విమానం ఇంజిన్ ఎంత శక్తివంతమైనదో మీకు తెలుసా.??.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.!!
విమాన ప్రయాణాలు(Flight Engine Horsepower) ఒకప్పుడు ధనవంతులకే పరిమితం. కానీ ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు కూడా ఫ్లైట్ సర్వీసులను వినియోగించుకోగలుగుతున్నారు. అయితే ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు మీరెప్పుడైనా విమానం ఇంజిన్ ఎలా పనిచేస్తుంది.. అది ఎంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందని మీరెప్పుడైనా ఆలోచించారా.?? ఈ కథనం మీకోసం..
విమాన ప్రయాణాలు(Airplane Engine) అంటే ఇష్టపడని వారుండరు. ఆకాశంలో విహరిస్తూ మబ్బులపై తేలియాడుతూ గాల్లో అత్యంత వేగంగా ప్రయాణించడంలో చాలా మంది మంచి అనుభూతిని పొందుతారు. అయితే విమానాలు అంత స్పీడ్‌లో ఎందుకు వెళ్తాయి. బస్సులు, కార్లు, రైళ్లు ఎందుకని అంత స్పీడ్‌గా వెళ్లవు.?? వాటి ఇంజిన్లలో తేడాలేంటి..?? ఇక్కడ తెలుసుకుందాం..

ఆకాశంలో విమానం చాలా వేగంగా దూసుకుపోతుంది. వందల కిలోమీటర్ల దూరాన్ని చాలా తక్కువ సమయంలో చేరుకుంటుంది. అయితే రోడ్డు మార్గంలో రవాణా రంగంలో ముఖ్యమైనది రైలు. వాయు రంగంలో విమాన సర్వీసులు. బస్సులు, కార్లు, లారీలతో పోలిస్తే రైళ్లు చాలా వేగంగా ప్రయాణిస్తాయి. ఇక రైళ్లతో పోలిస్తే విమానాలు కొన్ని రెట్ల వేగంతో దూసుకుపోతాయి.
నేలపై రైలు, ఆకాశంలో విమానం రెండూ ప్రయాణికులు, సరుకులు గమ్యస్థానాలకు చేర్చగలవు. అయితే రైలు మాత్రం ఎందుకని అంత స్పీడ్‌గా(Train Engine) వెళ్లదు.. విమానం ఎందుకని(Flight Engine) అంత వేగంగా వెళ్తుందని ఎప్పుడైనా గమనించారా.?? ఈ రెండింట్లో దేనికి పవర్‌ఫుల్ ఇంజిన్ ఉంటుందో తెలుసా.??

రైలు ఒకేసారి వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. అయితే విమానం మాత్రం ఒకేసారి కొన్ని వందల మందిని మాత్రమే తీసుకెళ్లగలుగుతుంది. భారత్‌లో ఎలక్ట్రిక్, డీజిల్ వంటి రెండు రకాల ట్రైన్ ఇంజిన్లతో రైళ్లు పనిచేస్తాయి. అయితే ప్రస్తుతం మన దేశంలో కొన్ని హెరిటేజ్ రైళ్లు మాత్రమే స్టీమ్ లోకోమోటివ్స్‌తో నడుస్తుండగా.. మిగిలిన రైళ్లు డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్లతో పనిచేస్తున్నాయి.
అయితే సాధారణంగా కారు ఇంజిన్ దాదాపుగా 200 హార్స్‌పవర్‌ను కలిగి ఉంటుంది. కానీ రైలు ఇంజిన్లు అంతకంటే ఎక్కువ అంటే 2,000 నుంచి 4,5000 వరకు శక్తివంతమైన హార్స్‌పవర్‌ను కలిగి ఉంటాయి. కాగా అతి చిన్న లోకోమోటివ్ ఇంజిన్లు మాత్రం 2,000 హార్స్‌పవర్‌తో నడుస్తాయి. కాగా ఇటీవల 12,000 హార్స్ పవర్ ఔట్‌పుట్‌తో పనిచేసే అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ Wag12B ని భారతీయ రైల్వే ప్రవేశపెట్టింది.

అసలు విషయానికొస్తే.. విమానం రైలు కంటే చాలా వేగంగా ప్రయాణించగలదు. గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది. కానీ రైలుకు మాత్రం చాలా సమయం పడుతుంది. దీనికి కారణం రైలు ఇంజిన్ కంటే విమానం ఇంజిన్ చాలా పవర్‌ఫుల్ ఔట్‌పుట్‌ను కలిగి ఉంటుంది.
జెట్ ఇంజిన్లు 30,000 కంటే ఎక్కువ హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేస్తాయట. రైళ్లతో పోలిస్తే ఇది కొన్ని రెట్లు ఎక్కువ. ఈ ప్రకారం చూసుకుంటే.. రైళ్లు, సూపర్ కార్లు, ట్రక్కుల హార్స్ పవర్‌తో పోలిస్తే విమానం ఎంత స్పీడ్‌గా ప్రయాణిస్తుందో ఊహించుకోవచ్చు. అంతేకాకుండా విమానాలు చాలా బరువైనవి. వాయు మార్గం ద్వారా ప్రయాణికులు, సరుకులను తీసుకెళ్లాలి కాబట్టి.. వీటిలో శక్తివంతమైన ఇంజిన్లను అమర్చుతారు.
విమాన ప్రయాణంలో ఇన్ని విశేషాలు ఉంటాయి కాబట్టే.. టేకాఫ్‌కు ముందు భద్రతా సిబ్బంది, ఎయిర్ లైన్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అన్నీ పరిశీలించిన తర్వాత.. అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతనే విమానం గాల్లోకి ఎగురుతుంది. లేదంటే టేకాఫ్ అయ్యాక ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే అత్యవసరం ల్యాండింగ్ చేస్తారు.


Click it and Unblock the Notifications








