రాష్ టెస్ట్ తరువాత వివరణాత్మక సాంకేతిక తనిఖీ జరుగుతుంది. ఆ తరువాత, నివేదిక రూపొందించబడింది మరియు కారు నిర్మాతతో భాగస్వామ్యం చేయబడుతుంది.

Global NCAP క్రాష్ టెస్ట్ అంటే ఏమిటి? క్రాష్ అయిన కార్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌ల ఫలితాలను చర్చించడానికి, ఈ సంస్థ అధికారులు తయారీదారుని కలుస్తారు. ఈ క్రాష్ టెస్ట్ నివేదిక తరువాత గ్లోబల్ ఎన్‌క్యాప్ యొక్క కమ్యూనికేషన్ ఛానెళ్లలో ప్రచురించడం జరుగుతుంది. మరి ఈ క్రాష్ టెస్ట్‌ కోసం ఉపయోగించిన కార్ల ఖర్చును ఎవరు భరిస్తారు?

Global NCAP క్రాష్ టెస్ట్ అంటే ఏమిటి? క్రాష్ అయిన కార్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

కార్ల తయారీదారులే ఈ ఖర్చును భరిస్తారు..

మీరు ఇప్పటి వరకు కనీసం ఒక్క క్రాష్ టెస్ట్ వీడియోని అయినా చూశారా? ఒకవేళ చూడకపోయి ఉంటే, యూట్యూబ్ లో కానీ లేదా గ్లోబల్ ఎన్‌క్యాప్ వెబ్‌సైట్ లో కానీ ఈ వీడియోలో అందుబాటులో ఉంటాయి, ఓసారి చూడండి. ఈ క్రాష్ టెస్ట్ కోసం కేవలం ఒక్క కారును మాత్రమే కాదు, అదే మోడల్ కి చెందిన చాలా కార్లను ఉపయోగిస్తారు.

Global NCAP క్రాష్ టెస్ట్ అంటే ఏమిటి? క్రాష్ అయిన కార్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

ఈ కార్లను ముందు వైపు నుండి, వెనుక నుండి, సైడ్ నుండి ఇలా అనేక రకాలుగా క్రాష్ టెస్ట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో కారును వేగంగా దొర్లించడం లేదా కొంత ఎత్తు నుండి క్రిందకు విసిరివేయడం వంటి టెస్టులు కూడా నిర్వహిస్తారు. ఈ క్రాష్ టెస్టులో ఉపయోగించిన కార్లు పూర్తిగా నాశనం అవుతాయి.

Global NCAP క్రాష్ టెస్ట్ అంటే ఏమిటి? క్రాష్ అయిన కార్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

క్రాష్ టెస్ట్ పూర్తయిన తర్వాత, గ్లోబల్ ఎన్‌క్యాప్ సంస్థ సదరు కారు తయారీదారుకి ఇన్‌వాయిస్ పంపుతుంది. క్రాష్ టెస్ట్ చేయడానికి సంబంధించిన అన్ని సంబంధిత ఖర్చులను ఈ ఇన్వాయిస్ లో లిస్ట్ చేస్తారు. జాబితా చేస్తుంది. ఈ ఖర్చును మొత్తం పూర్తిగా తయారీదారులే భరించాల్సి ఉంటుంది.

Global NCAP క్రాష్ టెస్ట్ అంటే ఏమిటి? క్రాష్ అయిన కార్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

0-స్టార్ నుండి 5-స్టార్ వరకూ రేటింగ్స్..

గ్లోబల్ ఎన్‌క్యాప్ లో క్రాష్ టెస్ట్ నిర్వహించిన కార్లకు, సదరు టెస్ట్ లో అవి పెద్దలు మరియు పిల్లల సేఫ్టీ విషయంలో అందించే భద్రతను ఆధారంగా చేసుకొని వాటి రేటింగ్ ఇస్తారు. ఈ టెస్ట్ సమయంలో కారులో మనుషులతో సమానంగా ఉండే డమ్మీ బొమ్మలను వినియోగిస్తారు. ఈ బొమ్మలకు తగిలే గాయాల ఆధారంగా పాయింట్లను నిర్ధారిస్తారు.

Global NCAP క్రాష్ టెస్ట్ అంటే ఏమిటి? క్రాష్ అయిన కార్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

ఈ పాయింట్ల ఆధారంగా సదరు కారుకు 0 నుండి 5 వరకూ స్టార్ రేటింగ్ ఇస్తారు. ఇందులో 0-సేఫ్టీ రేటింగ్ పొందిన కారు అంటే, అది అత్యంత అసురిక్షతమైనదని మరియు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిందంటే అది అత్యంత సురక్షితమైన కారు అని పరిగణిస్తారు.

Most Read Articles

English summary
What is global ncap crash test and how it works who will bear the cost of crashed cars explaind
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X