ప్రమాదాలకు కారణమై.. ఘటనా స్థలం నుంచి పారిపోతే.. గరిష్టంగా 10 సంవత్సరాల జైలు, రూ.7 లక్షల జరిమానా..!
పెట్రోల్ బంకుల వద్ద ఆకస్మాత్తుగా రద్దీ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానుల సమ్మె ప్రకటనతో అనేక మంది వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. ఫలితంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే పెట్రోల్ బంకులకు పెరిగిన రద్దీ, సమ్మె వెనుక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కేంద్రం ఇటీవల కొన్ని నూతన చట్టాలను తీసుకొచ్చింది. అందులో భారతీయ న్యాయ సంహిత చట్టం (Bharatiya nyay sanhita) ముఖ్యమైనది. అయితే ఈ చట్టంలోని హిట్ అండ్ రన్ కేసులపై తీసుకొచ్చిన కఠిన నిబంధన ట్రక్కు డ్రైవర్ల ఆగ్రహానికి కారణం అయింది. ఈ చట్టం త్వరలో అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా మూడు రోజులపాటు నిరసనలకు పిలుపునిచ్చారు.

ఏంటీ హిట్ అండ్ రన్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత ఆధారంగా హిట్ అండ్ రన్.. పూర్తి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కిందకు వస్తాయి. అయితే ఇందులోని సెక్షన్ 104లో రెండు నిబంధనలున్నాయి. మొదటి నిబంధన ప్రకారం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇతరుల మరణాలకు కారణం అయితే గరిష్ఠంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు జరిమానా కూడా విధించవచ్చు.
అయితే ఇందులోని రెండో నిబంధనలపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన ఏం చెబుతుందంటే రోడ్డు ప్రమాదాలకు కారణం అయిన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు లేదా మేజిస్ట్రేట్‌కు కచ్చితంగా సమాచారం అందించాలి. సమాచారం ఇవ్వకుండా ఘటన స్థలం నుంచి పారిపోతే ఈ నిబంధన కింద గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

అయితే ఈ రెండో నిబంధనపై ప్రైవేటు బస్సులు, లారీలు, ట్రక్కుల డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో దీనిపై ట్రక్కు డ్రైవర్లు ఆందోళనలు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన అనంతరం డ్రైవర్లు ఘటన స్థలంలోనే ఉంటే స్థానికులు తమపై దాడి చేసే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతోపాటు హిట్ అండ్ రన్ కేసులో (Hit and Run) గరిష్ఠంగా పది సంవత్సరాలపాటు శిక్ష పడితే అన్ని రోజులు తన కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు రూ.7 లక్షల జరిమానా కూడా చెల్లించడం సాధ్యం కాదని చెబుతున్నారు.

హిట్ అండ్ రన్ చట్టం ఉద్దేశం ఏంటీ : కేంద్రం చెబుతున్న వివరాల ప్రకారం హిట్ రన్ కేసులో సమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో సరైన సందర్భాల్లో సరైన సమయానికి వైద్య సాయం అందక ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఇలాంటి సమయంలో పోలీసులకు సమాచారం అందితే వారిని సకాలంలో హాస్పిటల్‌కు తరలించి, ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








