టైర్ల కింద నిమ్మకాయలు ఉంచి ఎందుకు తొక్కిస్తాం? దీంతో ఏంటి ప్రయోజనం.. దీని వెనుక అసలు రహస్యం ఇదే!

భారతదేశంలో సంస్కృతి, సాంప్రదాయాలకు అత్యంత విలువనిస్తారు. ప్రతి హిందువు కూడా జాతకం, జ్యోతిష్యంపై నమ్మకం కలిగి ఉంటారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే సమయంలో లేదా వస్తువులను కొనుగోలు చేసే సమయంలో అయినా కచ్చితంగా మంచి శుభముహుర్తం చూసుకుని పనులు మొదలుపెడతారు. అందరు కూడా దేశంలో ఆచారాలను నియమ నిష్టలతో పాటిస్తుంటారు. ముఖ్యంగా కొత్త వాహనాలను మొదటగా నడిపే సమయంలో టైర్ల క్రింద నిమ్మకాలను కచ్చితంగా ఉంచుతారు. ఈ ఆచారం ఇప్పటిది కాదు. పురాతన కాలంగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కొత్తగా బైక్ లేదా కార్స్, ఇతర వాహనాలను నడిపినప్పుడు లేదంటే ఎక్కడికైన దైవ దర్శనాలు, దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ముందుగా టైర్ల క్రింద నిమ్మకాయలను ఉంచి వాటిని తొక్కించిన తరువాతనే వాహనాలను నడుపుతారు.

పురాతన కాలం నుంచి ప్రతిఒక్కరు పాటిస్తున్న ఈ అలవాటు వెనుక కారణం ఏమై ఉంటుందని ఎప్పుడైన ఆలోచించారా..? అసలు ఈ అలవాటు ఎలా,ఎప్పటి నుంచి వచ్చింది..? జ్యోతిష్యం ప్రకారం దీనికి ఇతర కారణం ఏమైనా ఉందా..? ఆ వివరాలను ఒకసారి క్రింది కథనంలో తెలుసుకుందాం. జ్యోతిషశాస్త్రం ప్రకారం చూసినట్లయితే నిమ్మకాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి చెడు శక్తిని దగ్గరికి రానివకుండా చేస్తాయని అందరు నమ్ముతారు.

lemon kept under the tyre vehicle

భారతదేశంలో వేదాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అందరికి తెలిసిందే. సాధారణంగా ఏదైనా కొత్త వస్తువుల చుట్టూ ప్రతికూల చెడు శక్తుల ప్రభావం ఉంటుందని అందరి నమ్మకం. వీటి ప్రభావంతో వాటికి ఏం జరగకుండా ఉండటానికి నెగిటీవ్ ఎనర్జీని తరిమివేయడానికి కొత్త వస్తువుల చుట్టూ నిమ్మకాయలు పెట్టాలని భారతీయుల ప్రతి ఒక్కరి నమ్మకం. అందుకే వాహనాల టైర్ల కింద నిమ్మకాయలు పెడుతారు.

దీంతో ఆ వాహనానికి ఏ ప్రమాదం జరగదని, అలాగే ఎలాంటి చెడు శక్తులు దరిచేరవని ఇలా చేస్తుంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం చూసినట్లయితే నిమ్మకాయలకు చంద్రుడు, శక్రుడితో అవినవభావ సంబంధం ఉంటుంది. నిమ్మరసం చంద్రునితో దగ్గరి సంబంధం కలిగి ఉంది, అదే నిమ్మకాయలోని పులుపు శుక్రగ్రహంతో ముడిపడి ఉంటుంది. శుక్ర, చంద్ర స్థానాలు బలంగా ఉంటే మనుషుల జాతకాలు కూడా బలంగా ఉంటాయని జ్యోతిషశాస్త్రం పేర్కొంటుంది.

Lemon Under The Tyre

జాతకంలో ఈ రెండు కూడా బలంగా ఉంటే చెడు శక్తి దగ్గరికి రాకుండా, మొదలుపెట్టిన పనులు విజయవంతం అవుతాయని, ఇతర చాలా ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిషశాస్త్రంలో ఉంటుంది. అందుకే కొత్త వాహనాన్ని మొదట నడిపే సమయంలో టైరు కింద నిమ్మకాయను ఉంచి తొక్కిస్తే, దాని చూర్ణం ద్వారా వాహనానికి ఎలాంటి కీడు జరగదని, శుక్ర, చంద్ర స్థానాలు మరింత బలపడి వాహనానికి రక్షణ లాంటిది ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటారు.

అందుకే లగ్జరీ కార్ల నుంచి మొదలుకుని ఇతర అన్ని వాహనాల వరకు ప్రతి ఒక్కదానికి టైర్ల కింద నిమ్మకాయలను ఉంచి తొక్కిస్తారు. జాతకంలో శుక్రుడు, చంద్రుడు బలంగా ఉంటే ఆర్థిక పురోగతి, ఇల్లు, అందమైన కుటుంబం జీవితం లభిస్తుందని, సవాళ్లను కూడా సులువుగా ఎదుర్కొంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతారు.

డ్రైవ్‌స్పార్క్ చివరగా ఏం చెబుతుందంటే.. వాహనాల టైర్ల కింద నిమ్మకాయలను తొక్కించడానికి ఈ కారణం మాత్రమే కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. దీన్ని పురాతన కాలం నుంచి అనుసరిస్తున్నారు. అప్పట్లో వాహనాలు ఉండేవి కావు. అందరు కూడా ఆవులు, గుర్రాలు, గాడిదలను రవాణాకు వాడేవారు. ఇవి ప్రయాణిస్తున్న మార్గంలో రాళ్లు, ముళ్లతో వాటి పాదాలకు గాయాలు అయ్యేవి. దీంతో అవి బాధతో విలవిల్లాడిపోయేవి.

ఈ క్రమంలో వాటి పాదాలకు రాళ్లు, ముళ్లు ఇతర వాటితో గాయాలు కాకుండా చూడటానికి నిమ్మకాయలను తొక్కించి తీసుకెళ్లేవారు. దీని వెనుక ప్రధాన కారణం నిమ్మకాయ సాధారణంగా సహజసిద్ధమైన యాంటీసెప్టిక్‌గా ఉపయోగపడుతుంది. దీంతో జంతువులకు అయ్యే గాయాల నుంచి రక్షణ లభిస్తుందని ప్రతి ఒక్కరు ఇలా చేసేవారు. ఆ తరువాతి క్రమంలో ఇది ఒక ఆచారం లాగా మారిపోయి వాహనాలకు టైర్ల కింద తొక్కించడం ఒక అలవాటుగా మారిపోయింది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 28, 2025, 17:56 [IST]
English summary
What is reason of lemon kept under the tyre vehicle know all details check here
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+